DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మద్యం కొంటె వైట్ కార్డు 6 నెలలు రద్దు చెయ్యాలి: రాష్ట్ర బీజేపీ ఈసీ కెవివివి 

*ఉపాధి లేదు డబ్బెలా వచ్చింది ? ఆస్తులు అమ్ముతున్నారా?*

*కేంద్రం ఇచ్చిన డబ్బు తినడం కోసం తాగడానికి కాదు*

*ఆధార్ కార్డు ఆధారంగా తెల్ల రేషన్ కార్డు

రద్దు చెయ్యాలి.*

*ప్రభుత్వ మద్యం తాగితే కరోనా మహమ్మారి  à°¸à±‹à°•à±‡  à°…వకాశం లేదా? . . *

ఆర్ధిక వనరులైతే వేరే మార్గం వెతుక్కోవాలి : . . .

*బీజేపీ రాష్ట్ర కమిటీ

సభ్యుడు à°¡à°¾. సత్యనారాయణ మండిపాటు*  

*(DNS రిపోర్ట్ : సత్య గణేష్ , రిపోర్టర్ , విశాఖపట్నం ). . .*

విశాఖపట్నం, మే 04, 2020 (డిఎన్ఎస్) : మద్యం కొన్నవారికి తెల్ల రేషన్ కార్డు ఉంటె

తక్షణం ఆరు నెలల పాటు రద్దు చేయాలనీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు డాక్టర్ కెవివి సత్యనారాయణ డిమాండ్ చేస్తున్నారు. సోమవారం నుంచి రాష్ట్ర

వ్యాప్తంగా మద్యం విక్రయాలు మొదలు పెట్టడం పై అయన మండిపడుతున్నారు. అత్యంత విపత్కర పరిస్థితుల్లో దేశంలో ఉంటె రాష్ట్రంలో మద్యం విక్రయాలు మొదలు పెట్టడం ద్వారా

కేంద్ర ప్రభుత్వం à°—à°¤ 40 రోజులుగా చేపట్టిన లాక్ డౌన్ కష్టం అంతా నీలాపాలయ్యిందన్నారు. విశాఖపట్నం లో సోమవారం మద్యం కోసం కిలోమీటర్లకు పైగా  à°¬à°¾à°°à±à°²à± తీరిన జనాన్ని

చూసి, వాళ్ళలో చాలా మంది రోజు కూలీ పనులు చేసేవారు కావడం తో ఆవేదన చెందారు. ఈ సందర్బంగా ఆయన DNS తో మాట్లాడుతూ కష్ట కాలం లో ప్రజలకు ఆర్ధికంగా సాయం చెయ్యడం కోసం తెల్ల

రేషన్ కార్దు దారులకు నిధులను à°•à±‡à°‚ద్రం పంపిణీ చేసిందన్నారు. అయితే నిధులు కుటుంబం మొత్తం ఆహార పదార్ధాలు కొనుక్కోడానికే గానీ, ఇలా మద్యం కొనుక్కోడానికి

కాదని మండిపడ్డారు. దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. 

వైన్ షాప్ దగ్గర జనాలను చూస్తుంటే ఇన్నాళ్ళూ వైద్య, పారిశుధ్ధ్య సిబ్బంది,

పోలీసులూ,రెవెన్యూ సిబ్బంది& స్వచ్చంద సంస్థలూ చేసిన సేవ మొత్తం తుడిచి పెట్టుకు పోయేలా కనిపిస్తుందన్నారు. 

గత 40 రోజులుగా ఇంటికే పరిమితమై, పని లేక, చేతిలో

డబ్బులు లేవని, మద్యం కోసం కొందరు ఇళ్లల్లో సామాన్యులు సైతం అమ్ముకుంటున్నారన్నారు. ఇళ్లలో మహిళలకు చేతిలో డబ్బు పెట్టడానికి చేతులు రావు కానీ బార్ల ముందు

నిలబడాటనికి కాళ్ళు వస్తాయి అన్నారు. 

ఈరోజు వైన్ షాపుల ముందు గుమిగూడిన జనాలను చూస్తే కేంద్రం తీసుకునే ఆరోగ్య చర్యలకు రాష్ట్రం వైఖరి పూర్తిగా

గండికొట్టేలా ఉందని మండిపడ్డారు. 

*మద్యం తాగితే మహమ్మారి  à°¸à±‹à°•à±‡  à°…వకాశం లేదా? . . *

వైన్స్ షాపులు తెరవడం వలన ఎక్కువ మంది జనం అక్కడకు చేరుకునే అవకాశం

ఉందని, కనీసం భౌతిక దూరం కూడా పాటించకుండా భారీ క్యూలు ఉన్నాయన్నారు. à°ˆ మద్యం తాగితే కరోనా మహమ్మారి  à°¸à±‹à°•à±‡  à°…వకాశం లేదనే అభిప్రాయం లో పాలకులు ఉన్నారా అని

మండిపడ్డారు. భగవంతుని దయ వాళ్ళ, ప్రత్యక్ష పోరాట యోధుల కృషి వాళ్ళ ఇంత వరకు ఒక్క పేద వానికి సోకలేదని, అయితే మద్యం విక్రయాల్లో మాత్రం పేదవాళ్ళే అధికంగా

నిలబడుతున్నారన్నారు. 

ఆర్ధిక వనరులైతే వేరే మార్గం వెతుక్కోవాలి : . . .

రాష్ట్రానికి ఆర్ధిక వనరుల కోసం వేరే ప్రక్రియ వెతుక్కోవాలి తప్ప, అత్యంత

ప్రమాదకరమైన మద్యం విక్రయాలను మొదలు పెట్టి ప్రజల ప్రాణాలను పణం à°—à°¾ పెట్టడం ఏంటని మండిపడుతున్నారు.  à°¤à°•à±à°·à°£à°‚ మద్యం విక్రయాలను నిలిపి వెయ్యాలని డిమాండ్

చేస్తున్నారు. లేని పక్షంలో మద్యం కొనుగోలు దారుల్లో తెల్ల కార్దు దారులు ఉంటె వాళ్ళ కార్డులను  à°•à°¨à±€à°¸à°‚ 6 నెలల పాటు రద్దు చేయాలన్నారు, à°¤à°¦à±à°µà°¾à°°à°¾ వాళ్ళు కొనుగోలు

చెయ్యరన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam