DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మే 3 వవారం తర్వాతే విహంగ యానాలు . . రైలు ప్రయాణాలు.

*విమానాలు, రైళ్లలో  à°à°°à±à°ªà°¾à°Ÿà±à°²à±, సీటింగ్ ఇలాగే . ఉండవచ్చు.. .

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 01, 2020 (డిఎన్ఎస్):  à°•à°°à±‹à°¨à°¾à°µà±ˆà°°à°¸à±

వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ అనంతరం మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా బస్సులు, రైళ్లు, విమానాలు అన్నీ ఎక్కడికక్కడ

నిలిచిపోయాయి. సుమారు 40 రోజుల దిగ్బంధనం తర్వాత ప్రయాణ సన్నాహాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఒక ప్రముఖ మీడియా సంస్థ దేశ వ్యాప్తంగా చేపట్టిన సర్వ్

లో తదుపరి సన్నాహాలు చూచాయగా తెలుస్తున్నాయి. అయితే ఇది అధికారికం కాక పోవచ్చు. దీని ప్రకారం. 

మే నెల  à°®à±‚డో వారం తర్వాత కానీ ప్రారంభించే అవకాశాలున్నాయి.

అయితే ప్రయాణాలు మాత్రం ఇదివరకు ఉన్నట్లు ఉండవు. అవి పూర్తిగా మార్పు చెందుతాయని ఒక ఉన్నతాధికారి స్పష్టం చేశారు.

విమాన ప్రయాణాలు ఇలా...

లాక్ డౌన్ తర్వాత

విమానాలను ఎలా నడపాలి అన్న అంశంపై ఎయిర్‌పోర్ట్స్ అథార్టీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) à°’à°• ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్-ఎస్ఓపీ)

రూపొందించింది. à°ˆ ఏడు పేజీల నివేదిక లో కొన్ని అంశాలు పొందుపరచ బడ్డాయి.  
విమానాల రాకపోకలు తొలుత దేశ రాజధాని నగరం దిల్లీ సహా అన్ని మెట్రో సిటీలు, ఆయా రాష్ట్రాల

రాజధాని నగరాల మధ్య ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రధాన నగరాలు/పట్టణాలకు నడుస్తాయి.

ప్రతి విమానయాన సంస్థ లాక్ డౌన్‌కు ముందు నడుపుతున్న

సర్వీసుల్లో 30 శాతం సర్వీసులు మాత్రమే నడపాల్సి ఉంటుంది. అలాగే, విమానాశ్రయానికి వచ్చే, విమానాశ్రయం నుంచి వెళ్లే ప్రతి విమానానికీ మధ్య కనీసం 3 గంటల సమయం పాటించే

అవకాశాలు ఉన్నాయి. విమానాశ్రయంలో ఎన్ని టెర్మినళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఒక టెర్మినల్ నుంచి మాత్రమే విమానాలు నడుస్తాయి.

సామాజిక దూరం, వ్యక్తిగత

శుభ్రత ప్రమాణాలను పాటించడం... అంటే మాస్కులు ధరించడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, శానిటైజర్లు వాడటం అటు ప్రయాణీకులకు, ఇటు సిబ్బందికి తప్పనిసరి.

ప్రతి విమానయాన

సంస్థ తాము ఎన్ని విమానాలను నడపాలనుకుంటున్నదీ, ఏఏ మార్గాల్లో నడపాలనుకుంటున్నదీ ముందుగానే డీజీసీఏకు తెలియజేయాల్సి ఉంటుంది. ఆయా నగరాల్లో లాక్ డౌన్ ఎత్తేయడం,

లేదా నిబంధనలు సడలిస్తేనే ప్రయాణాలు జరుగుతాయి. అలాగే, ఆయా విమానాశ్రయాల్లో రద్దీ ఏర్పడకుండా ముందుగానే డీజీసీఏ ఒక షెడ్యూల్ ప్రకారం విమానాల రాకపోకలకు

అనుమతులు జారీ చేస్తుంది.

విమానాశ్రయాల్లో ప్రయాణీకులకు తగినన్ని శానిటైజర్లను అన్ని ప్రదేశాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్

వంటి విమానాశ్రయాల్లో జీఎంఆర్ సంస్థ ఆటోమేటిక్‌ హ్యాండ్ శానిటైజర్లను ఏర్పాటు చేస్తోంది. లగేజీ బ్యాగులను కూడా క్రిమి రహితం చేసేలా ఆటోమేటిక్ వ్యవస్థలను

ఏర్పాటు చేశారు. అలాగే, ఇప్పటికే దాదాపు అన్ని విమానాశ్రయాల్లోనూ ప్రయాణీకులు కూర్చునే సదుపాయాల్లో మార్పులు చేశారు. సామాజిక దూరం ప్రమాణాలను పాటించేలా

కుర్చీకి కుర్చీకి మధ్య రెండు కుర్చీల దూరాన్ని పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీలైన చోట్ల కుర్చీల వరుసలను తొలగిస్తున్నారు.

విమానాశ్రయాల్లో మొదటి

దశలో టీ, కాఫీ మాత్రమే లభిస్తాయి. రెస్టారెంట్లు, బార్లు, ఇతర షాపింగ్ దుకాణాలను మూసివేస్తారు. అయితే, ఆహారాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు

చేస్తున్నారు. తర్వాతి దశలో సామాజిక దూరం పాటిస్తూ అక్కడే కూర్చుని తినే వెసులుబాటు కల్పిస్తారు. ఆల్కహాల్ అమ్మకాలు మాత్రం స్థానిక ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం

మొదలవుతాయి. స్పాలు, మసాజ్ కేంద్రాలను తదుపరి ఆదేశాల వరకూ తెరిచేందుకు అవకాశం లేదు.
 
విమానాశ్రయాల్లో ఎక్కడా రద్దీ అనేది ఏర్పడకుండా తగినంత సిబ్బందిని

ముందుగానే సిద్ధంగా ఉంచాలి. విమానాశ్రయాల్లో చెకిన్ కూడా నిర్ణీత గడువు కంటే ముందే ప్రారంభం అవుతుంది. దీనికి తగిన ఏర్పాట్లు ముందుగానే చేయాల్సి ఉంటుంది.

ప్రయాణీకులు కూడా గతంలో కంటే ముందుగానే విమానాశ్రయాల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. విమానాశ్రయాల్లో ప్రతి చోటా సామాజిక దూరాన్ని పాటించాలి. ఈ మేరకు అవసరమైన

సంకేతాలను ఇప్పటికే కొన్ని విమానాశ్రయాల్లో ఏర్పాటు చేశారు.

విమానాశ్రయానికి వచ్చే ప్రయాణీకులను పరీక్షించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మంది

వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి. వారు పరీక్షించిన తర్వాతే ప్రయాణీకులను లోనికి అనుమతిస్తారు. ఒకవేల ఎవరిలోనైనా కోవిడ్-19 లక్షణాలు కనిపిస్తే వారిని

ప్రత్యేకంగా ఉంచేందుకు కూడా తగినంత మంది వైద్యులు, సిబ్బంది, ప్రత్యేక ప్రదేశాన్ని ముందుగానే సిద్ధం చేస్తారు.

ప్రతి ప్రయాణీకుడూ తాను ఆరోగ్యంగా

ఉన్నానని, తనలో ఎలాంటి కోవిడ్-19 లక్షణాలు లేవని ప్రమాణ పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. తన వివరాలను అందులో పొందుపర్చాల్సి ఉంటుంది. ఈ మేరకు తగినన్ని ప్రమాణ

పత్రాలను, ప్రయాణీకులు వాటిని నింపేందుకు తగినన్ని మౌలిక సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 

విమానాశ్రయాల లోపల కానీ, బయట కానీ ఎక్కడా రద్దీ

పెరగకుండా, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, విమానాశ్రయాల్లో చెత్తను, కరోనావైరస్ నుంచి రక్షణ కోసం ధరించే మాస్కులు, గౌన్లు ఇతరత్రా

వాడిపారేసిన వ్యర్థాలను తగిన రీతిలో ప్రమాణాల ప్రకారం మాత్రమే తొలగించాల్సి ఉంటుంది.

దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ఎప్పుడు ప్రారంభం

అవుతాయి?

'ఒక్క ఇండిగో తప్ప మిగతా అన్ని విమానయాన సంస్థలూ ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్నాయి. రాకపోకల్ని ఆపేసి ఐదు వారాలవుతోంది. మరో నెల రోజులు కనుక

పరిస్థితులు ఇలాగే కొనసాగితే చాలా విమానయాన సంస్థలు తిరిగి కోలుకోలేనంతగా నష్టాల్లో కూరుకుపోతాయి. కాబట్టే కేంద్ర ప్రభుత్వం విమానాల రాకపోకల్ని

ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.  à°…ంతర్జాతీయ విమాన ప్రయాణాలు మాత్రం జూన్ మొదటి వారం తర్వాతే  à°ªà±à°°à°¾à°°à°‚à°­à°‚ కావొచ్చునాని

తెలుస్తోంది. 

''విమానాల్లో కూడా సామాజిక దూరం పాటించడాం కోసం కొన్ని సీట్లను ఖాళీగా వదల వలసి ఉంది. ఆ భారాన్ని ప్రయాణీకుల నుంచి వసూలు చేసే అవకాశం కూడా

లేకపోలేదు. అయితే మొత్తం భారం ప్రయాణీకులమీదే పడితే చాలామంది ప్రయాణాలు రద్దు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఈ విషయమై కొంత తర్జన భర్జనలు

జరుగుతున్నాయి.

రైళ్లల్లో కేవలం స్లీపర్ క్లాస్ బోగీలు మాత్రమే. . .

లాక్ డౌన్ అనంతరం నడువనున్న రైళ్లల్లో కేవలం స్లీపర్ క్లాస్ బోగీలు మాత్రమే ఉండే

అవకాశం ఉంది. ఏసీ బోగీలు మాత్రం కొన్నాళ్ల పాటు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఈ విషయమై రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఆయా రైల్వే జోన్ల మేనేజర్లతోను,

ఉన్నతాధికారులతోనూ వీడియో కాన్ఫరెన్సులు జరుపుతున్నారు. ఎప్పట్నుంచి ప్రారంభించమన్నా ప్రారంభించేందుకు మేం అన్ని రకాల ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్టు

అధికారులు తెలియచేసినట్టు తెలుస్తోంది. 

రైల్వే స్టేషన్లలో కూడా సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రత ప్రమాణాలను పాటించనున్నారు. ఇప్పటికే దేశంలోని చాలా

రైల్వే స్టేషన్లలో సామాజిక దూరానికి సంబంధించిన సంకేతాలను (మార్కింగ్) సిద్ధం చేశారు. ప్రతి ప్రయాణీకుడూ సంబంధిత గుర్తులో మాత్రమే నిలబడాల్సి

ఉంటుంది.

''ఎన్ని రైళ్లు నడపాలి? ఒక్కో కంపార్ట్‌ మెంట్‌లో ఎంతమంది ప్రయాణీకులను ఎక్కించాలి? అందుకు వారి దగ్గర్నుంచి à°Žà°‚à°¤ ధర వసూలు చేయాలి? అన్న వాటిపై ఇంకా

చర్చలు జరుగుతున్నాయి. ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. 

ప్రతి కంపార్ట్‌మెంట్‌లో సాధారణంగా ఎనిమిది మంది ప్రయాణీకులు ఉంటారని, ఇప్పుడు వారి సంఖ్యను మూడు లేదా

ఐదుకు పరిమితం చేయాలనుకుంటున్నామని చెప్పారు. అలాగే, బెర్తుల సంఖ్యను కూడా కుదించాలని, మధ్యలో ఉండే బెర్తును ఉపయోగించరాదని కూడా నిర్ణయించే అవకాశం

ఉంది. 

ప్రస్తుతానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు వలస కార్మికులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని, ప్రతి రైల్వే జోన్‌ ఇందుకు

ఏర్పాట్లు చేసిందని అధికారులు వెల్లడించారు. దీనికి అయ్యే ఖర్చును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలన్న షరతుపై ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam