DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశంలోనే అత్యధికంగా 1. 34 లక్షల  కరోనా పరీక్షలు చేసాం

*విఆర్డీఎల్ తో పాటు 350 ట్రూ నాట్ పరీక్షల సౌకర్యం ఉంది*

*కరోనా వేక్సిన్ వచ్చే వరకు కొంత సమస్య ఉంటుంది*

*కలెక్టర్ లతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

వీడియో కాన్ఫరెన్స్* 


*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మే 05, 2020 (డిఎన్ఎస్) : దేశంలోనే అత్యధికంగా 1. 34 లక్షల  à°•à°°à±‹à°¨à°¾ పరీక్షలు

నిర్వహించింది కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనేనని ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్

ఆలయ పలు అంశాలను వెల్లడించారు. విఆర్డీఎల్ తో పాటు 350 ట్రూ నాట్ పరీక్షల సౌకర్యం ఉందని,  à°•à°°à±‹à°¨à°¾ వేక్సిన్ వచ్చే వరకు కొంత సమస్య ఉంటుందన్నారు.  à°‡à°¤à°° రాష్ట్రాల నుంచి

లక్ష మంది వలస కార్మికులు వస్తున్నారని, ఇతర దేశాల నుంచి కూడా మన రాష్ట్ర వాసులు రానురన్నారు. ప్రతి గ్రామంలో కనీసం 10 బెడ్లతో క్వారంటీన్ సౌకర్యం కల్పించాలని, మంచి

భోజన వసతులు కల్పించాలి. మంచి మరుగుదొడ్లు ఉండాలన్నారు. టెలీ మెడిసిన్ అవసరమైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. 14410 నంబరుకు ఫోన్ చేయవచ్చని తెలిపారు. ప్రజాపయోగ

ఫోన్ నంబర్లు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని, ప్రతి ఒక్కరూ ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకోవాలన్నారు. వై యస్ ఆర్ గ్రామ వైద్య క్లినిక్ లు యుద్ధప్రాతిపదికన

ఏర్పాటు చేయాలన్నారు. కంటైన్మెంట్ జోన్ లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వెరీ ఆక్టివ్, ఆక్టివ్ ప్రాంతాలపై దృష్టి సారించాలని, మద్యం విక్రయాలు తగ్గించుటకు తమ

ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టాం అన్నారు. 43 వేల బెల్టుషాపులు తొలగించాం. 4500 గా ఉన్న దుకాణాలను 3500 కు తగ్గించామని, అక్రమ మద్యం రవాణా పూర్తిగా

నిషేధించాలి. ఎస్పీలు శ్రద్ద వహించాలన్నారు. వ్యవసాయం మీద జిల్లా, మండల స్థాయి సలహా మండలి ఏర్పాటు చేయాలని కోరారు. ఏ గ్రామంలో ఏ పంటలు వేయాలో సూచించాలన్నారు. రైతు

భరోసా కేంద్రాలు (ఆర్ బికె) రైతు సహాయకారిగా ఉండాలని, ఏ పంట ఏ ధరకు విక్రయిస్తున్నారు, మార్కెట్ అనుసంధాన కార్యక్రమం అవసరమా వంటి విషయాలపై నివేదిక ఇవ్వాలన్నారు.

జూన్ 1à°µ తేదీన రైతు భరోసా కేంద్రాలు (ఆర్ బికె) ప్రారంభం. ఇంటర్నెట్ తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. మిగిలిన కార్యాచరణను ప్రకటించారు. 

గ్రామాల్లో

జనతా బజార్లు ఏర్పాటు

మే 6న మత్స్యకార భరోసా కార్యక్రమం

మే 15 న రైతు భరోసా పంపిణీ

రైతు నమోదు కార్యక్రమం పక్కాగా జరగాలి. ఏ ఒక్కరూ జాబితాలో

తప్పిపోరాదు

ప్రతి రైతుకి ఏడాదికి రూ.13,500 ఇస్తున్నాం

రెండో విడత అక్టోబరు లో రూ.4 వేలు, మూడో విడత సంక్రాంతి ముందు రూ.2 వేలు పంపిణీ

పంట వేసిన రైతులకు

పంట రుణం రాలేదు అనే మాట రాకుండా ప్రభుత్వం చర్యలు

ఇ - క్రాపింగ్ చేస్తున్నాం. ఇ - క్రాపింగ్ చేసిన రైతులకు రుణాలు అందాలి

వడ్డీ లేని రుణాలను అందించుటకు

చర్యలు 

అకాల వర్షాలపై రైతులను అప్రమత్తం చేయాలి

గ్రామ స్థాయిలో రైతుల పరిస్థితి మెరుగుపర్చాలి

గ్రామ సచివాలయంలో నిర్దేశిత సమయంలో బియ్యం

కార్డు జారీ తదితర కార్యకలాపాలు జరగాలి. త్వరితగతిన సేవలు ప్రజలకు అందాలి

తాగునీటి సమస్యకు 1902 కు ఫోన్ కాల్స్ వస్తున్నాయి

శ్రీకాకుళం జిల్లా నుండి 26

కాల్స్ వచ్చాయి

వేసవి దృష్ట్యా జిల్లా కలెక్టర్ లు తాగునీటి పరిస్థితిపై దృష్టి సారించాలి

పలాస ప్రాంతంపై దృష్టి పెట్టాలి 

ఉపాధి హామీలో కూలీల

సంఖ్య పెంచాలి

జూలై 8న ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి

అత్యంత పారదర్శకంగా జరగాలి

రాష్ట్రంలో 27 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ


à°ˆ

సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ కంటైన్మెంట్ జోన్ బయట కూడా భౌతిక దూరం పాటించాలన్నారు. తరచూ శానిటైజేషన్

చేసుకోవాలని సూచించారు. 

శ్రీకాకుళం నుంచి జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ డా. కె. శ్రీనివాసులు, పోలీసు సూపరింటిండెంట్ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి,

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.చెంచయ్య, డిసిహెచ్ఎస్ డా బి.సూర్యారావు, డీఆర్డీఏ పిడి ఏ.కళ్యాణ చక్రవర్తి, జిల్లా పరిషత్ సిఇఓ జి.చక్రధర రావు, జిల్లా విద్యాశాఖ

అధికారి కె. చంద్ర కళ, గృహ నిర్మాణ సంస్థ పిడి టి.వేణుగోపాల్, ఏఎస్పీ పి.సోమశేఖర్, అర్దబ్ల్యూఎస్ ఎస్ఇ టి.శ్రీనివాసరావు, పీఆర్ ఎస్ఇ ఎస్.రామ్మోహన్, డిడబ్ల్యూఎంఏ పిడి

హెచ్.కూర్మారావు, సిపిఓ ఎం.మోహన రావు, ఎస్ఎస్ఏ ఏపిసి పివి రమణ, వ్యవసాయ శాఖ జెడి కె. శ్రీధర్, ఉద్యాన శాఖ ఎడి ఆర్ వి ప్రసాద్, ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయ అధికారి డా

సాయిరాం, మార్కుఫెడ్ డిఎం కెయుపి రమణి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam