DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏయూ చరిత్ర అంతా ఒక ఘనం. ఇప్పుడంతా ధనం. 

విశాఖపట్నం, జులై 6 , 2018 (DNS Online ): ఆంధ్ర విశ్వకళాపరిషత్. . . . అదే ఆంధ్ర యూనివర్సిటీ.  à°¦à°¾à°¦à°¾à°ªà± తొమ్మిది దశాబ్దాల చరిత్ర కల్గిన మహోన్నత విద్యాలయం. భారత మాజీ ఉపరాష్ట్రపతి

డాక్టర్ సర్వేపల్లి, నేటి ఉప రాష్ట్రపతి వెంకయ్య, సి ఆర్ రెడ్డి, ప్రపంచం మెచ్చిన శాస్త్రవేత్త సివిరామన్ లాంటివాళ్లు ఎందరికో ఈ విద్యాలయం తో ప్రత్యేక అనుబంధం

ఉంది. అది అంతా ఒక ఘనమైన చరిత్ర. అవి వినడానికి మాత్రమే బాగుంటాయి. వాటికి భిన్నంగా నేటి వాస్తవ పరిస్థితులు విద్యలోకానికే రోత పుట్టించేలా తయారు చేశారు.

నిరక్షరాస్యులు కూడా ఏ యు ప్రాంగణం లోకి అడుగు పెట్టాలంటే ఎంతో గౌరవంగా భావిస్తుంటారు. అయ్యో తాము ఇలాంటి ఆలయంలో చదువుకోలేకపోయామే అని విచారించే ప్రపంచ

స్థాయి మేధావులూ ఉన్నారు. అలాంటిది నేడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ప్రతీ పనికీ పైరవీలు అవసరం, ఒక పద్దతి పాడూ లేవు, విధి విధానాలు కేవలం కాయితాలకే

పరిమితం. పైగా ఉన్నతాధికారుల మధ్య ఉన్న విభేదాలను వారి చుట్టూ ఉన్న కోటరీ పూర్తిగా విశ్వ విద్యాలయం పరువు చెడగొడుతోంది. ప్రస్తుతం ఏ పని కావాల్సి యున్నా దానికో

ప్యాకేజి, పైరవీలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి,

సదస్సుల పేరిట తప్పుడు లెక్కలు, అడిగే దిక్కే లేదు.

విద్యా విధానంలో పెను మార్పులు తీసుకు వచ్చేందుకు ఏ

యు లాంటి విద్యాలయాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటారు. వాటిలో విద్యార్థులకు అవగాహనా, పరిశోధకులను పునశ్చరణ, జాతీయ, అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ ప్రధాన

మైనవి.పైవన్నీ నేడు కనీసం మచ్చుకైనా కనపడవు. ఇక సదస్సుల పేరిట భారీ మొత్తం లో ప్రభుత్వ నిధులకు గండి పడుతోంది అన్నది ఏ యు వర్గాల మాటే. సుమారు 64 విభాగాలు ఉన్న ఆంధ్ర

యూనివర్సిటీ లో ప్రతీ నెల పెద్ద సంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు జరుగుతూనే ఉంటాయి. వీటికి వివిధ ప్రాంతాల నుంచి అతిధులను పిలుస్తుంటారు, పేపర్లు ముద్రించడం

జరుగుతుంది. దీనికి నిర్వహణ కోసం ఒక సాకు చూపించడం కోసం ఆ నెలలో పదవీ విరమణ చేసే ఒక అధ్యాపకుణ్ణి తెరముందుకు తెస్తారు. దీంతో అయన పేరిట ప్రపంచ స్థాయి జాతీయ

సదస్సు జరుగుతోందని, ప్రచారం చేసుకుని, లక్షలాది గా నిధులకు గాలం వేస్తారు. తమ సభ్యునికి జరిగే గౌరవం కదా అని పెద్ద పెద్ద మొత్తాలు మంజూరు అవుతుంటాయి. ఏ యు లో జరిగే

ఈ విధమైన సదస్సులకు పెట్టిన ఖర్చులకు లెక్కలు చూపాల్సిన భాద్యత నిర్వాహకులపై ఉంటుంది. ఏ రోజూ సదస్సుల లెక్కలు చూపించిన దాఖలాలు ఏ యు చరిత్రలో చాలా అరుదు. దీనికి

వ్యతిరేక ప్రచారం చెయ్యకుండా పత్రికల వారిని సైతం బుట్టలో వేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడే అసలు మతలబు ఉంది. పత్రికల వారిని అగౌరవ పరిచే విధంగా

కాకుండా కొందరు మధ్యవర్తులతో బేరం పెట్టి, వారి ద్వారా ప్రసార మాధ్యమాలను బుట్ట లో వేసే ప్రక్రియను చేపడతారు. దీంతో ఈ సదస్సులు జరిగే పరిసరాల్లోకి రావాల్సిన

అవసరం లేకుండా క్రియ జరిగిపోతుంది. ఒక వేళ ఈ సదస్సులు జరిగే ప్రదేశాల్లోకి ప్రసార మాధ్యమాల ప్రతినిధులు వెళ్లినా పట్టించుకునే నాధుడే ఉండదు.

జనమే ఉండరు. . .

 à°…ంతర్జాతీయ జాతీయ సదస్సు 

జాతీయ సదస్సు అని పేరు పెడతారు, లక్షల్లో నిధులు వసూలు చేస్తారు.సదస్సుల్లో పట్టుమని పది మంది ఉండరు, ఇక్కడే చదివే ఒరిస్సా,

విద్యార్థులని కూర్చోబెట్టి ఇతర రాష్ట్రాల వారు వచ్చారు అని ఫోటోల్లో చూపిస్తారు. ఈ సదస్సుల్లో ప్రవేశానికి ఫీజులు దండిగానే పెడతారు. ఖర్చు పైసల్లో

పెడతారు. 

ఇక అంతర్జాతీయ సదస్సులు పేరుతో చేసే వ్యవహారం ఇంకా దండిగానే ఉంటుంది. ఇక్కడే చదువుకునే ఆఫ్రికా విద్యార్థులను కూర్చోబెట్టి అంతర్జాతీయం

అంటారు. చాలా సదస్సుల్లో ప్రాంరంభ సమయానికే అస్సలు జనమే ఉండరు. ముఖ్య అతిధి వచ్చే సమయానికి సమీపం లోని తరగతి విద్యార్థులను తరలిస్తుంటారు. 

కారణం

వీళ్లందరినీ నిర్వాహకులు కొనుగోలుకు బేరం పెట్టేసి ఉండడమే అనే అభిప్రాయం బహిరంగంగానే ఏ యు లో కోడై కూస్తోంది. దీనికై సంబంధిత విభాగం సంపూర్ణ సహకారం ఉండడం

కూడా ఒక కారణంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం ఖర్చులన్నింటినీ బేరీజు వేసుకుని, త్రుణమో పణమో దక్కించుకునేలా సదస్సులు నిర్వహణకు దాదాపు లక్షల్లోనే

శ్రీముఖానికి విన్నవించుకోవడం గమనార్హం.ఎయు లో జరిగే ప్రతీ అధికారిక కార్యక్రమానికి తప్పని సరిగా లెక్కలు చెప్పాల్సిన భాద్యత ఏ యు సిబ్బంది పై ఉంటుంది. వీటిని

సరి చూడవలసిన భాద్యత ఉపకులపతి పై, రిజిస్ట్రార్ పై కూడా ఉంటుంది. వీరిద్దరికీ à°…à°‚à°¤ సమయం వారి వద్ద లేకపోవడం తో పాటు  à°Žà°¯à± విభాగాల సదస్సుల నిర్వాహకులు చెప్పిన కధలకు

à°Š కొడుతుండడంతో సిబ్బంది ఆడిందే à°…à°Ÿ, పాడిందే పాట à°—à°¾ మారిపోయింది.  à°‡à°¦à°¿ à°ˆ సదస్సుల వరకే పరిమిత మవ్వలేదు. ప్రతీ పనిలోనూ తానా తందానా బ్యాచ్ లు ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే సదస్సులు మొక్కుబడిగా కాకుండా శాస్త్రబద్ధంగా నిర్వహిస్తే ఎటువంటి వ్యతిరేక ప్రచారం జరిగే అవకాశం ఉండదు.  à°‰à°¨à±à°¨à°¤à°¾à°§à°¿à°•à°¾à°°à±à°²à± మధ్య ఏర్పడిన విభేదాలే దీనికి

ప్రధాన కారణంగా తెలుస్తోంది. వీరిద్దరూ వేర్వేరు రాజకీయ పార్టీల అభిమానులు కావడం కూడా ఒక కారణం కావచ్చు. అయితే పార్టీల పై అభిమానం వేరు, విధి నిర్వహణ వేరు. ఈ

భిన్నాభిప్రాయాలు తగ్గనంత వరకూ ఎయు లో పాలన పూర్తిగా ప్రక్కదారి లోనే నడుస్తుంది. దీనికి నిదర్శనమే ఇటీవల మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఎయు హాస్టల్

లో పరిశీలించిన సమయం లో మద్యం సీసాలు ఎయు హాస్టళ్ల పరిసరాల్లో దొరకడమే. వీళ్ళు à°Žà°‚à°¤ శ్రద్ధ à°—à°¾ విధులు నిర్వహిస్తున్నారో తెలియచేస్తుంది.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam