DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లాస్ట్ బాల్ కిరణ్ కుమార్ బ్యాక్ టు పెవిలియన్..

13 à°¨ కాంగ్రెస్ లోకి తిరిగి రాక ? 

విశాఖపట్నం, జులై 6 ,2018 (DNS Online ): నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి... ఈ పేరు వినగానే అందరికీ గుర్తు వచ్చేది క్లారి టీ కావాలి, లాస్ట్ బాల్

ఇంకా ఉంది అనే మాటలే. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రాకు ముగింపు పలికిన ఘనుడుగా పేరు. విభజన సమయంలో కాంగ్రెస్ లోని మొత్తం అధిష్టానాన్ని

తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ని వీడి సమైక్యాంధ్ర పార్టీ కూడా పెట్టి 2014 ఎన్నికల్లో విశాఖ మాజీ మేయర్ సబ్బం హరి, రాజమండ్రి

మాజీ ఎం పి ఉండవల్లి వంటి వారితో కలిసి పోటీ సైతం చేసి డిపాజిట్లు కూడా కోల్పోయారు. అనంతర కలం లో దాదాపు కనుమరుగై రాజకీయాలకే కాదు, మీడియా కళ్ళకు కూడా కనపడకుండా

ప్రజా జీవనం నుంచి మటుమాయమైపోయారు. అయితే తదుపరి కాలంలో ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు, యావద్ భారత దేశం లోనే తుడిచి పెట్టుకు పోవడం తో కాంగ్రెస్ అధిష్టానానికి

గుణపాఠం తెలిసి వచ్చినట్లయింది. దీంతో పార్టీని వీడిన ప్రజల్లో పట్టున్న మాజీలను తిరిగి పార్టీలోకి తీసుకు రావాలి అనే సంకల్పం తో అధ్యక్షుడు రాహుల్ ఆదేశం

మేరకు  à°†à°‚ధ్ర ప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి ఊమెన్ చాందీ నాలుగు రోజుల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించారు. దీంతో మెత్తబడిన కిరణ్ కుమార్

రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే à°ˆ నెల 13  à°¨ పార్టీలోకి వెళ్లేందుకు à°°à°‚à°—à°‚ సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే

పార్టీలోకి రావడానికి కిరణ్ కొన్ని నిబంధనలు పెట్టినట్టు తెలుస్తోంది. ఆంధ్ర లో ప్రచార పగ్గాల తో పాటు, కేంద్ర కాంగ్రెస్ కమిటీలో చోటు తప్పని సరిగా

ఉండాలన్నట్టు సమాచారం. పూర్తిగా అవసాన దశకు చేరుకున్న ఆంధ్ర కాంగ్రెస్ పార్టీలోకి కిరణ్ లాంటివాళ్లు చేరడం ద్వారా కొంత ఆక్సిజన్ అందవచ్చు అని ఆశతో అర్రులు

చేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam