DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*ఆశీర్వదించడం లోనే కాదు ఆదుకోవడంలోనూ పెద్దలే. .*

ఆపన్నులకు చేయూత ఇస్తున్న శ్రీకాకుళం శ్రీవైష్ణవ సంఘం

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*
 
శ్రీకాకుళం, మే 10 ,2020 (డిఎన్ఎస్ ): అందరినీ ఆశీర్వదించడం

లోనే కాదు ఆపన్నులకు ఆసరా గా నిలవడం లోనూ తాము ముందుంటామని నిరూపిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా శ్రీవైష్ణవ సంఘం ప్రతినిధులు. కొనసాగుతున్న మూడవ విడత లాక్ డౌన్

నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా మారుమూల గ్రామాల్లోని వృద్దులు, ఆసరాలేని వారి గురించి తెలుసుకుని, ఆదివారం వారి వద్దకే వెళ్లి నిత్యావసరాలను స్వయం గా అందించి

అందరి మన్ననలూ పొందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లోను, ప్రభుత్వ, ప్రయివేట్, విద్యా సంస్థల్లోనూ,  వివిధ ఉన్నత ఉద్యోగాలు నిర్వహిస్తున్న పెద్దలు, యువత,

స్వయంగా నిధుల సేకరణ చేసి, వయోవృద్దులు, దివ్యంగులు, చిన్నారులను గురించి తెలుసుకుని, శ్రీకూర్మం దరి నీలాపు పేట, తదితర ప్రాంతాల్లో పర్యటించి, వారి వద్దకే

గ్రామాల్లోకి వెళ్లి, ఇళ్లవద్దే వారికీ తాము అండగా నిలబడుతున్నామనే భరోసా కల్పించారు. ప్రభుత్వం అందించే సాయం అందని వారి వివరాలు తెలుసుకుని మరీ వారి వద్దకు

వెళ్లడంతో వారి కళ్ళల్లో ఆత్మీయత దర్శనమిచ్చింది. అయ్యవార్లే తమ ఇంటి వద్దకు వచ్చి, భరోసా కల్పిస్తుంటే, వారి సాక్షాత్తు స్వామి వీరి రూపంలో వచ్చారంటూ

ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నారు. 

గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో సహాయాన్ని అందిస్తున్న యువతకు వైష్ణవ సంఘం పెద్దలు, అధ్యక్షులు స్వయం పర్యవేక్షణలో

కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam