DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మడ అటవీ భూ వివాదం పై కాకినాడలో ఉద్రిక్తత

*తెదేపా శ్రేణులను అడ్డుకున్న పోలీసులు.*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

అమరావతి, మే 15, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ):  à°¤à±‚ర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ మడ

అటవీ భూముల వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్లస్థలాల పంపిణీ కొఱకు అర్హులైన వారందరినుండి దరఖాస్తులు కోరగా నగరంలో దాదాపు

35 వేల దరఖాస్తులు వచ్చాయి. ప్రతిఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించడంతో ఆదిశగా అధికారులు కసరత్తు చేశారు. అందులోభాగంగా

నగరానికి ఆనుకునివున్న 105 ఎకరాల     పోర్ట్ భూములు సేకరించి చదును చేసి సరిహద్దు రాళ్లను కూడా పాతారు. భూమి సేకరణ సమయంలోనే వివాదం రాజుకుంది. అధికారులు సేకరించిన

భూములలో మడ అడవులు ఉన్నాయని, సహజసిద్ధంగా ఏర్పడిన ఈ అడవులు ప్రకృతి విపత్తుల నుండి నగరాన్ని కాపాడుతున్నాయని, వీటిని ఇళ్లస్థలాల కొరకు కేటాయింపు సమంజసం కాదని,

భూముల యథాస్థితిని కొనసాగించాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వివాదం అధికార వైసీపీ, ప్రతిపక్ష తెదేపా పార్టీల మధ్య చిచ్చు రేపింది. పేదలకు స్థలాలు

ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం, అటవీ భూముల పరిరక్షణ పేరుతో ప్రతిపక్ష తెదేపా తమ మాట నెగ్గించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవి అటవీ భూములు

కావని గతంలో పోర్టుకు కేటాయించిన భూములని అధికారులు చెబుతున్నారు.ఈక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్య నాయకులతో నిజనిర్ధారణ

కమిటీ నియమించారు. ఈ కమిటీ శుక్రవారం ప్రతిపాదిత భూములలో పర్యటించి నివేదికను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కు ఇవ్వాలని నిర్ణయించి కాకినాడ లో గల జిల్లా తెలుగు

దేశం పార్టి కార్యాలయం నుండి బయలుదేరబోతుండగా డిఎస్పీ భీమారావు ఆధ్వర్యంలో పోలీసులు వారి పర్యటన అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెదేపా కార్యాలయం వద్ద కొద్దిసేపు

ఉద్రిక్తత చోటుచేసుకుంది. అలాగే ప్రతిపాదిత భూముల వద్ద భారీస్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు వైసీపీ శ్రేణులు కూడా అక్కడ గుమికూడాయి. నగరంలో

ఏమవుతుందోనని ప్రజలు ఆందోళన చెందారు.కమిటీ సభ్యులు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.జవహర్, జిల్లా ప్రధాన కార్యదర్శి

పిల్లి సత్యనారాయణ మూర్తి మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, తదితరులు పోలీసులు తమను అడ్డుకోవడం పై ఆగ్రహం వ్యక్తంచేశారు. వివాదాస్పద భూములలో వైసీపీ

నాయకులు,కార్యకర్తలు యథేచ్ఛగా తిరుగుతుంటే లేని అభ్యంతరం తమ కమిటీ సభ్యులు పర్యటిస్తే ఎందుకని ప్రశ్నించారు. తమ పర్యటన శాంతియుతంగా జరుగుతుందని తెలిపినా

పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నగరంలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎటువంటి అనుమతులు లేవని, నాయకులు తమకు సహకరించాలని కోరారు.ఈసందర్భంగా తెదేపా

నాయకులు మాట్లాడుతూ కాకినాడ నగరానికి రక్షణగా ఉన్న మడ అడవులను నరికివేసి ఇళ్ల స్థలాలుగా ఇచ్చే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. మడ అడవుల

ప్రయోజనాలు విస్మరించి అధికారులు ప్రభుత్వ పెద్దలకు వంతపాడడం శోచనీయమన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, ఇలాంటి ప్రదేశాలలో ఇవ్వడం

ప్రమాదకరం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన ఆలోచనలు మార్చుకుని మడ అడవులను రక్షించాలని, అలాగే సురక్షిత ప్రాంతాలలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam