DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పదవి కన్నా వ్యక్తిత్వమే మిన్న అనే వ్యక్తి ఎల్ వి ఎస్. : . .  

నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యం à°ˆ ఆధ్యాత్మిక వేత్త   . . .

విద్యావేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా, , అత్యున్నత సేవలు 

నిబంధనలను యధాతధంగా అమలు చేసిన

ధీశాలి..

కేసుల్లో ఇరికించినా, పదవి భ్రష్టం చేసినా దూషించని ఉత్తములు. . .

ఘోర అవమానాలల్లో వైఎస్ జగన్ పాత్ర కీలకం కావడం యాదృచ్చికం. 

నేడు ఎల్వి.ఎస్

పదవీ విరమణ సందర్బంగా ఒక ప్రత్యేక వ్యాసం.

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, ఏప్రిల్ 30, 2020 (డిఎన్ఎస్) : పదవి కోసమే వ్యక్తిత్వాలను

తాకట్టు పెట్టె వాళ్ళున్న ప్రస్తుత సమాజం లో పదవి కన్నా వ్యక్తిత్వమే మిన్న అనే వ్యక్తుల్లో ప్రత్యక్షంగా నిలిచినవారు సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి  à°Žà°²à± వి

సుబ్రహ్మణ్యం. . దానికి నిదర్శనమే ప్రధాన కార్యదర్శి పదవి కోల్పోతానని తెలిసినా తన వ్యక్తిత్వాన్ని తగ్గించుకొని ధీశాలి. గురువారం ఆయన పదవి విరమణ చేశారు. ఈ

సందర్బంగా à°’à°• ప్రత్యేక వ్యాసం.  

ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో అత్యున్నత వ్యక్తిత్వం కల్గిన ఉన్నతాధికారుల్లో అగ్రగణ్యులు సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్. వి

సుబ్రహ్మణ్యం. గత ఎన్నికల సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా అత్యున్నత కార్యదక్షత చూపించి, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ఘాటైన విమర్శలు

కూడా ఎదుర్కొన్నప్పటికీ, నిబంధనలకు ఏనాడూ విరుద్దంగా వెళ్ళలేదు. ఎన్నికల సమయంలో కేవలం కేంద్ర ఎన్నికల ఆదేశాల ప్రకారమే పూర్తిస్థాయి నిబంధనలు అమలు చేసి,

ప్రజల్లో మంచి పేరు సాధించారు. అయితే నాటి అధికార పార్టీ తెలుగుదేశం క్యాడర్ ప్రత్యక్షంగా ఎల్ వి ఎస్ ను దుమ్మెత్తి పోసింది. ఎన్నికల అనంతరం అధికారం లోకి వచ్చిన

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పరిపాలన అంటే ఏంటో అర్ధం చేసుకునే వారకూ ఎల్ వి ఎస్ ను ప్రధాన కార్యదర్శిగా కొనసాగించారు. అనంతరం ముఖ్యమంత్రి, మంత్రి మండలి తీసుకున్న

నిర్ణయాలను విభేదించడం తో పాటు, కొన్ని వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్ వి ఎస్ పై నిర్దాక్షిణ్యంగా వేటు వేసి,

ప్రజలందరి నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొన్నారు. అత్యున్నతా స్థాయి నుంచి ఎల్ వి ఎస్ ను ఏమాత్రం ప్రాధాన్యత లేని పోస్ట్ లో బదిలీ చెయ్యడం తో, నాటి నుంచి ఎల్ వి

ఎస్ సెలవు పై వెళ్లారు. నేటికీ విధుల్లో చేరలేదు. 

అవమానాల్లో వైఎస్ జగన్ పాత్ర ఉండడం యాదృచ్చికం. . .:

ఎల్ వి ఎస్ ఎదుర్కొన్న అవమానాల్లో ప్రత్యక్షంగానో ,

పరోక్షంగానో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉండడం యాదృచ్చికం. ఎన్నడూ ఆయన  à°¨à°¿à°¬à°‚ధనలకు వ్యతిరేకంగా వెళ్లలేదని, నిజాయితీనే నమ్ముకున్నట్టు ఆయన సన్నిహితులకేకాదు,

రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గతం లోనూ ఇదే వైఎస్ జగన్ అక్రమార్జనల కేసుల కారణం గా ఎల్ వి ఎస్ పై పలు విమర్శలు వచాయి, ఆఖరికి కోర్టు గుమ్మం కూడా తొక్కవలసి వచ్చింది.

అయితే ఆయన నిజాయితీ కారణంగా అన్ని కేసులనుంచి పూర్తి ఉపశమనం లభించింది. 

నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఈయనే కావడం గమనార్హం. అయితే కొన్ని నెలలు ఇద్దరి మధ్య సానుకూలత ఉన్నప్పటికీ, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ముఖ్యమంత్రి ఎల్విస్ ను పదవి బ్రష్టుణ్ణి చేశారు.  à°ˆ అంశంలో

వైఎస్ జగన్ పాత్ర ప్రత్యక్షంగా ఉండడం గమనార్హం. ముఖ్యమంత్రి ఆదేశం లేకుండా ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని తొలగించడం జరిగే పని కాదు. రెండు కేసుల్లోనూ వైఎస్

జగన్ కారణంగానే అత్యంత మేధావి, విద్యావంతుడు ఎల్ వి సుబ్రహ్మణ్యం ఘోరంగా అవమానించబడ్డారు. 

నవంబర్ 6వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుండి మానవ వనరుల

అభివృద్ధికి బదిలీ అయిన దగ్గర నుండి ఆరు నెలల పాటు సెలవుపై ఉన్నారు. పదవీ విరమణ చేయాల్సిన దృష్ట్యా ఎల్.వి. సుబ్రహ్మణ్యం నిన్న జిఎడి కి రిపోర్ట్ చేసి గురువారం పదవి

విరమణ చేసారు.  

విద్యావేత్త, ఆధ్యాత్మిక వేత్త గానూ :  . . .

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు 1983 ఐ ఏ ఎస్ బ్యాచ్ కి చెందిన అపరమేధావి ఎల్ వి ఎస్ విద్యావేత్తే కాక,

 à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°•à°µà±‡à°¤à±à°¤à°•à±‚డానూ. . . ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వర రావు లాంటి పెద్దల మార్గదర్శకం లో ఎన్ని కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా

పాల్గొంటున్నారు. 

1983 బ్యాచ్ కి చెందిన ఎల్.వి.సుబ్రహ్మణ్యం అఖిల భారత సర్వీసులో మొదటి ప్రయత్నంలోనే 17వ ర్యాంకు సాధించారు. నల్గొండ జిల్లాకు శిక్షణకు వెళ్లిన

మొదటి అధికారి సుబ్రహ్మణ్యం. 1986లో వరంగల్ జిల్లా ములుగు సబ్-కలెక్టర్ గా పని చేసిన సందర్భంలో సమ్మక్క సారలమ్మ జాతరలో ఎన్నో మంచి మార్పులు తీసుకొచ్చి ముఖ్యంగా

భక్తుల మన్ననలు పొందారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, స్వతహాగా, ఆధ్యాత్మిక పరంగా అనుభవం ఉండడంతో ఉత్సవాలు, వేడుకలను అత్యద్భుతంగా

నిర్వహించడం లో కీలక పాత్ర పోషించారు. 

పార్వతీపురం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిగా ఎల్.వి.సుబ్రహ్మణ్యం మూడేళ్ల పాటు పని చేసి గిరిజనుల మౌలిక అంశాలపై దృష్టి

పెట్టి సృజనాత్మకమైన అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. గిరిజన భూములకు సాగునీటి సౌకర్యాలు, పోడు భూములను ఉద్యానవనాలుగా మార్చి అందరి ప్రశంసలు పొందారు. గిరిజన

విద్యాభివృద్ధికి సృజనాత్మకమైన పథకాలను అమలు చేశారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా కొద్ది రోజులు పనిచేసాక, 1990లో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ అయ్యారు. ఈ

సందర్బంగా గ్రామీణ, గిరిజన అభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు చేపట్టారు.మధ్యలో ఒక సంవత్సరం పాటు బ్రిటన్ లో ఎకనామిక్స్ లో ఎం.ఎస్.సి డిగ్రీ కోసం యూనివర్సిటీ అఫ్

బ్రాడ్ఫోర్డ్ లో చేరారు. మళ్ళీ భారత్ కి వచ్చాక రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండిగా పని చేసిన సమయంలో భారీ గ్రామీణ గృహ నిర్మాణ పథకం అమలు చేస్తూ తక్కువ ఖర్చుతో

కూడుకున్న సాంకేతికతను అమలు చేసి ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నారు. 1987లో హైదరాబాద్ వాటర్ వర్క్స్ వైస్ చైర్మన్, ఎండి గా కంప్యూటరీకరణ ద్వారా వినియోగదారులకు మరింత

చేరువలో సేవలు ఉండేలా సంస్కరణలు తీసుకొచ్చారు. చుట్టూ ఉన్న ఏడు మున్సిపాలిటీలలో (ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిథిలో ఉన్నాయి) నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచిన తీరు

ప్రజలు, నాయకుల ప్రసంసలు అందుకుంది. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కూడా ఎల్.వి.సుబ్రహ్మణ్యం హయాంలోనే చేపట్టారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు

ఉన్నతాధికారి గా సైతం మెరుగైన సేవలు అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా పనిచేసి తనదైన శైలి లో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు రూపకల్పనచేసి భక్తుల

మనసులో నిలిచిపోయారు సుబ్రహ్మణ్యం. 

ఈయన ప్రస్థానం à°’à°• పాఠమే.: . . .  . .

సీఎస్ గా పదవి కోల్పోయే సమయంలో తన వ్యక్తిత్వాన్ని వదిలేసి ఉంటె ఈయన నేడు ప్రధాన

కార్యదర్శి హోదాలోనే పదవి విరమణ చేసి ఉండేవారు. అయితే తనకి పదవి కన్నా వ్యక్తిత్వమే మిన్న అనే వ్యక్తి ఎల్ వి ఎస్. 

రాజకీయ ఒత్తిళ్లే అధికార పోస్టింగ్ లు

జరుగుతున్నా ప్రస్తుత సమాజం లో ఎల్ వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్  à°µà±ƒà°¤à±à°¤à°¿ నిబద్దత ప్రస్థానం ప్రస్తుత ఐఏఎస్ లకు à°’à°• పాఠం నేర్పుతోంది అనడం అతిశయోక్తి కాదు. ఏ రాజకీయ

పార్టీకి కొమ్ము కాయకుండా, కేవలం నిబంధనలకు లోబడి విధులు నిర్వహిచిన కారణంగా ఎల్ వి ఎస్  à°’à°• సారి కోర్టు గుమ్మం ఎక్కారు, మరో సారి అత్యున్నత హోదాను కూడా

కోల్పోయారు. అయినప్పటికీ అయన వ్యక్తిత్వం లో ఎక్కడా దిగజారలేదు. అందుకే ప్రజల్లో ఆయనకు అత్యున్నత గౌరవం లభిస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam