DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళలను హింసిస్తే చట్టరీత్య కఠిన చర్యలు తప్పవు 

*మహిళా కమీషన్ సభ్యురాలు  à°¡à°¾. రాజ్యలక్ష్మి*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

అమరావతి, మే 28, 2020 (డిఎన్ఎస్) : రాష్ట్రంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా,

హింసకు గురి చేసినా మహిళా కమీషన్ తీవ్రంగా చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా కమీషన్ సభ్యురాలు డా. సిరిగినీడి రాజ్యలక్ష్మి తెలియచేశారు. తూర్పు గోదావరి

జిల్లా  à°®à°²à±à°•à°¿ పురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన రేకపల్లి సత్యవతి తన కుమారుడు తనని చూడడం లేదని, తన ఆస్తులు తీసుకుని హింసించి బయటకు నెట్టివేయడం జరిగిందని

తనకు న్యాయం చేయాలని మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేశారన్నారు. ఈమె పరిస్థితిని తెలుసుకునేందుకు గురువారం à°…మలాపురం కొంకాపల్లి కురశాలవారి వీధి లో కుమార్తె

ఇంటివద్ద వున్న సత్యవతిని కలిసి ఆమె సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్యవతి తనకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు వున్నారని, తనకు రెండు ఇళ్లు వుండగా ఒక

ఇల్లును కుమారుడు స్వాధీన పరచుకోవడమే కాకుండా రెండవ ఇంటిలో వుండ డానికి కూడా వీలు లేకుండా హింసించి బయటకు గెంటి వేయడం జరిగిందని, తనకు న్యాయం చేయాలని సత్యవతి

వేడుకోవడం తో కమీషన్ సభ్యురాలు మల్కి పురం ఎస్.ఐ తో ఫోన్ లో మాట్లాడి మూడు, నాలుగు రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. 

ఈ సందర్భంగా మహిళా

కమీషన్ సభ్యురాలు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళల పట్ల గృహ హింస, వరకట్న వేధింపులు,సెక్స్వువల్ వేధింపులు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే అటువంటి వారి పట్ల కమీషన్

తీవ్రం గా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సమాజంలో యువత నైతిక విలువలు, మానవతా విలువలు కోల్పోయి పెదద్రోవ పడుతోందని తెలిపారు. యువత చట్టాలపై అవగాహన

పెంచుకోవలసిన అవసరం ఎంతో వుందని ఇందుకోసం మహిళా కమీషన్ తరపున కళాశాల్లోను, పాఠశాలల్లోను à°¨à±à°¯à°¾à°¯ విజ్ఞాన సదస్సులు, అవగాహనలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని

అన్నారు. మహిళలకు ఎక్కడ సమస్య ఎదురైనా దానిని సుమోటో గా తీసుకుని అక్కడికి వెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కమీషన్ సభ్యురాలు తెలిపారు.

మహిళా కమీషన్ సభ్యురాలు వెంట అమలాపురం సి.డి.పి. ఓ. ఐ.విమలకుమారి, రాజోలు సి.డి.పి. ఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam