DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాలిమర్స్ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉంది

*ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని*

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, మే 08, 2020 (డిఎన్ఎస్) : విశాఖపట్నం శివారు లో జరిగిన గ్యాస్

లీకేజ్ ప్రమాదం సంభవించిన ఎల్ జి పాలిమర్స్ కర్మాగార ప్రాంతంలోగల ఐదు గ్రామాలలో పరిస్థితి అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని

పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కర్మాగారానికి దక్షిణ దిశలో ఉన్న గ్రామాల్లోనే విష వాయువు

ప్రభావం కొద్దిగా మిగిలి ఉన్నదని తెలిపారు. నిర్వాసితులకు  à°ªà±à°¨à°°à°¾à°µà°¾à°¸à°‚, వైద్య సదుపాయాలు కల్పించామన్నారు. 454 మంది ఆసుపత్రిలో ఉన్నారని వారిలో 20 మంది తీవ్ర

అనారోగ్యంతో ఉన్నారని తెలిపారు. కర్మాగారం గేటు వద్ద వెంకటాపురంలో మాత్రమే పాయింట్ 0.2 ppm గాఢత ఉందని గోపాలపట్నం వేపగుంట ప్రాంతాల్లో విషవాయువు గాఢత  “0” à°—à°¾

నమోదైందని వెల్లడించారు.  à°•à°°à±à°®à°¾à°—ారం లోని బ్రాయిలర్ à°² ఉష్ణోగ్రత అదుపులోనే ఉందన్నారు. ఇతర సాంకేతిక విషయాలపై నిపుణులు, సాంకేతిక కమిటీ లతో చర్చించడం

జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా రూ.కోటి అందజేయడం జరుగుతుందని,

తర్వాత న్యాయపరమైన అంశాల తో కంపెనీ నుండి నష్టపరిహారం చేస్తామని తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam