DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం లో ఈఓ ప్రధాన అర్చకుల సస్పెన్షన్ కు డిమాండ్ 

*అర్చకులకు లేని దర్శనం దళారీకి ఎలా ఇచ్చారు : అర్చకులు*  

*రాజుల కుటుంబానికే ఆహ్వానం లేదు దళారీ à°•à°¿ ఎలా ఇచ్చారు?* 

*ప్రధాన అర్చకుణ్ణి సస్పెండ్

చెయ్యాల్సిందే: అర్చకులు* 

*బయట పడ్డ వివాదాలు, అలిగిన స్థానాచార్యులు. .*

*రాజా కుటుంబానికే ఆహ్వానం లేదు: . .పాశర్ల. .*

*మహిళా జుట్టు కట్టు లేకుండా గుడికి

రావచ్చా? . .*

*చందనోత్సవ దర్శనం పై ఇరకాటం లో ఈఓ ఉక్కిరిబిక్కిరి.*  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, ఏప్రిల్ 28, 2020 (డిఎన్ఎస్) : కరోనా

కట్టడి సమయంలో చందనోత్సవం లో ఎవరికీ దర్శనం లేవని ప్రకటించిన సింహాచల దేవస్థానం ఈఓ వెంకటేశ్వర రావు  à°ªà±à°°à°§à°¾à°¨ అర్చకులు గోపాలకృష్ణ లు à°’à°• దళారి ఎలా దర్శనం

కల్పించారని అర్చకులు  à°­à°•à±à°¤à±à°²à± ప్రశ్నిస్తున్నారు. దీనికి భాద్యుల్ని చేస్తూ ఇద్దరినీ తక్షణం సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ సైతం చేస్తున్నారు. వివరాల్లోకి

వెళితే.  .

ప్రధాన అర్చకుణ్ణి సస్పెండ్ చెయ్యాల్సిందే: అర్చకులు. . . 

వైశాఖ శుద్ధ తదియ రోజున శ్రీ సింహాచల క్షేత్ర శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి నిజ రూప

దర్శనాన్ని కల్పించడం జరుగుతుంది. ఈ ఏడాది కరోనా ప్రభావంతో భక్తులతో పాటు కొందరు అర్చకులకు కూడా విధులు రద్దు చేసారు. అయితే ఈ ఏడాది చందన యాత్ర ( 26 న ) కేవలం 15 మంది

వైదిక సిబ్బంది ని మాత్రమే అనుమతిస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఏడాది పాటు స్వామి అర్చనలోనే తరించిన మిగిలిన అర్చకులను కనీసం కొండ పైకి కూడా అనుమతించకుండా

క్రిందనే ఆపేసారు.  à°¦à±€à°‚తో వీళ్లంతా నిరాశకు లోనయ్యారు. వీరిలో చాలామంది గర్భాలయంలో నిత్యం ఆరాధనలు చేసేవారీ ఉన్నారు. 

అయితే దేవస్థానం లోని సీసీ

కెమెరాల్లో రికార్డు అయినా దృశ్యాల ప్రకారం తిరుపతి శ్రీను అనే ఒక దళారీ ( సింహాచలం తిరుమల శ్రీరంగం సహా అన్ని ప్రధాన ఆలయాల్లోనూ ఇతను నేరుగా దర్శనం చేయించడం లో

సిద్ద హస్తునిగా పేరు ఉంది.) ప్రధాన అర్చకుడు గోపాల కృష్ణ తో కలిసి ఆలయ ప్రవేశం చేసినట్టు కనిపించడం పెద్ద దుమారమే లేపింది. దీంతో మిగిలిన అర్చకులు ఆలయంలో అర్చన

చేసే తమకు లభించని స్వామి దర్శనం ఒక దళారి కల్పించిన ప్రధాన ప్రధాన అర్చకుని తక్షణం విధులనుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తమను కొండ క్రిందనే దేవస్థాన

ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పాలూరి నర్సింగ రావు ఏఈఓ లు తిరుమలేశ్వర రావు ఆనంద కుమార్లు  à°µà±ˆ శ్రీనివాస రావ్ , రమణ లు నిలిపివేశారన్నారు. అర్చకులనే నిలిపివేసిన

వీళ్ళు à°’à°• దళారిని కొండపైకి ఎలా పంపారన్నారు. 

బయట పడ్డ వివాదాలు, అలిగిన స్థానాచార్యులు. .

ముందుగా ఈ ఓ తో జరిగిన సమావేశం లో స్థానాచార్యులు రాజగోపాల్

ఆలయంలో విధులు నిర్వహించే వైదిక సిబ్బంది ని అందరిని అనుమతించాలంటూ ఒక లిస్ట్ తయారు చేసి ఈఓ కు ఇచ్చినట్టు అర్చకులు తెలియచేస్తున్నారు. అయితే ప్రధాన అర్చకులు

తనకు అనుకూలంగా ఉండే 10 - 15 మందిని మాత్రం అనుమతించాలని కోరడంతో ఈఓ కేవలం 10 మందినే అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసారు. ఇలాంటి నిబంధనలు ఉన్న సమయంలో ఈఓ ఒక దళారిని ఎలా

అనుమతించారో చెప్పాలని అర్చకులు డిమాండ్ చేస్తున్నారు. తనవెంట ఆలయంలోకి తీసుకు వీళ్ళిన ప్రధాన అర్చకుని తక్షణం సస్పెండ్ చెయ్యాలి డిమాండ్ చేశారు. 

రాజా

కుటుంబానికే ఆహ్వానం లేదు: . .పాశర్ల. .

కరోనా కట్టడిని భూతంగా చూపిస్తూ ఆలయంలోకి ఎవ్వరిని అనుమతించని ఈఓ వెంకటేశ్వర రావు, కనీసం ఆలయ వంశ ధర్మకర్తలైన రాజా

కుటుంబానికి సైతం ఆహ్వానం పలకలేదని మాజీ ట్రస్ట్ సభ్యులు పాశర్ల ప్రసాద్ తెలిపారు. మరి ఒక దళారిని ఎలా అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. దీనికి బాధ్యుణ్ణి చేస్తూ

ఆలయ ఈఓ వెంకటేశ్వర రావ్ ను సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేసారు. 

*బయట పడ్డ వివాదాలు, అలిగిన స్థానాచార్యులు. .*

ప్రధాన అర్చకులు స్థానాచార్యులు మధ్య ఉన్న

విభేదాలు చందనోత్సవం సమయంలో జరిగిన కార్యాచరణలో బయటపడ్డాయి. ఒకానొక సమయంలో స్థానాచార్యులు ఆలయం వదిలి బయటకు రావడంతో ఈఓ కల్పించుకుని అప్పడికి సమర్ధించడం

జరిగింది. అయితే దీనికి ప్రధాన కారణం విధుల్లో ఉన్న అర్చకులను కూడా గుడి లోకి రానివ్వకుండా పో టు దగ్గర పోలీసులను పెట్టి నిలపడమే. దీంతో స్థానాచార్యులు మాటకు

కూడా విలువ లేకపోవడంతో అయన బయటకు రావడం జరిగింది. 

మహిళా జుట్టు కట్టు లేకుండా గుడికి రావచ్చా? . .

హిందూ సంప్రదాయం లో ఒక మహిళా ఎప్పుడూ జుట్టు విప్పుకుని

ఉండకూడదని à°’à°• 
వైదిక, అర్చక సిబ్బంది తెలియచేసారు. అలాంటిది à°† వేష ధారణ లో గుడిలోకి అస్సలు రాకూడదన్నారు.  à°¸à°¿à°‚హాచల క్షేత్రం చైర్మన్ హోదా లో ఉన్నవారు కచ్చితంగా

హిందూ సంప్రదాయంలోనే గుడిలోకి రావాలన్నారు. అయితే చందనయాత్ర రోజున సింహాచలం దేవస్థానం చైర్మన్ జుట్టు ముడి / కట్టు లేకుండా  à°µà°¿à°ªà±à°ªà±à°•à±à°¨à°¿ రావడమే కాకుండా . స్వామి

వారికి పట్టు వస్త్రాలు కూడా ఇవ్వడం గమనార్హం. సంప్రదాయం వీరికి తెలిసి ఉండక పొతే ..  
చెప్పవలసిన భాద్యత ఆలయ స్థానాచార్యులు దే.  à°…యితే ఆయన తన భాద్యతను పూర్తిగా

విస్మరించారు. సంప్రదాయం గా ఉండే వైదిక సిబ్బంది లోనే తప్పులు వెదికే స్థానాచార్యులు తమ తప్పులు తెలియక పోవడం గమనార్హం. ఇదే విషయాన్ని వైదిక పరులు భక్తులు ఆవేదన

వ్యక్తం చేస్తున్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam