DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ 19:  మొదటి విడత విధులు పూర్తి చేసిన వైద్య బృందాలు 

చప్పట్లతో అభినందనలు తెలిపిన ఐటిడిఎ పిఓ సాయికాంత్  à°µà°°à±à°® 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మే 02, 2020 (డిఎన్ఎస్) : శ్రీకాకుళం

జిల్లా కోవిడ్ ఆసుపత్రిలో కరోనా వ్యాధిగ్రస్తులకు  à°šà°¿à°•à°¿à°¤à±à°¸à°¨à± అందించిన వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది మొదటి విడత విధులు విజయవతంగా ముగించారు. ఏప్రిల్ నెల 24à°µ

తేదీన జిల్లాలో మొదటి కోవిడ్ 19 (కరోనా) పాజిటివ్ కేసులు నమోదు కావడంతో హుటాహుటిన జిల్లా కోవిడ్ ఆసుపత్రి – జెమ్స్ ఆసుపత్రికి తరలించారు. కోవిడ్ ఆసుపత్రికి

పాజిటివ్ కేసు వస్తుందనే సమాచారం అందిన వెంటనే మేము సైతం అంటూ ముందుగానే సిద్ధంగా ఉన్న వైద్యులు, హౌస్ సర్జన్లు, పారా మెడికల్ సిబ్బంది విధులలో చేరారు. కేసు

ఆసుపత్రికి చేరిన వెంటనే కోవిడ్ – 19 నిబంధనల మేరకు పాజిటివ్ వ్యాధిగ్రస్తున్ని ఆసుపత్రి ప్రవేశం నుండి చికిత్స అందించే ప్రదేశం వరకు తీసుకవెళ్ళారు. ఏప్రిల్ 24à°µ

తేదీ నుండి శని వారం (మే 2) ఉదయం వరకు ఏడు రోజుల పాటు ఎంతో సేవాభావంతో విధులను నిర్వహించారు. నిబంధనల మేరకు ఏడు రోజుల అనంతరం శని వారం విధుల నుండి విడుదల చేసి 14 రోజుల

పాటు క్వారంటీన్ కు పంపించారు. విధులు ముగించుకున్న సిబ్బందికి స్వాబ్ నమూనాలు తీసు పరీక్షించగా అందరికీ నెగిటివ్ వచ్చిందని కోవిడ్ ఆసుపత్రి సూపరింటిండెంట్

గా వ్యవహరిస్తున్న డా.ఏ.హేమంత్ తెలిపారు. క్వారంటీన్ అనంతరం తిరిగి స్వాబ్ పరీక్షలు నిర్వహిస్తామని, అప్పుడు నెగిటివ్ వస్తే ఇళ్ళకు పంపిస్తామని ఆయన

పేర్కొన్నారు. విధులు నిర్వహించిన వారిలో ముగ్గురు వైద్యులు, నలుగురు హౌస్ సర్జన్లు, 8 మంది స్టాఫ్ నర్సులు, 9 మంది టెక్నీషియన్లు, ఎం.ఎన్.ఓలు, ఎఫ్.ఎన్.ఓలు, పారిశుధ్య

సిబ్బంది, బయోవేస్ట్ నిర్వాహకులు వెరశి 38 మంది ఉన్నారని ఆయన తెలిపారు. వారం రోజులపాటు చక్కని సేవలు అందించారని వారు విధుల నుండి విడుదల అయిన తరువాత రెండవ బ్యాచ్ ను

విధులలోకి పంపించామని హేమంత్ చెప్పారు. జిల్లా కలెక్టర్ జె నివాస్, ఆసుపత్రి ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సి.యం.సాయికాంత్ వర్మ

పర్యవేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam