DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసులు ప్రజలతో మమేకమై పని చేసేలా కృషి : డిజిపి ఆర్ పి ఠాకూర్ 

తిరుపతి, జులై 3 . 2018 (DNS Online ) : ప్రజలతో మమేకమై, పనిచేసేలా పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ నూతన డిజిపి ఆర్ పి ఠాకూర్ తెలిపారు. శనివారం తిరుమల

శ్రీనివాసుని దర్శించుకున్న అనంతరం తిరుపతి పోలీసు అతిధి గృహం లో  à°¤à°¿à°°à±à°ªà°¤à°¿ మరియు చిత్తూర్ జిల్లా పోలీస్ à°¡à°¿.యస్.పి స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం

నిర్వహించారు, అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నా యొక్క ఆశయం ఫ్రెండ్లీ పోలీసింగ్, ఈ విధంగానే ముందుకి వెళ్తాను. పోలీస్

వ్యవస్థలో ర్యాంక్ పరంగా హోదాలు ఉన్డోచ్చు కాని, అందరం ఒకటే కుటుంబం అన్నారు. ఈ కుటుంబంలో ఎవరికి కష్టం వచ్చినా వారికి సహాయపడడంలో కుటుంబ పెద్దగా ముందు

ఉంటాననున్నారు. ఎక్కడా ఎవరికి సమస్య రాకుండా చూసుకునే భాద్యత కూడా నాపై వుంది. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో ఇప్పుడున్న పరిస్థితిలో సాంకేతిక పరిజ్ఞానం చాలా

అవసరమని,  à°…ందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించుకొని, పోలీస్ సేవలను ప్రజలుకు చేరువయ్యేందుకు కృషి చేస్తానని. తిరుపతిలో అర్బన్ యస్.పి గారి ఆద్వర్యం

సి.సి. కెమరాల వ్యవస్థ చాలా అధ్బుతంగా పనిచేస్తూఉన్నదని అభినందించారు.  à°šà°¿à°¨à±à°¨ చిన్న మార్పులు చేసి ఇంకా బాగా పనిచేసే విదంగా చూస్తామన్నారు. అలాగే రాబోవు తిరుమల

శ్రీవారి బ్రహ్మోత్సవాలని దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతిలో పూర్తిగా సి.సి కెమరాల పర్యవేక్షణలో ఉండే విధంగా ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే

సాదారణ సిబ్బందిని కూడా పెంచుతామన్నారు. మరియు తిరుపతి తిరుమల నందు ట్రాఫిక్ సమస్య కూడా ఉందని టి.టి.డి వారితో సంప్రదించి పార్కింగ్ స్థలాలను చూసుకొని సమస్యను

పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని తెలియచేసారు. రహదారులు, హైవేల యందు అవసరమైనచోటే బ్యారికేడ్స్ ను పెట్టి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని

తెలియజేసారు. 
à°ˆ సమావేశానికి అనంతపూర్ రేంజ్ à°¡à°¿.ఐ.జి  à°œà±‡.ప్రభాకర్ రావు ఐ.పి.యస్, కర్నూర్ రేంజ్ à°¡à°¿.ఐ.జి.  à°œà°¿.శ్రీనివాస్ ఐ.పి.యస్, తిరుపతి అర్బన్ యస్.పి  à°…భిషేక్ మహంతి

ఐ.పి.యస్, చిత్తూరు యస్.పి  à°¯à°¸à±.వి.రాజశేఖర్ బాబు ఐ.పి.యస్, తిరుమల యస్.పి మురళి కృష్ణ , తిరుపతి మరియు చిత్తూర్ జిల్లా అడిషనల్ యస్.పి లు, à°¡à°¿.యస్.పి లు, ఏ.ఆర్ à°¡à°¿.యస్.పి లు, à°Ÿà°¿.à°Ÿà°¿.à°¡à°¿

విజిలెన్సు అధికారులు, పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam