DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అల్లూరి స్ఫూర్తిగా వై ఎస్ జగన్ పోరాట దీక్ష : మళ్ల

అల్లూరి స్ఫూర్తిగా వై ఎస్ జగన్ పోరాట దీక్ష : మళ్ల

విశాఖ జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలని కోరుతాం 
విశాఖపట్నం, జులై 4 ,2018 (DNS Online ) : స్వాతంత్య్ర సమర యోధులు, మన్యం

వీరునిగా పేరుగాంచిన అలనాటి గిరిజన వర్గాల ఆశాజీవి అల్లూరి సీతా రామరాజు కు వైఎస్ ఆర్ కాంగ్రెస్  à°ªà°¾à°°à±à°Ÿà±€ ఘన నివాళి అర్పించింది. బుధవారం అల్లూరి జయంతిని

పురస్కరించుకుని, నగరం లోని సీతమ్మధార కూడలి వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూల మాల వేసి, నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ

నగర కమిటీ అధ్యక్షులు మళ్ల విజయ ప్రసాద్ మాట్లాడుతూ బడుగు బలహీన, అణగారిన వర్గాలకి అండగా నిలిచి ఆనాడు భారత దేశ స్వాతంత్ర సమర పోరాటంలో నాటి దుష్ట, దోపిడీ

పాలకులైన ఆంగ్లేయుల నుంచి సాయుధ పోరాటం చేశారన్నారు. నాటి పోరాట ఫలితమే బ్రిటిష్ వాళ్ళకి కంటిమీద కునుకు లేకుండా చేశారని, అల్లూరి లాంటి యోధులను ఎదుర్కోలేక

దొంగ దెబ్బ తీశారన్నారు. అయన స్ఫూర్తిగానే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేటి దుష్ట, అవినీతి పాలకులైన తెలుగుదేశం పార్టీ పై ప్రజాస్వామ్య పద్దతిలో, చట్టబద్ధంగా

 à°ªà±‹à°°à°¾à°Ÿà°¾à°¨à±à°¨à°¿ సాగిస్తోందన్నారు. దీనిలో భాగంగానే అన్న వస్తున్నాడు అనే పేరిట ప్రజల్లో  à°®à°¨à±‹ నిబ్బరాన్ని, ధైర్యాన్ని కల్పించేందుకు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ

అధ్యక్షులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గత 203 రోజులుగా ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పాదయాత్ర చేయడం ద్వారా మనోధైర్యాన్ని కల్పిస్తున్నారన్నారు. అయన ప్రస్తుతం తూర్పు

గోదావరి జిల్లా రామచంద్రాపురం అసెంబ్లీ నియోజక వర్గం లో పాదయాత్ర చేస్తున్నారని, అతి తొందరలోనే విశాఖ జిల్లాలో ఆడుతూ పెట్టనున్నారని తెలిపారు. అయన విశాఖ

జిల్లాకు వచ్చిన సమయంలో విశాఖ జిల్లాకు సుప్రసిద్ధ స్ఫూర్తిదాత అల్లూరి పేరు నామకరం చెయ్యాలని కోరనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న విశాఖ ఉత్తర

నియోజక వర్గం సమన్వయ కర్త కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్రం లో పేరుకు పోయిన అవినీతిని అల్లూరి స్ఫూర్తిగా ఎదుర్కొంటామన్నారు. అతి త్వరలోనే ఈ రాష్ట్ర ప్రజలకు

అవినీతి, దుష్ట పాలన నుంచి కాపాడేందుకు వైఎస్ జగన్ ప్రజాక్షేత్రం లో , ప్రజలతో మమేకమై పాదయాత్ర చేస్తున్నారన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam