DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా పోరాట యోధులకు భారత నావికా దళ వీరుల బిగ్ సెల్యూట్ 

*విశాఖ కోవిడ్ ఆసుపత్రుల పై విమానాల ద్వారా పూల వర్షం. .* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మే 03, 2020 (డిఎన్ఎస్) : లక్షలాది మంది ప్రజల

ప్రాణాలకు అడ్డు నిలబడి కరోనా మహమ్మారి పై ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, తదితరులకు భారతీయ సైనిక దళాలు అత్యంత

అరుదైన వందన సమర్పణ చేసాయి. 

ఆదివారం భారతీయ సముద్ర జలాలపై రక్షణగా నిలిచే నౌకలపై నావికా దళ సిబ్బంది  à°¥à°¾à°‚క్యూ అంటూ  à°ªà±à°°à°¦à°°à±à°¶à°¿à°‚చారు. అదే సమయంలో ఆకాశ

మార్గంలో విశాఖ నగరం లోని కోవిడ్ 19  à°¬à°¾à°§à°¿à°¤à±à°²à°•à± నిర్విరామంగా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలబడిన వైద్య బృందాలు, పారిశుధ్య కార్మికులు, పోలిసి విభాగాల

సిబ్బంది పై పూల వర్షాన్ని హెలికాఫ్టర్ల ద్వారా కురిపించాయి. ఈ సమయంలో నావికాదళ ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా ఆసుపత్రుల వద్దకు చేరుకొని, వైద్య సిబ్బందికి

ప్రత్యక్షంగా అభినందనలు తెలియచేసారు. ఒక్కసారిగా à°ˆ ఘటనతో అందరిలోనూ ఆనందబాష్పాలు వచ్చేసాయి.  à°ªà±à°°à°¤à°¿ సారి ప్రత్యక్ష యుద్ధాల్లో విజయం సాధించిన సైనికులకు వందనం

చేసే ప్రజలకు, à°† సైనికులే వందనం, అభినందనలు తెలియచేస్తుంటే ఉద్వేగ క్షణాలను వివరించనలవి కాదు. 

నావికాదళ ఇంచార్జి అధికారి (ఆంధ్ర ప్రదేశ్)   కామోడోర్

సంజీవ్ ఇస్సార్ స్వయంగా ఈ అభినందన కార్యక్రమం లో పాల్గొనే ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్, ప్రభుత్వ ఛాతి ఆసుపత్రి సూపరెంటెండెంట్

డాక్టర్ కె వివి విజయ్ కుమార్,  à°¨à±‹à°¡à°²à± అధికారి డాక్టర్ సూర్యకుమారి, గీతం వైద్య కళాశాల సూపరెంటెండెంట్ డాక్టర్ ఎన్. ద్వారకానాధ్, లకు ప్రత్యక్షంగా అభినందనలు

తెలియచేసారు. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా కరోనా ను అరికట్టేందుకు ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సహాయకులు, పోలీస్ విభాగం, పారిశుధ్య కార్మికులు,

ఇతర అధికారులు  à°ªà±à°°à°¤à°¿ ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు.  

 à°à°Žà°¨à± ఏస్ డేగా నుంచి బయలు దేరిన చేతక్ హెలికాఫ్టర్ లు ద్వారా ఆసుపత్రుల పై భారీ ఎత్తున పూల

వర్షం కురిపించి కృతజ్ఞతలు తెలియచేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam