DNS Media | Latest News, Breaking News And Update In Telugu

21 అర్ధరాత్రి నుంచే రోడ్డెక్కనున్న ఏపీ ప్రగతి రథచక్రాలు

*ప్రక్క రాష్ట్రాల్లో చిక్కుకున్న ఆంధ్రుల కోసమే. . . .* 

*హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకి స్పెషల్ సర్వీసులు...!*

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో,

అమరావతి)

అమరావతి, మే 19, 2020 (డి ఎన్ ఎస్ ): లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకు పోయిన ఆంధ్రులను వెనక్కి తీసుకు వచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక

బస్సులను నడుపుతోంది. à°ˆ అర్ధరాత్రి ( మే 21 ) నుంచే à°ˆ బస్సులను ఆంధ్ర నుంచి బయలు దేరి ఆయా ప్రాంతాలకు వెళ్లి, తిరుగు ప్రయాణం లో అక్కడ చిక్కుకున్న వారిని ఆంధ్ర కు

తీసుకు రానున్నాయి. 

లాక్ డౌన్ సడలింపుల తర్వాత ఏపీలో బస్సు సర్వీసుల పునరుద్దరణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన

సమీక్షా సమావేశంలో దీని పై ఒక నిర్ణయం తీసుకు ఏపీ ప్రభుత్వం. ఇవాళ అర్ధరాత్రి నుంచి దూరప్రాంత సర్వీసులు ప్రారంభించే అవకాశముంది. ఇక బస్సులు ఎక్కడి నుంచి

ఎక్కడికి నడపాలనే విషయంలోనూ ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. దీని ప్రకారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల మధ్య సర్వీసులను తొలుత

పునరుద్ధరించనున్నారు.

విజయవాడ, విశాఖ, తిరుపతితో పాటు ప్రధాన నగరాలను కలిపే సర్వీసులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అలాగే ప్రతీ జిల్లా కేంద్రాన్ని మరో

జిల్లా కేంద్రంతో కలిపేలా సర్వీసుల పునరుద్ధరణ ఉండబోతోంది. ప్రస్తుతం దాదాపుగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కరోనా కేసులు ఉన్నాయి. అయితే అవి పూర్తిగా రెడ్

జోన్లలో లేవు. దీంతో జిల్లా కేంద్రాల మధ్య బస్సు సర్వీసుల పునరుద్ధరణకు అవకాశాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా హైదరాబాద్,

చెన్నై, బెంగళూరులో చిక్కుకుపోయిన ఆంధ్రా వాసులను స్వస్ధలాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసినా అది సాధ్యం కాలేదు. దీంతో మరోసారి ఆయా రాష్ట్ర

ప్రభుత్వాలతో మాట్లాడి పరిమిత సర్వీసులను, కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ నడిపేలా ప్లాన్ చేస్తున్నారు. ఇవి కేవలం ఆయా నగరాల్లో చిక్కుకున్న వారిని వెనక్కి

తీసుకొచ్చేందుకు మాత్రమే నిర్వహిస్తారు. అనంతరం వీటిని నిలిపివేస్తారు. ఆయా రాష్ట్రాల్లో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేశాక మాత్రమే ఈ సర్వీసులను పునరిద్ధరిస్తామని

అధికారులు చెప్తున్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam