DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పదవతరగతి పరీక్షలు భద్రతలో, కట్టుదిట్టంగా నిర్వహిస్తాం:సుబ్బారెడ్డి

*ఏపీ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు డైరక్టర్ సుబ్బారెడ్డి వెల్లడి* 

*జూలై 10 నుంచి ఆంధ్రా లో పదవ తరగతి పరీక్షలు* 

*కేవలం 6 పేపర్లే . . ఉదయం 9 :30 నుంచి

మొదలు.* 

*కరోనా నేపథ్యంలో పూర్తి భద్రత : DNS తో సుబ్బారెడ్డి*  

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి): . . .

అమరావతి, మే 14, 2020 (డి ఎన్ ఎస్ ): ఆంధ్ర ప్రదేశ్ లో జరగవలసిన

పదవతరగతి పరీక్షలను జులై 10 నుంచి నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు డైరక్టర్ ఏ. సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ను విడుదల

చేసిన సందర్బంగా అయన ప్రత్యేకంగా DNS ప్రతినిధి తో పూర్తి వివరాలను తెలియచేసారు. అయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా పరీక్షలు నిర్వహించలేక పోయామని, ప్రస్తుతం

కట్టుదిట్టమైన బాధ్యతల మధ్య ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యార్థుల మధ్య భౌతిక దూరం కచ్చితంగా పాటిస్తామని, ఎంపిక చేసిన పాఠశాలల్లోనే ఈ పరీక్షలు

జరుగుతాయని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు యూటువంటి అపోహలకు లోను కావాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లనూ

చేస్తోందన్నారు. 

లాక్ డౌన్ ముగిసిన తదుపరి ప్రజా రవాణా సంస్థ ల వాహనాలు అందుబాటులోకి రానున్నాయని, లేని పక్షంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలుగ కుండా,

గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు కూడా తగిన రవాణా సదుపాయాలు ఉంటాయన్నారు. విద్యార్థులు కేవలం తమ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని చదువుకుని, మంచి ఫలితాలు

సాధించాలన్నారు. 
 
గతంలో పదవతరగతి 11 పరీక్షల పత్రాలు ఉండగా, గ్రూప్ పరీక్షలకు రెండు పేపర్లు ఉండేవన్నారు, అయితే ప్రస్తుతం ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుందని,

మొత్తం  6 పేపర్లు మాత్రమే విద్యార్థులు వ్రాయవలసి ఉంటుందన్నారు. 

దీనికి సంబంధించి షెడ్యూల్‌ను ఆయన తెలియ చేసారు. 

ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి

మధ్యాహ్నం 12.45 à°—à°‚à°Ÿà°² వరకు పరీక్షా సమయం అని ఎస్ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూలు: ఇదే. . 

పరీక్షల షెడ్యూలు:

జులై 10à°¨ ఫస్ట్‌

లాంగ్వేజ్

జులై 11à°¨ సెకండ్‌ లాంగ్వేజ్

జులై 12à°¨ థర్డ్‌ లాంగ్వేజ్

జులై 13న గణితం

జులై 14 సామాన్య శాస్త్రం

జులై 15న సాంఘీక శాస్త్రం

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam