DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కచ్చిత కొరెంటైన్ సామాన్యులకేనా? వివిఐపి లకు అవసరం లేదా?

*రాష్ట్రాల మధ్య ఇబ్బడి ముబ్బడిగా తిరుగున్న వారి సంగతేంటి?*

*కరోనా పై జాగ్రత్త సామాన్యులకే అవసరమా? విఐపిలు అతీతులా?* 

*ప్రజలు జిల్లా దాటకూడదా? నేతలు

రాష్ట్రాలు దాటెయ్యొచ్చా?*

*బీజేపీ రాష్ట్ర కమిటీ ఈసీ à°¡à°¾. కెవివివి సత్యనారాయణ* 

*(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°– పట్నం) . . .

విశాఖ పట్నం,

మే 12, 2020 (డిఎన్ఎస్ ): ఇతర ప్రాంతాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే సామాన్యులందరినీ కచ్చితంగా కొరెంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నట్టు ప్రకటిస్తున్న ఆంధ్ర

ప్రదేశ్ ప్రభుత్వం వివిఐపిలు ఎందుకు వదిలేస్తున్నట్టో చెప్పాలని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు డా. కెవివివి సత్యనారాయణ డిమాండ్ చేస్తున్నారు. కరోనా ప్రభావంతో

లాక్ డౌన్ నేపథ్యంలో ఇతర ప్రాంతాల్లో 45 రోజులుగా  à°šà°¿à°•à±à°•à±à°•à±à°ªà±‹à°¯à°¿à°¨ ప్రజలు వారి సొంత గ్రామాలకు వెళ్లాలంటే కచ్చితంగా 14 రోజుల పాటు కొరెంటైన్ ఉండాల్సిందేనని

ఆదేశాలు జారీ చేసిన విషయాన్నీ ఆయన గుర్తు చేస్తున్నారు. దీనికి కట్టుబట్టి వేలాదిగా ప్రజలు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ నిబంధనలను

పాటిస్తున్నారు. 

అయితే దీనికి భిన్నంగా ప్రభుత్వం దృష్టిలో ప్రముఖులుగా ప్రచారం చేయబడుతున్న వివిఐపిలు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా రాష్ట్రాల మధ్య, ఇతర

ప్రమాదకర ప్రాంతాల మధ్య తిరుగుతున్నా వారిని మాత్రం ఎటువంటి కొరెంటైన్ కి పంపడం లేదన్నారు. పైగా ప్రజా ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వివిధ సందర్భాల్లో

ఇబ్బడి ముబ్బడిగా రాష్ట్ర సరిహద్దులు దాటేశారన్నారు. అన్నింటికంటే కీలకమైనది రాష్ట్రం లో ఒక కీలక పదవిలో నియమితులైన వ్యక్తి కూడా తమిళనాడు నుంచి వచ్చినవారు

కావడమే గమనార్హం అన్నారు. వీరెవ్వరినీ కొరెంటైన్ ని ఎందుకు అమలు చేయలేదన్నారు. అధికార పార్టీకి అత్యంత సన్నిహితులైన వాళ్ళు లాక్ డౌన్ తమకు వర్తించదు అనే వైఖరి

తో ఉన్నారనే విషయం వారి నిర్వాకంతోనే తెలుస్తోందన్నారు. 

ఇదే ప్రధాన నిదర్శనం:. . .

ఈ ఘటనకు ప్రధాన నిదర్శనమే మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచాయితా గజపతి

వ్యక్తిగత కార్యదర్శి మోహన్ కుమార్ చెన్నై నుంచి విజయనగరం ఈ లాక్ డౌన్ సమయంలో (గత నెల 20 తర్వాత ) వచ్చారన్నారు. అయితే అతనికి ఎటువంటి వైద్య పరీక్షలు గానీ, కొరెంటైన్

చెయ్యడం గానీ జరగలేదన్నారు. పైగా ఇతను అదేసమయంలో చైర్మన్ ను కలవడం ఆమె గత నెల 26 న సింహాచలం చందనోత్సవం లో పాల్గొనడం కూడా జరిగిందన్నారు. అయితే ప్రభుత్వ నిబంధనల

ప్రకారం ఇతనితో పాటు, చైర్ పర్సన్, సహా సింహాచలం ఉద్యోగులు, అర్చకులందరినీ కొరెంటైన్ కు పంపాల్సి ఉండగా ప్రభుత్వం పూర్తిగా బాధ్యతారాహిత్యం గా ఉందన్నారు.

 

*ప్రజలు జిల్లా దాటకూడదా? నేతలు రాష్ట్రాలు దాటెయ్యొచ్చా?*

రాష్ట్రంలో సామాన్య ప్రజలను కనీస జిల్లాలు కూడా దాటనివ్వడం లేదని, పార్టీ నేతలు మాత్రం

రాష్ట్రాల మధ్య ఇష్టానుసారంగా తిరగవచ్చా అని ప్రశ్నించారు. కొందరు ప్రముఖులు ఇతర ప్రాంతాలకు షటిల్ సర్వీస్ చేసినట్టు తిరుగుతున్నా ఎవరికీ

పట్టింపులేదన్నారు. 

వలస కూలీలకు బలవంతం. . .:

ఇటీవల ఇతర ప్రాంతాలనుంచి రాష్ట్రానికి వచ్చిన వందలాది మంది వలస కూలీలను, ఇతర ప్రయాణీకులను మాత్రం బలవంతంగా

కొరెంటైన్ కు పంపించడం జరుగుతోందన్నారు. చాల చోట్ల ప్రయాణీకులకు, అధికారులకు మధ్య వాగ్వాదాలు సైతం జరుగుతున్నారన్నారు. 

కొరెంటైన్ కు పంపడం తప్పుకాదని,

సామాన్యులను కొరెంటైన్ కి పంపినప్పుడు, విఐపిలను ఎందుకు కొరెంటైన్ కు పంపడం లేదని ప్రశ్నించారు. ఒకే రాష్ట్రంలోని రెండు వేర్వేరు చట్టాలను ఎందుకు అమలు

చేస్తున్నారని ప్రశ్నించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam