DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మద్యం ఆంధ్రాలోనే  కాదు అన్ని చోట్లా అమ్ముతున్నారు:

*డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ శాఖమంత్రి నారాయణ స్వామి వెల్లడి*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 04, 2020 (డిఎన్ఎస్) : సోమవారం నుంచి

కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ మద్యం విక్రయాలు జరుపుతున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖమంత్రి నారాయణ స్వామి

వెల్లడించారు. ప్రసార సాధనాల్లో కనిపించిన దృశ్యాలన్నీ కొన్నిచోట్లకు సంబంధించినవేనన్నారు. మిగిలిన చోట్ల సోషల్‌ డిస్టెన్స్‌తో మద్యం విక్రయాలు

జరిగాయన్నారు. à°ˆ విషయాన్ని అందరూ గమనంలోకి తీసుకోవాలన్నారు. గ్రీన్‌జోన్లమాత్రమే మద్యం దుకాణాలు తెరుచుకున్నాయన్న విషయాన్ని ప్రసార మధ్యమాలు గుర్తించాలని

తెలిపారు. నిత్యం తెరుస్తున్న నిత్యావసరాలకు, ప్రతినెలా ఇస్తున్న రేషన్‌కు కూడా భౌతిక దూరం పాటిస్తూ కొనుగోలు చేయాలని ప్రభుత్వం పదేపదే చెప్తోందన్నారు. అలాగే

మద్య విక్రయాల సమయంలోకూడా భౌతిక దూరం పాటించాలని చెప్పాం, ఆమేరకు చర్యలు తీసుకున్నాం అన్నారు. నిబంధనలు పట్టించుకోకపోవడంతో కొన్ని దుకాణాలను ఈ ఉదయం మూసివేశాం

కూడా అన్నారు. ఎక్కడైనా భౌతిక దూరం పాటించకపోతే వాటిని మూసివేయమని కలెక్టర్లకు జిల్లా ఎస్పీలకు స్పష్టంగా చెప్పామన్నారు. ఆ మేరకు వారు చర్యలు కూడా

తీసుకుంటున్నారన్నారు. ఇవ్వాళ మద్యం దుకాణాలు తెరుచుకోవడానికి, మేం ఇచ్చిన మద్య నిషేధం హామీకి లింకు పెట్టి టీడీపీనేతలు మాట్లాడుతున్నారని, మా హామీని

కచ్చితంగా నెరవేరుస్తాం అన్నారు. 

ఇదే లాక్‌డౌన్‌ సమయంలో ఎన్ని కష్టాలు ఉన్నా ఇతర హామీలను కూడా నెరవేరుస్తున్న విషయాన్ని ప్రజలు గమనించారు:
/> ఫీజురియింబర్స్‌ మెంట్, వసతి దీవెన, సున్నావడ్డీ  à°ªà°¥à°•à°‚, అలాగే  à°‡à°µà±à°µà°¬à±‹à°¤à±à°¨à±à°¨ మత్స్యకార భరోసా, రైతు భరోసాలన్నీకూడా అమలు చేస్తున్నాం, చేయబోతున్నాం అన్నారు.

అలాగే మద్య నిషేధం కూడా దశలవారీగా చేసి తీరుతాం: అన్నారు. తెలుగుదేశం వారు మద్యం ధరలు పెరిగాయని బాధపడుతున్నారా? లేక వారి దుకాణం మూతబడుతున్నందుకు

బాధపడుతున్నారా? అని అడిగారు. కచ్చితంగా టీడీపీ దుకాణం మూతబడుతుందన్నారు. చంద్రబాబు ఇక భవిష్యత్తులోనూ రాజకీయ క్వారంటైన్‌ కాబోతున్నారు: ఇంత కష్టసమయంలో పాల

అమ్మకం ధరలు పెంచి వినియోగదారులనుంచి పిండుకుంటున్న చంద్రబాబు నాయుడుగారు కూడా మద్యం ధరలమీద విమర్శలు చేయడం హాస్యాస్పదం: అన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam