DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*ఆర్టీసీ బస్సులపై నాలుగు రోజుల్లో నిర్ణయం, ఏపీ సీఎం* 

*ఏపీ లో బస్సు ఎక్కితే శల్య పరీక్షలు తప్పవు. . .* 

*కోవిడ్‌ –19 పట్ల ప్రజల్లో భయాందోళనలు పోవాలి*

*మంత్రులు, అధికారులతో సమీక్షలో  à°¸à±€à°Žà°‚ వైయస్‌ జగన్*

(DNS

రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి): . . .

అమరావతి, మే 18, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ): ఆంధ్ర ప్రదేశ్ లో నగరాల మధ్య బస్సు సర్వీసులు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయన్న  à°…ంశంపై మూడు

నాలుగు రోజుల్లో తేదీ ప్రకటన వెలువడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.  
కోవిడ్‌ 19 పై రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో రాష్ట్ర

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి  à°¸à°®à±€à°•à±à°· చేపట్టారు. 

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో à°ˆ సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి కన్నబాబు, సీఎస్‌

నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా

ప్రజా రవాణా సంస్థ నిలిచి పోవడంతో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే అంశంపై చర్చ సాగించారు. 

కోవిడ్‌ –19 పట్ల ప్రజల్లో భయాందోళనలు పోవాలన్నారు. వలస

కార్మికులను ఆదుకునే విషయంలో అధికారులు బాగా పనిచేశార న్నారు. రాష్ట్రం గుండా నడిచివెళ్తున్నవారికి సహాయంగా నిలిచారని, ప్రాతిపదికన తీసుకోవాల్సిన

చర్యలన్నింటినీ తీసుకున్నారన్నారు. à°µà±€à°³à±à°²à± మన ఓటర్లా? మన రాష్ట్ర ప్రజలా ? అని ఆలోచన చేయడం సరికాదన్నారు. మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన సమయం ఇది అన్నారు.

 à°®à°¾à°¨à°µà°¤à±à°µà°‚తో అందర్నీ ఆదుకోవాలన్నారు. 

కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన మార్గదర్శకాలపై సమావేశంలో చర్చ జరిపారు. అంతర్‌ రాష్ట్ర సర్వీసులపై ఎలా

నడపాలన్నదానిపై సమాలోచన చేసారు. 

అంతరాష్ట్ర బస్సుల పై సమీక్ష. . .

హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాలనుంచి రావాలనుకుంటున్నవారికి బస్సులు నడపడంపై

దృష్టి పెట్టారు. వీటిని దశలవారీగా సర్వీసులు పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.  à°¬à°¸à±à°Ÿà°¾à°‚డ్‌ నుంచి బస్టాండ్‌ వరకూ సర్వీసులు, మధ్యలో ఎక్కేందుకు

అనుమతి లేదన్నారు. బస్టాండులో ప్రయాణికులు దిగిన తర్వాత అందరికీ పరీక్షలు చేయాలన్నారు. 

బస్సు ఎక్కిన వ్యక్తికి సంబంధించి పూర్తి వివరాలు తీసుకోవాలని

సీఎం ఆదేశం జారీ చేసారు. 
ఎక్కడ నుంచి బయల్దేరారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నదానిపై వివరాలు తీసుకోవాలన్నారు.  à°¦à±€à°¨à°¿ వల్ల వ్యక్తి  à°•à°¦à°²à°¿à°•à°²à± కనుక్కోవడం  à°¸à±à°²à°­à°‚

అవుతుందన్నారు.  

రాష్ట్రంలో భౌతిక దూరం పాటిస్తూ బస్సు సర్వీసులు నడుపుతామన్నారు. బస్సులో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలన్నారు.

రాష్ట్రంలోకూడా బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై విధివిధానాలు తయారుచేయాలని నిర్ణయం చేసారు. 

సగం సీట్లు మాత్రమే నింపి బస్సు

సర్వీసులు నడపాలని, ప్రైవేటు బస్సులకూ అనుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి బస్సులోనూ అందరూ తప్పని సరిగా భౌతిక దూరం పాటించాల్సిందే

నన్నారు. 

వలస కార్మికుల తరలింపు పూర్తయిన తర్వాత బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయం చేసారు. బస్సు సర్వీసులు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయన్న  à°…ంశంపై

మూడు నాలుగు రోజుల్లో తేదీ ప్రకటన వెలువడుతుందన్నారు. 

ప్రజల భాగస్వామ్యంతో కరోనా నివారణ సాధ్యమన్నారు. 

కారులో ముగ్గురు మాత్రమే ప్రయాణం చెయ్యాలని,

బస్సులో 20 మందికే అనుమతి ఉందని, ప్రతి దుకాణంలో 5 గురు మాత్రమే ఉండాలని, పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలకు 50 మందికే అనుమతి ఉందన్నారు. 

రెస్టారెంట్ల వద్ద టేక్‌

అవే కు అనుమతి ఉందని, టేక్‌ అవే సమయంలో భౌతిక దూరం పాటించాల్సిందేనన్నారు.  à°•à°°à±à°«à±à°¯à±‚ రాత్రి 7 à°—à°‚à°Ÿà°² నుంచి ఉదయం 5 గంటలవరకూ కొనసాగింపు ఉందన్నారు. అన్ని దుకాణాలూ

ఉదయం 7 గంటలనుంచి రాత్రి 7 గంటలవరకూ తెరుచుకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపారు. 

కోవిడ్‌ లక్షణాలు ఉన్నవారు తమకు తాము స్వచ్చందంగా ఆరోగ్యపరిస్థితులను

తెలియ జేయడంపై దృష్టిపెట్టాలన్నారు. ప్రజల్లో ఆందోళన, భయం తొలగిపోయేలా పెద్ద ఎత్తున్న ప్రచారం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. వార్డు క్లినిక్స్‌

ఏర్పాటుపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు. స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలన్న సీఎం 
వచ్చే మార్చి నాటికి ఇవి పూర్తికావాలని సీఎం ఆదేశం

ఇచ్చారు. 

విలేజ్, వార్డు క్లినిక్స్‌ ద్వారా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలకు పూర్తి పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులంతా కార్యాలయాలకు

హాజరయ్యేలా చూడాలని సమావేశంలో నిర్ణయం, తీసుకున్నామన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam