DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారిగా శ్రీధర్ భాద్యతలు స్వీకరణ

*ఐటి సంస్థ నుంచి ఐటిడిఎ సంస్థ పిఓ à°—à°¾  à°šà°¾à°®à°•à±‚à°°à°¿ శ్రీధర్ . . .*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం, మే 27, 2020 (డిఎన్ఎస్ ): శ్రీకాకుళం

జిల్లా  à°¸à±€à°¤à°‚పేట సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ( ఐటిడిఎ ) నూతన ప్రాజెక్ట్ ఆఫీసర్ à°—à°¾ చామకూరి శ్రీధర్ ఐ.à°Ž.ఎస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. à°ˆ సంధర్బంగా ఆయన

విలేకరులతో మాట్లాడుతూ సీతంపేట ఐటిడిఎకు పీవోగా రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. గత పీవో చేసిన ప్రాజెక్ట్ లను కొనసాగిస్తూనే, జిల్లా కలెక్టర్ నివాస్ సూచనల

మేరకు గిరిజనులకు విద్య, వైద్య రంగాలపై దృష్టి పెడుతూ వ్యవసాయం, పర్యాటకం, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానన్నారు. à°—ిరిజనులకు వ్యవసాయంతో పాటు వారికి ఆదాయం

వచ్చే అన్ని మార్గాలను అన్వేషించి తగిన దిశా నిర్దేశాలు చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు త్రాగునీటి ఎద్దడి లేకుండా

చూస్తామని అన్నారు. ఇప్పటికే ఆరు గ్రామాలు త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయని, ఆ సమస్యను వెంటనే పరిష్కరించుటకు చర్యలు తీసుకొంటామన్నారు. దానితో పాటు

మారుమూల గ్రామాల నుంచి ప్రధాన రహదారికి రోడ్లను అనుసంధానం చేసి  à°—ిరిజనులకు రవాణా సౌకర్యాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తామని అన్నారు. à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లాలో

తిత్లీ తుఫాన్ సమయంలో కంచిలి మండలం స్పెషల్ ఆఫీసర్ గా పనిచేసినట్లు తెలిపారు.

తాను ఐఎఎస్ కాక ముందు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒరాకిల్ సంస్థలో

ఇంజనీర్ à°—à°¾ కొంతకాలం పనిచేసినట్లు తెలిపారు. 

అనంతరం సివిల్స్ పరీక్షలు రాసి ఐఏఎస్ కు ఎంపికయ్యానని తెలిపారు. తొలి పోస్టింగ్ నెల్లూరు జిల్లాలోని కావలి

సబ్ కలెక్టర్ గా పనిచేశానన్నారు. రెండవ పోస్టింగ్ కింద సీతంపేట ఐటిడిఎకు ప్రాజెక్ట్ ఆఫీసర్ గా వచ్చానని తెలిపారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఐటిడిఎలోని

అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam