DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రణాళిక:మంత్రి ధర్మాన

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మే 02, 2020 (డిఎన్ఎస్) : మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసిందని

రాష్ట్ర రహదారులు భవనాల శాఖ  à°®à°‚త్రి ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. గుజరాత్ వీరావల్ నుంచి శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్న మత్స్యకారులను శనివారం ఆయన

పరామర్శించారు. నరసన్నపేట సెయింట్ క్లారిట్  à°¸à±à°•à±‚ల్, ప్రభుత్వ జూనియర్,  à°¡à°¿à°—్రీ కళాశాలల్లో క్వారంటిన్  à°²à°²à±‹ ఉన్న వారిని కలెక్టర్ జె. నివాస్ తో కలిసి వెళ్లి

పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో లాక్ డౌన్ కారణంగా చిక్కుకొన్న మన వారందరినీ రాష్ట్రానికి రప్పించే ఏర్పాట్లు

జరుగుతున్నాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతుల్ని ఏ à°°à°•à°‚à°—à°¾ ఆదుకుంటున్నారో

అదే à°°à°•à°‚à°—à°¾  à°¸à±à°µà°¿à°¶à°¾à°²à°®à±ˆà°¨ తీర ప్రాంతం ఉన్న మన రాష్టంలో సముద్ర సంపదకు, ఆక్వారంగానికి అనువైనదిగా గుర్తించి మత్స్యకారులకు కూడా భరోసా కల్పించేందుకు ప్రణాళికలు

సిద్ధం చేస్తున్నారన్నారు.
    జాతీయ స్థాయిలో విదేశీ మారక ద్రవ్యంలో 40 శాతం రాష్ట్రం నుంచే అందుతోందని,  à°‡à°²à°¾à°‚à°Ÿà°¿ పరిస్థితుల్లో మెరైన్ సెక్టార్‌ను

ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అందుకు అవసరమైన, అనువైన మోళిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో బుడగట్లపాలెం,

ఇద్దువానిపాలెంలలో జెట్టీలను నిర్మిస్తామన్నారు. ఒక్కో జెట్టీ నిర్మాణానికి రూ. 350 కోట్లు ఖర్చవుతుందని ఇందులో 50 శాతం కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 50 శాతం రాష్ట్రం

భరించే విధంగా ఈ ఏడాదిలోనే నిర్మాణాలు ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. అలాగే భావనపాడు మినీ పోర్టు నిర్మాణం కూడా పూర్తయితే శ్రీకాకుళం జిల్లా

నుంచి మత్స్యకారుల వలసలు పూర్తిగా తగ్గు తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చొరవతోనే మత్స్యకారులను శ్రీకాకుళం జిల్లాకు రప్పించేందుకు సాధ్యపడిందని,

ఇందుకు రూ. 3 కోట్లు విడుదల చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఇండ్లకు వెళ్లేటప్పుడు వారికి రూ. 2000 ఆర్థిక సహాయం కూడా అందజేయనున్నట్లు చెప్పారు. వేట నిషేధ

సమయంలో అందజేసే రూ.10 వేల భృతిని కూడా అర్హులైన అందరికీ అందజేస్తామని కృష్ణదాస్ చెప్పారు. లాక్ డౌన్ ను మరో 14 రోజులు పొడిగించారని, అదే క్రమశిక్షణతో ప్రభుత్వ నియమ

నిబంధనలు పాటిస్తూ ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. అనంతరం మంత్రి మత్స్యకారులకు స్వయంగా భోజనం వడ్డించారు. మంచి నాణ్యతతో కూడిన భోజనాన్ని అందిస్తామని, అన్ని

సదుపాయాలను కలుగ చేస్తామని తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam