DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వలస వాదుల పాలిట ఆత్మబంధువే ఈ అనకాపల్లి యువకుడు

అనకాపల్లి నుంచి గాడీల్లో సొంత ఊళ్లకు చేరుస్తున్న బాలు గాడి 

వారం లో 5 వేలకు పైగా ఆశ్రయం, ఆహారం, రవాణా సదుపాయం
 
సమాజ శ్రేయస్సులో బాధ్యతాయుత పాత్ర -  à°—à°¤

చరిత్ర కూడా ఘనమే 

à°’à°• వ్యక్తిగా మొదలై. . .శక్తిగా ఉద్యమిస్తున్న యువకుని వైనం 

అందరికి ఆదర్శంగా నిలుస్తున్న ఎయు పూర్వ విద్యార్థి. 

చేసింది

జర్నలిజం విద్య, చేసేది జనసేవా ఉద్యమం. 

వారు వలస కూలీలు కాదు వలస అతిధులు. . .: బాలు గాడి 

మీడియా లో ఎక్కడా ప్రచారం లేదు, అయినా ఉద్యమం ఉధృతమే

బాలు

గాడి, అనకాపల్లి మొబైల్ నెంబర్ : +91 99480 84888.

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS,  à°¸à°¤à±à°¯ గణేష్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం) . . .

విశాఖపట్నం, మే 22, 2020 (డి ఎన్ ఎస్ ): లాక్ డౌన్ వెసులుబాటు తో వందలాది

కిలోమీటర్ల దూరం రహదారి వెంట నడుస్తున్న వలసవాదుల పాలిట ఆత్మబంధువుగా నిలుస్తున్నాడు అనకాపల్లి కి చెందిన యువకుడు బాలు గాడి. తానూ చేస్తున్న కార్యక్రమం ఆత్మ

తృప్తి కోసమే తప్ప, ప్రచారం కోసం కాదు అని తెలియచేస్తున్న యువకునితో DNS ప్రత్యేకంగా మాట్లాడింది. 

శ్రమ జీవుల కష్టాలు చూడలేకే. . .: 

రవాణా సదుపాయం లేక, ఇతర

రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కార్మికులు సొంత ఊళ్లకు చేరుకునేందుకు నడక మొదలు పెట్టారు. దారిలో ఎన్నో కష్టాలు పడుతూ, ఆకలి దప్పులతో అలమటిస్తూ విశాఖ జిల్లా

చేరుతున్న వీరికి అనకాపల్లి లో అక్షయపాత్ర గా ఆదరిస్తున్న ఈ యువకుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. గత వారం రోజుల్లో సుమారు 5 వేలమందికి పైగా ఆశ్రయం

కల్పించి, ఆహారం అందించి వారికి సురక్షితంగా సొంత గ్రామాలకు చేర్చేందుకు ప్రయివేట్ బస్సులు, లారీలు, జీపులు, ఇలా అన్ని తరహాల వాహనాల వారితో మాట్లాడి, వీరిని సొంత

గ్రామాలకు చేరుస్తున్నారు. 

మార్చ్ 23 నుంచే ఆహారం పంపిణీ. . .  

స్వచ్చంద కార్యకర్తగా తన భాద్యతను నెరవేర్చేందుకు లాక్ డౌన్ మొదలైన మార్చి 23 నుంచి

స్థానికంగా జిల్లాలో చిక్కుకు పోయిన ఇతర ప్రాంతాల వారికీ ఆహారాన్ని, ఉదయం, సాయంత్రం అందిస్తున్నాడు. అవసరమైన వారికీ నిత్యావసరాలను కూడా

అందిస్తున్నాడు. 

నడిచే వారికి ఆశ్రయం, ఆహారం. . .

అయితే లాక్ డౌన్ 3 తర్వాత వలస వాదులు ఒక్క సారిగా నడక మొదలు పెట్టేసరికి వారిని కచ్చితంగా ఆదుకోవాలనే

సంకల్పంతో ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘాల బృందాల సభ్యులతో కలిసి à°’à°• హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసి, ఎక్కడికక్కడ ఆహారం అందే ఏర్పాటు చేసారు. 
అలా నడిచే వారిలో వృద్దులు,

మహిళలు, చిన్నారులు కూడా ఉండడంతో వీరికి తగిన రవాణా ఏర్పాటు చెయ్యాలి అనే సంకల్పంతో వీరందరినీ అనకాపల్లి లో నిలిపి వేస్తున్నారు. స్థానిక పోలీస్ ఎస్ ఐ ను, ఇతర

పోలీస్ అధికారులను సంప్రదించి, వీరిని ప్రయివేట్ రవాణా  à°µà°¾à°¹à°¨à°¾à°²à±à°²à±‹ ప్రయాణించే లా సహకారాన్ని పొందారు. à°—à°¤ వారం రోజుల్లో సుమారు 5 వేలమందిని సురక్షితంగా వారి

గ్రామాలకు చేర్చగలిగినట్టు తెలిపారు. 

సమాజ శ్రేయస్సులో గత చరిత్ర కూడా ఘనమే: . . .

స్వచ్చంద కార్యకర్తా సేవలందిస్తూ గ్రామీణ, ఏజెన్సీ, కొండా ప్రాంతాల్లో

పర్యటిస్తూ ఆయా గ్రామస్తులతో మమేకమై, వారిని చైత్యన్యవంతుల్ని చేస్తూ, విద్యార్థులకు పాఠశాలల్లో ఉండవలసిన కనీస వసతులపై సంబంధిత అధికారులను దాదాపుగా

నిలదీసేంతగా ఉద్యమిస్తున్నారు. గతంలో ఈ యువకుడు చేసిన ఫిర్యాదుకు స్పందించి జాతీయ బాలల హక్కుల కమిషన్ సైతం విశాఖ కు వచ్చి, ఈ ప్రాంతంలో బాలలకు లభించవలసిన మౌలిక

సదుపాయాలపై జిల్లా యంత్రాంగాన్ని సైతం నిలదీసిన సందర్భాలు ఉన్నాయి.  

ఆదర్శంగా నిలుస్తున్న ఎయు పూర్వ విద్యార్థి : 

అందరికి ఆదర్శంగా నిలుస్తున్న బాలు

గాడి విద్యా పరంగా పూర్తి చేసింది జర్నలిజం విద్య, చేసేది జనసేవా ఉద్యమం. à°ˆ యువకుడు ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ( ఆంధ్ర యూనివర్సిటీ)  à°œà°°à±à°¨à°²à°¿à°œà°‚ విభాగం ( దూరవిద్యా

కేంద్రం ద్వారా మొదటి బ్యాచ్) పూర్వ విద్యార్థి కావడం గమనార్హం. 

ప్రతి రోజూ కనీసం 500 కి పైగానే. . .

ప్రతి రోజూ కనీసం 500 మందికి పైగానే వలస వాదులకు ఆశ్రయం

కల్పిస్తున్నారు. à°—à°¤ వారం రోజులుగా సుమారు 5 వేలమందిని సొంత గ్రామాలకు సురక్షితంగా చేర్చగలిగారు.  
వలస వాదుల్లో ప్రధానంగా  à°’రిస్సా, పశ్చిమబెంగాల్ , బీహార్ ,

ఝార్ఖండ్ మరియు చత్తిస్ ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉంటున్నారని తెలిపారు. 

మీడియా ప్రచారం కోసం చూడరు : . . . 

ఒక పైసా ఎవరికైనా సాయం చేస్తే కోట్లాదిగా

ప్రచారం చేసుకునే రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు ఉన్న ప్రస్తుత సమాజంలో బాలు లాంటి నిస్వార్ధ సేవ చేసే యువకులు కూడా ఉండడం

గమనార్హం. 

తానూ చేస్తున్న à°ˆ ఉద్యమం పై ఏరోజూ ప్రసార మాధ్యమాలపై బాలు ఆధారపడలేదు. కేవలం తన పని తానూ చేసుకుంటూ వెళ్లడం మాత్రమే తెలిసిన బాలు  à°‰à°¦à°¯à°‚ గురించి

వివరాలు తెలుసుకునేందుకు DNS  à°¸à°‚ప్రదించినప్పుడు అతను చెప్పిన విషయం ఒక్కటే. . భగవంతుడు శక్తి ఇచ్చింది తోటి వారికి సాయం చెయ్యడేనికే అని. 

వారు వలస కూలీలు

కాదు వలస అతిధులు. . .

నడుచుకుంటూ అనకాపల్లి కి వచ్చే వారంతా వలస అతిధులే తప్ప వలస కూలీలు కాదని అంటారు బాలు. వారంతా శ్రామికులు, కష్టించి పనిచేసే వారు, మన

ప్రాంతానికి అతిధులుగా వస్తున్నారని, వారికీ ఆశ్రయం ఇచ్చి, ఆదరించడం మన ధర్మం అంటారు. అందుకే వారు అతిధులు అనే ఈ యువకుడు అందరికీ ఆదర్శంగా

నిలుస్తున్నాడు. 

ఒరిస్సా, ఛత్తీస్ ఘర్ తదితర రాష్ట్రాలకు వెళ్లే వలస వాదులు ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులు దాటినా తర్వాత ఎటువంటి ఇబ్బంది తలెత్తినా, అక్కడ తమ

సమన్వయకర్త లు ఉంటారని వారిని సంప్రదించవలసిందిగా బాలు సూచిస్తున్నారు. 

బర్హంపూర్ సమన్వయ కర్త మొబైల్  : +91  9937019196 .
రాయఘడ్ సమన్వయ కర్త మొబైల్ : +91 9938582616 . 

à°’à°•

వ్యక్తిగా మొదలై. . .శక్తిగా ఉద్యమిస్తున్న. . . 

వలస వాదులకు అండగా నిలుస్తున్న ఇతనికి సంఘీభావంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్ ఎస్ ఎస్ ) బృందాలు, స్థానిక

ప్రముఖులు, న్యాయవాదులు, యువకులు ముందుకు కదిలి వచ్చారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం ఒక మహోద్యమంగా సాగుతోంది. ఉదయం నుంచి మొదలై, రాత్రి 12 గంటల వరకూ నిరాఘాటంగా వలస

వాదుల సేవలోనే తరిస్తున్న à°ˆ యువకునికి ప్రోత్సాహాన్ని అందించవలసిన భాద్యత ఉంది.  

ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలనుకునే వారు, ఇతర వివరాలు తెలుసుకోవాలనుకునే

వారు సంప్రదించాల్సిన బాలు గాడి, అనకాపల్లి మొబైల్ నెంబర్ : +91 99480 84888.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam