DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విజయనగరం దీపాల కాంతులను కాలగర్భంలో కలిపేశారు

*కూల్చేసిన విజయనగరం 3 లాంతర్ల స్తూపం* 

*గజపతుల మార్గదర్శకం ముగిసిపోయింది: స్థానికులు* 

*జాతీయ చిహ్నం తో పాటు కూల్చేశారు. కోడ్ కూడా

పాటించలేదు*

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం )

విశాఖపట్నం, మే 23, 2020 (డి ఎన్ ఎస్): విద్యల నగరం, విజయనగరం లోని అత్యంత ప్రసిద్ధికెక్కిన 3 లాంతర్ల స్థూపం

కాలగర్భంలో కలిసి పోయింది. ఆధునికత విస్తృతంగా పెరిగిపోయిన ప్రస్తుత కాలానికి ఈ పాతకాలపు పాచిపోయిన కిరోసిన్ దీపాలు అవసరం లేదు అనుకున్నారో ఏంటో. . . విజయనగరం

మునిసిపల్ అధికారులు శుక్రవారం కూల్చేశారు. 
ఎంతోప్రసిద్ధి చెందిన à°ˆ పురాతన నిర్మాణాన్ని కూల్చడం పట్ల స్థానికులు ఆవేదన చెందుతున్నారు. 

ఈ మూడు లాంతర్ల

స్తూపం పై భారత జాతీయ చిహ్నం (నాల్గు సింహాలు) కూడా ఉండడం గమనార్హం. ఈ స్తూపం కూల్చే సమయంలో జాతీయ చిహ్న కోడ్ కూడా పాటించక పోవడం గమనార్హం.
 
విద్యుత్ అందుబాటులో

లేని కాలం లో ప్రజల సౌకర్యార్ధం పూసపాటి గజపతి రాజులు ఏర్పాటు చేసిన దీప కాంతులు ఈ మూడు లాంతర్లు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం సమీపంలో మూడు వైపులా

కిరోసిన్ లాంతర్లను ఏర్పాటు చేసి, వీటిని నిర్వహించేందుకు వ్యక్తులను కూడా నియమించారు. ప్రతి రోజు రాత్రి వేళల్లో ఈ బాటన సంచరించే ప్రజలకు కాంతి కనిపించే

విధంగా ఈ స్తంభం పై మూడు వైపులా మూడు కిరోసిన్ లాంతర్లను అమర్చారు. ఈ కూడలి నుంచి కోట వైపు మార్గం లో కాంతి కనిపించేలా ఒక లాంతరును, పూల్ బాగ్ వైపు వెళ్లే మార్గం లో

కాంతి కనిపించేలా ఇంకొక లాంతరు ను,  
గంట స్తంభం వైపు వెళ్లే మార్గం లో కాంతి కనిపించేలా మరొక లాంతరును అమర్చారు. వీటిని ప్రతి రోజు వెలిగించి, నిర్వహించే

విధంగా కొందరు వ్యక్తులను కూడా నియమించారు. తదుపరి కాలంలో పాలకులు మారడంతో పాటు విద్యుత్ సరఫరా అందుబాటులోకి రావడం తో అధికారులకు దీనిపై ఏమాత్రం శ్రద్ధ

లేకుండా పోయిందనే అభిప్రాయం స్థానికుల్లో ఉంది. 
గతంలో మునిసిపల్ అధికారులు వీటిని వెలిగించే ప్రయత్నం చేసారు. రాను రాను వీటిని వదిలేశారు. వారి నిర్వాకం

కారణంగానే వీటిల్లో ప్రస్తుతం వెలగని ఒక్క లాంతరు మాత్రమే మిగిలింది. 
వీళ్ళ నిర్లక్ష్యం ఫలితంగా ఈ లాంతర్లు ఒక దిష్టిబొమ్మగా మిగిల్చారు. అయితే నేడు ఈ

ప్రఖ్యాత స్తూపం రోడ్డుకు అడ్డంగా ఉందనుకున్నారో ఏంటో పూర్తిగా కూల్చేశారు. 

స్థానికులను మభ్యపెట్టేందుకు లేక, మారె కారణంతోనే ఈ స్థానంలో మరొక విగ్రహం

పెడతామంటూ అధికారులు చెప్తున్నట్టు సమాచారం. అయితే వీళ్ళు పెట్టబోయే విగ్రహం కొత్తగా పెట్టింది అవుతుందే తప్ప, పూర్వపు ప్రభావం మాత్రం ఏమాత్రం కానరాదు అన్నది

వాస్తవం.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam