DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ దుర్ఘటన హృదయవిదారకం : పవన్ కళ్యాణ్ 

*కాలుష్య నియంత్రణ మండలి కఠినంగా వ్యవహరించాలి* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, మే 07, 2020 (డిఎన్ఎస్) : విశాఖపట్నం పరిధిలోని

ఆర్.ఆర్. వెంకటాపురం లోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువులు విడుదలై అయిదు కిలోమీటర్ల మేర ప్రజలు భయకంపితులు కావడం... 8 మంది మృతి చెందటం... వందల మంది తీవ్ర

అస్వస్థతకు లోనవడం హృదయవిదారకం అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. గురువారం తెల్లవారు ఝామున జరిగిన ఈ ఘటన ప్రభావం నుంచి

రక్షించేందుకు చుట్టుప్రక్కన ఐదారు గ్రామాలోని వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు. ఈ ఘటన లో మృతుల కుటుంబాలకు వ్యక్తిగతంగానూ,

 à°œà°¨à°¸à±‡à°¨ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్టు తెలిపారు. à°…స్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. వారికి ప్రభుత్వం

మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని, మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలని కోరారు. 

విశాఖ పరిధిలోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటు

చేసుకొంటున్నాయని, ప్రభుత్వం తక్షణం పరిశ్రమల్లోని రక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలను పరిశీలించాలన్నారు. అదే విధంగా పరిశ్రమల నుంచి విష రసాయనాలు, వ్యర్థాలు

వెలువడుతుండటంతో ప్రజలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నామని, చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా స్పందించకపోవడంతోనే ఇలాంటి దుర్ఘటనలు

చోటు చేసుకొంటున్నాయన్నారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° కాలుష్య నియంత్రణ మండలి ఇలాంటి పరిశ్రమల విషయంలో నిర్లిప్తంగా ఉండకుండా ప్రజారోగ్యం పట్ల, పర్యావరణ పరిరక్షణపట్ల

బాధ్యతగా ఉండాలని, కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ ప్రమాదం గురించి, విశాఖ పరిధిలోని కాలుష్యకారక పరిశ్రమల గురించి నివేదిక సిద్ధం చేయాలని మా పార్టీ

నాయకులకు సూచించామన్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించిన ప్రజలకు తక్షణం ఆహార సదుపాయాలను అందించాలని పార్టీ యువజన విభాగానికి సూచించామన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam