DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభానికి చిన్న జీయర్ రాక 

*అందరికి మంచి జరగాలని మంగళాశాసనం కోరుతూ కేసీఆర్ ఆహ్వానం*

*ఈనెల 29 à°¨ కొండపోచమ్మ రిజర్వాయిర్ నుంచి నీరు విడుదల. .*   

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో,

శ్రీకాకుళం)*

శ్రీకాకుళం, మే 28, 2020 (డిఎన్ఎస్ ): ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా తెలంగాణ లో మరో త్రాగు, సాగు నీటి ప్రాజెక్ట్ కు ఈ నెల 29 న

అందుబాటులోకి రానుంది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శంషాబాద్ లోని జీవా ఆశ్రమానికి చేరుకొని చిన్న జీయర్ స్వామిని ఈ ప్రాజక్ట్

ప్రారంభోత్సవం లో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా త్రాగు, సాగు నీటి విడుదల ద్వారా అందరికి మంచి జరగాలని మంగళశాసనములు చేయవలసిందిగా

కోరారు. 
లాక్‌డౌన్, నియంత్రిత సాగు వంటి అంశాలపై ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్ష అనంతరం సీఎం కేసీఆర్ నేరుగా చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. à°…ంతకు

ముందు జీయర్ స్వామి ఆశ్రమ పండితులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

ఈ కొండపోచమ్మ ప్రాజెక్ట్ శుక్రవారం ఉదయం 11 :30 గంటలకు జీయర్

స్వామితో కలిసి, ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. గత సంవత్సరం జూన్ 21 న కాళేశ్వరం ప్రాజెక్ట్ ను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కు అనుసంధానంగా పలు చిన్న,

మధ్యతరహా సాధక ప్రాజెక్ట్ లు నిర్మాణమవుతున్నాయి.   

కొండపోచమ్మ సాగర్  à°ªà±à°°à°¾à°œà±†à°•à±à°Ÿà± గురించిన వివరాలు : మొత్తం à°ˆ ప్రాజెక్ట్ వ్యయం రూ. 3500 కోట్లు, నిల్వ కెపాసిటీ 15

à°Ÿà°¿ à°Žà°‚ సి అడుగులు కాగా,  2,85,280 ఎకరాల వ్యవసాయ భూములకు నీటి పారుదల అవసరాలు తీర్చనుంది. వీటిలో 1,06, 953 ఎకరాల వ్యవసాయ భూములు సిద్దిపేటలోను, 39, 102 ఎకరాల వ్యవసాయ భూములు సంగారెడ్డి

లో, 82, 040 ఎకరాల వ్యవసాయ భూములు మెదక్ లో, 38,953 ఎకరాల వ్యవసాయ భూములు యాదాద్రి భువనగిరి లోను, 18,232 ఎకరాల వ్యవసాయ భూములు మేడ్చల్ - మల్కాజ్గిరి లోను ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ను మేఘా

ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నిర్మిస్తోంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam