DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హైవే మీదుగా వలస పాదచారులకు అండగా గౌతమి నేత్రాలయ

*ఆహారం, కూల్ డ్రింక్స్, మంచినీరు, ఓఆర్ఎస్  à°ªà°‚పిణీ*

*వారం పాటు నిర్విఘ్నంగా సేవచేస్తాం: ఎండి కుమార్*

(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)

అమరావతి,

మే 19, 2020 (డి ఎన్ ఎస్ ): లాక్ డౌన్ వెసులుబాటు ఇవ్వడం తో సుదూర ప్రాంతాల నుంచి గమ్యస్థానాలకు పాదచారులై జాతీయ రహదారి వెంట వెళ్తున్న వలస వాదులకు ఆహారాన్ని, మంచినీరు

పంపిణీ చేసి,  à°—ౌతమి నేత్రాలయ సభ్యులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ మీదుగా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి వేలాదిగా పాదచారులై

నడుచుకుంటూ వెళ్తుంటే, వారు పడుతున్న వేదనను, వివిధ ప్రసార మాధ్యమాల్లో చూసిన తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం  à°—ౌతమి నేత్రాలయ చైర్మన్ డాక్టర్ వి కె రాజు

సూచనలు, సహకారం తో మేనేజింగ్ డైరక్టర్ వివి కుమార్, తమ సంస్థ సభ్యులందరితో కలిసి, వీరికి ఆహారం, మంచినీరు, ఎలక్ట్రాల్ ( ఓ ఆర్ ఎస్) పాకెట్, కూల్ డ్రింక్స్, సరఫరా

చేసేందుకు ముందుకువచ్చారు. కిలోమీటర్ల దూరం, రహదారి వెంబడి నడుచుకుంటే వెళ్లడం ఒక దుస్సాహసమేనన్నారు. వీరంతా జీవన పోరాటాన్ని చేస్తూ, తమ స్వగ్రామాలకు చేరే

ప్రయత్నంలో ఉన్నారన్నారు. వీరికి సహకరించడం కనీస భాద్యతగా భావించినట్టు తెలియచేస్తున్నారు. రాజమహేంద్రవరం లో దివాన్ చెరువు మీదుగా వెళ్తున్న వలస

కార్మికులందరికీ ఉపశమనం కలిగే విధంగా à°ˆ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.  à°šà°¿à°¨à±à°¨à°¾à°°à±à°²à±, మహిళలు, వృద్దులు, నిరుపేదలకు తమ సంస్థ అన్ని వేళలా à°…à°‚à°¡à°—à°¾

నిలుస్తుందని, క్రమం తప్పకుండా తాము గ్రామాల్లో కంటి పరీక్ష శిబిరాలు నిర్వహించడమే కాక, అవసరమైన వారికి కళ్ళజోడు కూడా ఉచితంగానే అందిస్తున్నట్టు

తెలిపారు. 

సోమవారం నుంచి వారం రోజుల పాటు à°ˆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తామని కుమార్ తెలిపారు. 
ఈ కార్యక్రమం లో ప్రముఖ న్యాయవాది పి

శ్రీనివాస్,  à°¸à°¿ ఏ à°“ వి. సూర్య ప్రకాష్, సీనియర్ ప్రోగ్రాం మేనేజర్ కె. ఆంజనేయులు, ఐటి మేనేజర్ à°Ÿà°¿. దుర్గ ప్రసాద్, సీనియర్ టెక్నిషియన్స్ దుర్గా రమేష్, శంకర్, కమలేష్,

రాజేష్, సూర్యచంద్ర, సురేష్, కిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam