DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాలిమర్స్ గ్యాస్ బాధితులకు కోటి రూపాయల పరిహారం అందజేత

*మూడు రోజుల్లోనే బాధితులకు కోటి పరిహారం ఇచ్చాం:  à°•à°¨à±à°¨à°¬à°¾à°¬à±* 

*ప్రజారోగ్యం పై చిత్తశుద్దితో పనిచేస్తున్న ప్రభుత్వం ఇదే : ధర్మాన*  

*ఈ ప్రభుత్వం ఎలాంటి

నూతన అనుమతులు ఇవ్వలేదు : బొత్స*  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం )
 
విశాఖపట్నం, మే 11 , 2020 (డి ఎన్ ఎస్ ): విశాఖ శివారు ప్రాంతం ఆర్ ఆర్ వెంకటాపురం లోని ఎల్జీ

పాలిమర్స్ లో జరిగిన గ్యాస్  à°ªà±à°°à°®à°¾à°¦à°‚లో  à°®à±ƒà°¤à°¿ చెందినవారికి సంబంధించి ఎనిమిది  à°•à±à°Ÿà±à°‚బాలకు నష్టపరిహారాన్ని రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స

సత్యన్నారాయణ, అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్ లు అందించారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో చెక్ లను అందించారు. ఈ సందర్బంగా వారు ఘటన పై

స్పందించారు. 

వ్యవసాయశాఖమంత్రి కురసాల కన్నబాబు : . . .

ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రకటించిన విధంగా మృతిచెందిన వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం

అందించామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఆ మొత్తాన్ని బ్యాంకులో వేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ముఖ్యమంత్రి వారికి రాసిన లేఖను కూడ

అందించాం అన్నారు.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚  à°Žà°¨à°¿à°®à°¿à°¦à°¿ కుటుంబాలకు చట్టపరమైన వారసులు ఫైనలైజ్ అయ్యారు. మిగిలిన నాలుగు కుటుంబాలకు చట్టపరమైన వారసులు ఫైనలైజ్ అయిన వెంటనే

అందించడం జరుగుతుందన్నారు. 

బాధితులను తక్షణమే ఆదుకోవాలని, వారికి అండగా నిలవాలని భావించి ప్రమాదం జరిగిన తక్షణమే ఇక్కడకు వచ్చి, బాధితులను ఓదార్చిన

తర్వాత మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటిరూపాయల పరిహారం ఇస్తామని చెప్పి వైయస్ జగన్ ప్రకటించిన విషయాన్ని తెలిపారు.

ఆదివారం విశాఖలో ఉన్న మంత్రులు,

అధికారులతో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈరోజు ఉదయమే మృతుల కుటుంబాలకు సహాయం అందించాలని ఆదేశించారు. ప్రాణాలను తిరిగి తీసుకురాలేం

గాని,మనస్సున్న మనిషిగా ఆయన స్పందించిన తీరుకు à°ˆ సహాయం à°“ నిదర్శనంగా చెబుతున్నాం అన్నారు. 

ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి గురించి సమీక్షించాం.

డిశ్ఛార్జ్ చేయాల్సిన వారిని గుర్తించి వారిని సురక్షితప్రాంతానికి పంపించడం జరుగుతుంది.రేపు ఎక్కువమందిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుందని వైద్యఅధికారులు

తెలియచేశారు.

ఎవరైతే పూర్తిగా కోలుకుని ఇకపై ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యాధికారులు ధృవీకరిస్తారో వారిని మాత్రమే డిశ్చార్జ్ చేస్తాం.డిశ్చార్జ్ చేసిన

అనంతరం వారికి కూడా ముఖ్యమంత్రి ప్రకటించిన పరిహారాన్ని అందించడం జరుగుతుంది.

ఐదు గ్రామాలలో బాధితులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు సహాయం అందిస్తామని

ముఖ్యమంత్రి చెప్పారన్నారు.ఆ ప్రకారం గ్రామాలలోకి ప్రజలు తిరిగి వెళ్లిన వెంటనే వాలంటీర్లను ఇంటికి పంపించి పెన్సన్ ఏమాదిరిగా ఇస్తున్నారో అదేవిధంగా

ఇంటివద్దకే పంపిస్తాం.ఎవరూ కూడా పరిహారం కోసం ఏ అధికారి వద్దకు వెళ్లక్కర్లేదని ముఖ్యమంత్రి తెలిపినట్టు వివరించారు. 

ఇచ్చినమాట నిలబెట్టుకోవడం

తప్పకుండా సహాయం అందించడం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మార్క్,  à°…ందుకే వారందరికి సేవలు తక్షణం అందించే ఏర్పాట్లు చేస్తున్నాం  à°…ని తెలిపారు. 

సంఘటన ఏడోతేదీ

జరిగితే కేవలం మూడురోజుల వ్యవధిలో బాధితకుటుంబాలకి కోటిరూపాయలు ఇవ్వడం జరిగి్ందని, ప్రజల పాలిట అండగా నిలబడతానని గతంలోనే సీఎం ప్రకటించిన విషయాన్నీ గుర్తు

చేసారు. 

నిన్నటి సమీక్షలో నిర్ణయించిన ప్రకారం ఐదుగ్రామాలలో శానిటైజేషన్ ప్రక్రియ ప్రారంభమైందన్నారు.  à°¸à°¾à°¯à°‚త్రం నాలుగుగంటల తర్వాత ఐదుగ్రామాల ప్రజలను à°†

గ్రామాలలోకి అనుమతించడం జరుగుతుంది.

ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఐదుగురు మంత్రులు ఒక్కొక్కరు ఒక్కోగ్రామంలో సోమవారం రాత్రి బసచేయడానికి

నిర్ణయించుకున్నాం అన్నారు. మాతోపాటు అధికారులు కూడా బసచేస్తారని తెలిపారు. 

ఈ సంఘటన దృష్ట్యా రాష్ట్రం లో పారిశ్రామికభధ్రతకు సంబంధించి నూతన విధానాన్ని

తీసుకురావాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అని తెలిపారు. 

కార్యక్రమం లో మంత్రి అవంతి శ్రీనివాస్

మాట్లాడుతూ ఈ ప్రాంతం పూర్తిగా భద్రతా లో ఉందని, ప్రజలందరూ కూడ గ్రామాలలోకి వచ్చిన తర్వాత మెడికల్ క్యాంపులు కూడ నిర్వహించామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్

రెడ్డి సూచించడం జరిగిందన్నారు. 

కార్యక్రమం లో మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ  à°ªà±à°°à°œà°² ఆరోగ్యం,సంక్షేమం పట్ల చిత్తశుద్దితో పనిచేస్తున్న ప్రభుత్వం

ఇదే అన్నారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అనేకమంది నిపుణులతో కమిటీలు వేసి నివేదికలు తెప్పించుకున్న

తర్వాత తగిన విధంగా చర్యలు  à°¤à±€à°¸à±à°•à±‹à°µà°¡à°‚ జరుగుతుందన్నారు.  à°¬à°¾à°§à°¿à°¤ ఐదు గ్రామాల ప్రజలకు ప్రజాప్రతినిధులు, అధికారుల à°…à°‚à°¡à°—à°¾ ఉంటారని తెలిపారు.

మంత్రి బొత్స

సత్యన్నారాయణ మాట్లాడుతూ  à°¨à°¿à°ªà±à°£à±à°² సూచనల మేరకే ఐదు గ్రామాలలో శానిటైజ్ చేస్తున్నామని,  500 మంది సిబ్బందితో à°† పనిచేయిస్తున్నాం.నిపుణులు సలహాలమేరకే సాయంత్రం

నాలుగు గంటల తర్వాత మేం కూడా గ్రామాలకు వెళ్లి గ్రామస్దులను ఇళ్లల్లోకి తీసుకువెళ్తాం అన్నారు. కంపెనీ మెయింటినెన్స్ కు జిల్లా కలెక్టర్ గారు మూడుషిఫ్ట్ లలో

షిఫ్ట్ కు 15 మంది చొప్పున 45 పాస్ లు జారీచేశారు. ప్రమాదం జరిగినప్పుడు 15 మంది ఉన్నారు. వారికి ఎవరికి కూడా ఇల్ హెల్త్ లేదు. కంపెనీపైన మాకు ప్రేమలేదు. ఇక్కడ ఉన్న

ప్రజలపైన, వారి సంక్షేమం, à°ˆ ప్రాంతం భధ్రత పైన మాత్రమే మా ప్రేమ ఉందన్నారు. 

గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దాలనే ధ్యేయంగా పెట్టుకున్నాం.ప్రమాదకర

పరిశ్రమల  à°µà°¿à°·à°¯à°‚లో నిపుణుల కమిటీ నివేదికల ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు. 

ఈ ప్రభుత్వం వచ్చాక ఎల్జీ పాలిమర్స్ కు ఎటువంటి నూతన అనుమతులు ఇవ్వలేదు. పాత

అనుమతులతోనే పనిచేస్తోంది. లాక్ డౌన్లో కేంద్రం సడలింపుల తర్వాత కంపెని మెయింటెన్ చేస్తున్నప్పుడు జరిగిన తప్పిదం. దానిపై విచారణ జరుగుతోందన్నారు. నివేదిక

వచ్చాక ఎవరిని ఉపేక్షించే సమస్య లేదని హెచ్చరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam