DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఐఎన్ఎస్ కళింగలో క్షిపణి పార్కు అగ్నిప్రస్థ కు శంకుస్థాపన

*పార్కులో క్షిపణులు, క్షేత్రస్థాయి సహాయక సామగ్రి నమూనాలు* 

*కళింగ లోని అధికారులు, నావికులు, సిబ్బందికి అంకితం. . .*

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో,

విశాఖపట్నం )

విశాఖపట్నం, మే 29, 2020 (డి ఎన్ ఎస్ ): అగ్నిప్రస్థ పేరిట క్షిపణి చరిత్ర, ఇతర సహాయ సామాగ్రిలా నమూనాలు, ప్రతిరూపాలతో కూడిన ప్రదర్శన శాల క్షిపణి పార్క్

 à°¨à°¿à°°à±à°®à°¾à°£à°¾à°¨à°¿à°•à°¿ 
విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ కళింగలో శంకుస్థాపన జరిగింది. శుక్రవారం ఐఎన్‌ఎస్‌ కళింగ కమాండింగ్‌ ఆఫీసర్‌ కామోడోర్ రాజేష్‌ దేబ్‌నాథ్‌ క్షిపణి

పార్కుకు శంకుస్థాపన చేశారు. వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌ కుమార్‌ జైన్‌, ఇతర నావికాదళ అధికారులు à°ˆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అగ్నిప్రస్థ పార్కు నిర్మాణం

పూర్తయితే.., 1981లో ఐఎన్‌ఎస్‌ కళింగను స్థాపించిప్పటి నుంచి ఇందులో పనిచేసిన అధికారులు, నావికులు, ఇతర సహాయక సిబ్బందికి దీనిని అంకితమిస్తారు. 2018-19 సంవత్సరానికి,

ప్రతిష్టాత్మక "యూనిట్ సైటేషన్" అవార్డును ఐఎన్ఎస్ కళింగ దక్కించుకుంది. ప్రస్తుతం ఏర్పాటు కానున్న క్షిపణి పార్కు ఆ ఘనతకు గుర్తుగా నిలుస్తుంది.

1981 నుంచి

ఇప్పటివరకు ఐఎన్‌ఎస్‌ కళింగ క్షిపణి చరిత్రను గుర్తు చేయడం అగ్నిప్రస్థ పార్కు స్థాపన ఉద్దేశం. క్షిపణులు, క్షేత్రస్థాయి సహాయక సామగ్రి (జీఎస్‌à°ˆ) నకళ్లను à°ˆ

పార్కులో ఏర్పాటు చేయనున్నారు. ఐఎన్‌ఎస్‌ కళింగ చేపట్టిన మిసైల్‌ కార్యక్రమాల చరిత్రను ఇవి తెలుపుతాయి. ఇక్కడ ప్రదర్శించే ప్రతిరూపాలను తుక్కు నుంచి తయారు

చేశారు. P-70 అమెటిస్ట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. ఇది సముద్ర గర్భం నుంచి ప్రయోగించే నౌకా విధ్వంసక క్షిపణి. 1988-91 వరకు సేవలు అందించిన పాత 'చక్ర' (చార్లీ-1

జలాంతర్గామి) అమ్ములపొదిలోనిది.

క్షిపణులు, వాటి సాంకేతిక పరిజ్ఞానాలపై పరిశోధన ఆసక్తి కలిగిన పాఠశాల విద్యార్థుల నుంచి నావికాదళ సిబ్బంది, వారి కుటుంబాల

వరకు అందరినీ ఉత్తేజపరిచేందుకు అగ్నిప్రస్థ పార్కు వేదిక అవుతుంది. యాజమాన్యం, గర్వకారణ భావాలను యూనిట్‌లో ప్రేరేపించడం కూడా దీని ఉద్దేశం. ఆయుధాల లభ్యత,

విశ్వసనీయత, గడువులోగా ఆయుధాలను అందించడం వంటి అంశాల్లో... ర్యాంకు, విభాగంతో సంబంధం లేకుండా మొత్తం సిబ్బంది సహకార అవసరాన్ని ఈ పార్కు తెలుపుతుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam