DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వలస కూలీలకోసం ప్రత్యేక బస్సులు వెయ్యండి.: సీఎం

*కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ తిరిగి కార్యకలాపాలు*

*ప్రజల్లో భయం, ఆందోళన తగ్గించే చర్యలకు ప్రాధాన్యత*

*ఎస్‌ఓపీలు రూపొందించాలని సమీక్షలో

వైయస్‌.జగన్‌ ఆదేశం*

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)
అమరావతి, మే 16, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): కోవిడ్‌ –19 నివారణ చర్యలపై క్యాంప్‌ కార్యాలయంలో శనివారం సీఎం వైయస్‌.జగన్‌

సమీక్ష జరిపారు. à°ˆ సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌

సెక్రటరీ జవహర్‌రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. à°ˆ సందర్బంగా చర్చకు వచ్చిన అంశాలు.  

భయాందోళనలు తగ్గాలి : .. 

కరోనా పట్ల ప్రజల్లో ఉన్న

ఆందోళన, భయం పూర్తిగా తొలగిపోవాలన్నారు. ప్రజల్లో భయం, ఆందోళన తగ్గాలంటే.. ఏం చేయాలన్న దానిపై దృష్టి పెట్టండన్నారు. ముందు దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా

లక్షణాలు ఉన్నాయని తెలియగానే ప్రజలు పరీక్షలతో పాటు, వైద్యం చేయించుకోవడానికి ముందుకు రావాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారు స్వయంగా ముందుకు వచ్చే పరిస్థితి

తీసుకురావాలన్నారు. దీని వల్లే.. వైరస్‌ను అరికట్టగలుగుతాం అన్నారు. 

అవగాహన కల్పించాలి: . 
కరోనా లక్షణాలు కనిపించగానే వైరస్‌ ఉన్నదీ లేనిదీ à°’à°• వ్యక్తి

ఎలా నిర్ధారించుకో గలుగుతారు అన్నది చాలా ముఖ్యం అన్నారు. ఆ వ్యక్తి ఎవర్ని సంప్రదించాలి? ఎలా సంప్రదించాలి? అన్న దానిపై ఒక పటిష్టమైన యంత్రాంగం అవసరం అని

తెలిపారు. 
ప్రతి ఇంటికీ ఒక కరపత్రం పంచాలన్నారు. కరోనా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందవద్దని, అనుమానం వస్తే.. ఎవర్ని

సంప్రదించాలన్న దానిపై పూర్తి వివరాలను కరపత్రంలో పొందుపరచాలన్నారు. 
ప్రజలు వారంతట వారే ముందుకు రావడం ద్వారా పరిస్థితిలో మార్పు వస్తుంది. కరోనా రావటం తప్పు

కాదని, అది పాపం కాదనే విషయాన్ని ప్రజలకు గట్టిగా తెలియజేయాలన్నారు. 

వైఖరిలో మార్పు రావాలి: . .

కరోనా వచ్చిన వారి పట్ల వివక్ష చూపడం, తక్కువగా చూడ్డం కూడా

మానుకోవాలి:
దీని కోసం తీసుకోవాల్సిన చర్యలు ఇప్పుడు ముఖ్యమైనవి అన్నారు. భవిష్యత్తుల్లో విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయికి కోవిడ్‌ పరీక్షలు జరగాలన్నారు. భౌతిక

దూరం పాటించేలా చేయడానికి దుకాణదారులే ముందుకు వచ్చే పరిస్థితిని తీసుకు రావాలన్నారు. తన దుకాణం ముందు వృత్తాలు గీసుకునేలా అవగాహన

కల్పించాలన్నారు. 

ఎస్‌ఓపీలతో కార్యకలాపాలు: . . .

కోవిడ్‌ విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూనే, తిరిగి కార్యకలాపాలు

ప్రారంభించాలన్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి విధానాలు పాటించాలన్న దానిపై స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రోటోకాల్స్‌ (ఎస్‌ఓపీ) తయారు చేయాలని తెలిపారు. బస్సుల్లో

పాటించాల్సిన ప్రోటోకాల్స్‌ను తయారు చేయాలని సీఎం ఆదేశించారు. రెస్టారెంట్లు, మాల్స్‌లో   క్రమ, క్రమంగా తిరిగి కార్యకలాలుమొదలయ్యేలా ఎస్‌ఓపీ తయారు

చేయాలలన్నారు. 

వలస కూలీలకోసం ప్రత్యేక బస్సులు వెయ్యండి.: 

ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశించి... రహదారుల మీదుగా నడుచుకుంటూ వెళ్తున్న

ఇతర రాష్ట్రాల వలస కూలీల స్థితిగతులపై సమావేశంలో చర్చించారు. 

మండుటెండలో పిల్లా,పాపలతో కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేకుండా నడుస్తున్న వలస కూలీల

పరిస్ధితిని చూసి చలించిపోయారు.  à°®à°¾à°¨à°µà±€à°¯ కోణాన్ని కూడా మర్చిపోవద్దన్నారు.  à°®à°¨ రాష్ట్రం గుండా వెళ్తున్న వలస కూలీలపై ఉదారత చూపాలన్న ముఖ్యమంత్రి.  వలస కూలీలు

కోసం బస్సులు తిప్పడానికి సిద్ధం కండి అని సూచించారు. దాని కోసం విధి, విధానాలు తయారు చేయండన్నారు. వలస కూలీలకు టిక్కెట్టు కూడా అడగవద్దని సీఎం ఆదేశించారు.

నడిచివెళ్తున్న వలస కార్మికులు ఎక్కడ తారసపడ్డా వారిని బస్సులు ఎక్కించి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలన్నారు. 

వారి పట్ల ఉదారంగా ఉండాలని

సీఎం ఆదేశం

ఇదివరకు ఆదేశించిన విధంగా వారికి భోజనాలు, తాగు నీరు ఏర్పాటు చేయాలన్న సీఎం

ప్రోటోకాల్స్‌ పాటిస్తూ నడిపే బస్సుల్లో వలస కూలీలకు 15 రోజుల

పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని సీఎం ఆదేశం

పెరుగుతున్న డిశ్చార్జీలు: . .. 

గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 48 కేసులు నమోదు కబడ్డాయన్నారు. కొత్తగా

నమోదైన 48 కేసులలో 31 కేసులు కోయంబేడు మార్కెట్‌కు సంబంధించినవని అధికారులు తెలిపారు. à°•à°°à±à°¨à±‚లు, అనంతపురం జిల్లాల్లో డిశ్చార్జి సంఖ్య బాగా పెరిగిందన్నారు.
/> నిన్న ఒక్కరోజే 101 మంది డిశ్చార్జి అయ్యారన్నారు. 

లాక్‌డౌన్‌ ఎగ్జిట్‌ వ్యూహంగా వైద్య పరంగా ఎలాంటి విధానాలను అసరించాల్సిన దానిపై చర్చ కు వచ్చింది. కృష్ణా,

కర్నూలులో టెస్టింగ్‌ కెపాసిటీని మరింత పెంచే దిశగా చర్యలు: అధికారులు తెలిపారు. 

రైతు భరోసా కేంద్రాలు : . .

వ్యవసాయ రంగంలో రైతు భరోసా కేంద్రాలు కీలక

పాత్ర పోషించబోతున్నాయన్నారు. మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ విధానం, మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ విధానం ఈరెండు కూడా చాలా ముఖ్యమైనవని స్పష్టం చేసారు. à°ˆ రెండు

విషయాల్లో సమర్థవంతంగా రైతు భరోసా కేంద్రాలు పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. లోపాలు లేకుండా సమర్థ యంత్రంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam