DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్చకులు, పురోహితులకు తేడా తెలియని వాళ్ళు దేవాదాయ శాఖ మంత్రా? 

*బ్రాహ్మణ కుటుంబాల కంట కన్నీరు రాష్ట్రానికి చేటు*

*పురోహితులకు కూడా రూ.5 వేల ఆర్ధిక సాయం చేయాలి*

*బ్రాహ్మణ కార్పోరేషన్ కు రూ.1000 కోట్లు మంజూరు

చేయాలి*

*రూ. 100 కోట్లే ఇచ్చినా చైర్మన్ విష్ణుకు పట్టింపే లేదు. .*
.
*బ్రాహ్మణ కార్పోరేషన్ ను నిర్వీర్యం చేస్తున్నారు* 

*దేవాదాయ శాఖ మంత్రి పై జనసేన అధికార

ప్రతినిధి ఫైర్* 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం )

విశాఖపట్నం, మే 22, 2020 (డి ఎన్ ఎస్ ): బ్రాహ్మణుల సంక్షేమం పట్ల వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే

రాష్ట్రవ్యాప్తంగా 75 వేల మందికిపైగా ఉన్న పురోహితులందరికీ నెలకు రూ. 5 వేల చొప్పున ఆర్ధికసాయం అందచేయాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి  à°ªà±‹à°¤à°¿à°¨ వెంకట మహేష్

డిమాండ్ చేశారు . మన దేవాదాయ à°¶à°¾à°– మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి విషయానికి వస్తే అర్చకులకు, పురోహితులకు తేడా తెలియని మంత్రి à°ˆ రాష్ట్రానికి ఉండడం మన

రాష్ట్ర ప్రజల అదృష్టం అన్నారు.

పురోహితుల బాధను తెలుసుకుని వారికి ప్రభుత్వం వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలని మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరితే బాధ్యత

కలిగిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అర్థరహితంగా మాట్లాడడం పద్ధతి కాదు అన్నారు.

పవన్ కళ్యాణ్ గారిపై ఏదో ఒకటి మాట్లాడేసి తమ ముఖ్యమంత్రి దగ్గర మార్కులు

కొట్టేయాలని ఆత్రం తప్ప తన అజ్ఞానం బయటపడుతుందని ఆ మంత్రి గారికి తెలియడం లేదు అని ఎద్దేవా చేశారు. 'ఆలయాల్లో దేవుడికి అర్చనలు, పూజలు, అభిషేకాలు చేసి భక్తులకు

తీర్ధప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించే వారు అర్చకులు. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు తదితర కార్యక్రమాలు చేసే వారు పురోహితులు. పురం హితం కోరే వారిని పురోహితులు అంటారని

కూడా తెలియని దేవాదాయశాఖ మంత్రి మనకి ఉన్నారు' అని విమర్శించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు బ్రాహ్మణ కార్పొరేషన్ కి రూ. 1000 కోట్లు మంజూరు చేయాలని, ఆ నిధులను

పూర్తిగా బ్రాహ్మణుల సంక్షేమం అభివృద్ధి కోసమే వినియోగించాలని కోరారు. బ్రాహ్మణుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని హితవు పలికారు.

శుక్రవారం ఉదయం

*విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. à°ˆ సందర్భంగా శ్రీ మహేష్ మాట్లాడుతూ..  à°•à°°à±‹à°¨à°¾ లాక్ డౌన్ మూడు నెలలతో పాటు

మే 24 నుంచి మరో రెండు నెలలు అధికమాసం, మూఢం ఉన్నాయన్నారు. à°ˆ ఐదారు నెలల కాలానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న  à°ªà±à°°à±‹à°¹à°¿à°¤à±à°²à± అందరికీ నెలకు రూ. 5 వేలు  à°šà±Šà°ªà±à°ªà±à°¨ చెల్లించాలని

డిమాండ్ చేసారు. 

2019 జూన్ నుంచి ఇప్పటి వరకు బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులు, వ్యయాలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. 

బ్రాహ్మణులకు మంజూరు చేసే

పెన్షన్లను జనరల్ పెన్షన్లుగా చూపుతున్నారు. నిధులు మాత్రం బ్రాహ్మణ కార్పోరేషన్ నుంచి విడుదల చేస్తున్నారన్నారు. 

భారతీ స్కీం కింద పేద బ్రాహ్మణ

విద్యార్ధులకు ఇచ్చే ఉపకార వేతనాలను అమ్మ ఒడిలో కలిపేశారు. గరుడ పథకం కింద పేద బ్రాహ్మణ కుటుంబాల్లో చనిపోయిన వారికి అందచేసే రూ .15 వేల తక్షణ సాయం సక్రమంగా

ఇచ్చింది లేదన్నారు. 

పేద బ్రాహ్మణ విద్యార్ధినీవిద్యార్ధులకు ప్రోత్సాహక సబ్సిడీ రుణాల మంజూరు నిలిపివేశారు. వైసీపీ ప్రభుత్వ బ్రాహ్మణ కార్పోరేషన్ని

పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందన్నారు. 

అందుకే బ్రాహ్మణ కార్పొరేషన్ కి కేటాయించాల్సిన రూ. 1000 కోట్లను రూ. 100 కోట్లకు తగ్గించినా చైర్మన్

మల్లాది విష్ణు మౌనం వహిస్తున్నారు. ఇది పూర్తిగా బ్రాహ్మణుల అభివృద్ధిని నిర్వీర్యం చేసే కార్యక్రమమే ఇది అన్నారు. 

• ఆలయ కోడ్ పేరిట మెలిక పెట్టారు 
/> అర్చకులకు రూ. 5 వేల సాయం చేస్తాం దరఖాస్తు చేసుకోమని ఆర్భాటంగా ప్రకటన ఇచ్చారు. ఆ వెంటనే ఆలయం కోడ్ నమోదు అంటూ మెలిక కూడా పెట్టారు.

దేవాదాయశాఖ కింద ఉన్న

ఆలయాలకు కోడ్ ఉంటుంది. కోడ్ లేని చిన్న చిన్న దేవాలయాల్లో పని చేసే అర్చక స్వాముల పరిస్థితి ఏంటి? ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న ఆలయాల్లో పని చేసే వారి

పరిస్థితి ఏంటి? వారికి ఏ విధంగా న్యాయం చేస్తారో మంత్రి సమాధానం చెప్పాలన్నారు.  à°¦à°°à°–ాస్తు చేసుకున్న వారి సంఖ్య 38 వేలు. 

వారిలో ఎంత మందికి మీ ప్రభుత్వం లబ్ది

చేకూరుస్తుంది. మిగిలిన వారికి ఎలా న్యాయం చేస్తారు?
శుభకార్యాలు, కర్మకాండలు చేసే పురోహితులకు లాక్ డౌన్ వల్ల ఉపాధి దూరమైంది. వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం

లేకుండా పోయింది.

నిరుపేదలుగా ఉన్న కొందరు బ్రాహ్మణులు తిలాదానాలు, దానాలు తీసుకుంటూ  à°œà±€à°µà°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±. వారికి ప్రత్యేకంగా ఏమైనా చేస్తారా? మాట్లాడితే

బ్రాహ్మణులకు న్యాయం చేస్తోంది జగనన్న అనే  à°­à°œà°¨ తప్ప వారికి మీరు చేస్తోంది శూన్యం.

• 100 గోమాతలు చనిపోతే ఎంక్వయిరీ ఏది?

• ఒక్క ఆలయం పునర్ నిర్మించని

వెల్లంపల్లి దేవాదాయ మంత్రిగా అర్హుడా? 

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కప్పగంతుల శివ అనే బ్రాహ్మణుడు కార్పొరేటర్ గా పోటీ చేస్తుంటే మీ వైసీపీ బృందాలు

దౌర్జన్యం చేస్తే ఎందుకు మౌనం వహించారు. అది బ్రాహ్మణుల మీద దాడి కాదా? జక్కంపూడిలో శ్రావణ శుక్రవారం నాడు 100 గోమాతలు చనిపోయిన ఘటనపై ఇంత వరకు ఎలాంటి ఎంక్వయిరీ

లేదు. బాధ్యులపై ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. 

గత ప్రభుత్వం అభివృద్ధి పేరిట ఆలయాలు కూల్చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన

వెంటనే పునర్ నిర్మిస్తాం అన్నారు. ఏడాది కాలంలో ఒక్క ఆలయం అయినా పునరుద్దరణ జరిగిందా? ఒక్క ఆలయాన్ని కూడా పునర్ నిర్మించలేని మీకు దేవాదాయ మంత్రిగా పని చేసే

అర్హత ఉందా? అని ప్రశ్నించారు. 

కూరగాయల ముసుగులో కోట్లు దారిమళ్లించిన ఘనత మీదన్నారు. 
రాష్ట్రంలో ఏ ఒక్కరు బాధ పడినా వారి సమస్యను ఓ బాధ్యతగల రాజకీయ

పార్టీగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి కృషి చేస్తున్నారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు. 

కరోనా విపత్కాలంలో ప్రభుత్వానికి

ఎలాంటి ఇబ్బందులు కలుగచేయకూడదన్న లక్ష్యంతో ధర్నాలు, దీక్షల వంటి వాటికి జనసేన పార్టీ దూరంగా ఉంది. కరోనా మీద చేసే పోరాటంలో విజయం సాధించి ప్రజారోగ్యానికి

రక్షణ కల్పించాలన్న బాధ్యతతో శ్రీ పవన్ కల్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు.

ఆ కుటుంబ ఆశీస్సులతో రాజకీయ భవిష్యత్తు పొందిన వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్

గారు. మా అధ్యక్షులపై అవాకులు చవాకులు వ్యాఖ్యానిస్తే ఉపేక్షించేది లేదు. 

మంత్రి హోదా లో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ హుందాగా ప్రవర్తించాలని, స్థాయి

మరిచి వీడి స్థాయి కార్యకర్తలా మాట్లాడితే పోయేది మీ పరువేనన్నారు. 

ఇప్పటికే మీ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. దుర్గగుడి నిదులను దోచుకుంటున్నారంటూ

ఆరోపణలు వచ్చాయి. కూరగాయల ముసుగులో కోట్లు దారిమళ్లించారంటూ మంత్రిగా మీ గురించి ప్రజలు అనుకొంటున్న మాటలు వినండి. ప్రజల సేవలో ఉండాలి తప్ప మీ పార్టీ స్వామి

సేవలే ఉండడం వల్లనే పరిస్థితి రోడ్డెక్కిందన్నారు. 

ముందుగా మీ దేవాదాయ శాఖ ప్రక్షాళన మీద, భక్తులకు సౌకర్యాలు కల్పించడం మీద దృష్టి పెట్టండని పోతిన

 à°®à°¹à±‡à°·à±  à°¹à±†à°šà±à°šà°°à°¿à°‚చారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam