DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నీటి ప్రాజెక్ట్ ల ద్వారా అందరికీ మంచి జరగాలి :చిన్న జీయర్ 

*కొండపోచమ్మ ప్రాజెక్ట్ ప్రారంభంలో à°¸à±à°µà°¾à°®à°¿à°œà°¿ à°«à±‡à°¸à± à°®à°¾à°¸à±à°•à± తో హాజరు 

*భూనిర్వాసితులకు సంపూర్ణ న్యాయం చేస్తాం: కే చంద్రశేఖర్ రావు* 

(DNS రిపోర్ట్ :

సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం )

విశాఖపట్నం / హైదరాబాద్ , మే 29, 2020 (డిఎన్ఎస్ ): దేశం లో నిర్మించే అన్ని నీటి పారుదల ప్రాజెక్ట్ ల ద్వారా సమాజంలోని ప్రజలందరికీ మంచి

జరగాలి అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి చిన్న జీయర్ స్వామి మంగళాశాసనం చేసారు. తెలంగాణ లోని కొండపోచమ్మ జలాశయం వద్ద మర్కూక్‌ పంప్‌హౌస్‌ కార్యాచరణను

శుక్రవారం ఆయన ప్రారంభించారు. ప్రకృతి నదీ వరప్రసాదం అయిన నీటిని సమాజంలోని వారికి త్రాగు నీటిని, రైతాంగానికి సాగు నీటికి వినియోగపడే విధంగా ప్రాజెక్ట్ లను

నిర్మించడం శుభ పరిణామం అన్నారు. à°ˆ తరహా ప్రాజెక్ట్ నిర్మాణం ద్వారా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా చూసుకోవాల్సిన భాద్యత కూడా ఉందన్నారు.  

à°ˆ

సందర్బంగా  à°¤à±†à°²à°‚గాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు త్వరలోనే తీపి కబురు చెబుతానని.. అది దేశం ఆశ్చర్యపోయే విధంగా ఉంటుందని అన్నారు.  à°ªà±à°°à°¾à°œà±†à°•à±à°Ÿà±à°²

నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయి నిర్వాసితులైన వారి త్యాగాలు వెలకట్టలేనివని, భూ నిర్వాసితులకు సంపూర్ణ న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. 

à°ˆ

కొండపోచమ్మ ప్రాజెక్ట్ శుక్రవారం ఉదయం 11 :30 గంటలకు జీయర్ స్వామితో కలిసి, 
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. గత సంవత్సరం జూన్ 21 న కాళేశ్వరం

ప్రాజెక్ట్ ను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కు అనుసంధానంగా పలు చిన్న, మధ్యతరహా సాధక ప్రాజెక్ట్ లు నిర్మాణమవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు లో ఈ

కొండపొచమ్మసాగర్‌ జలాశయం కాళేశ్వరంలో పదో లిఫ్ట్‌ ప్రాజెక్టు.

కొండపోచమ్మ సాగర్  à°ªà±à°°à°¾à°œà±†à°•à±à°Ÿà± గురించిన వివరాలు : మొత్తం à°ˆ ప్రాజెక్ట్ వ్యయం రూ. 3500 కోట్లు,

నిల్వ కెపాసిటీ 15 à°Ÿà°¿ à°Žà°‚ సి అడుగులు కాగా,  2,85,280 ఎకరాల వ్యవసాయ భూములకు నీటి పారుదల అవసరాలు తీర్చనుంది. వీటిలో 1,06, 953 ఎకరాల వ్యవసాయ భూములు సిద్దిపేటలోను, 39, 102 ఎకరాల వ్యవసాయ

భూములు సంగారెడ్డి లో, 82, 040 ఎకరాల వ్యవసాయ భూములు మెదక్ లో, 38,953 ఎకరాల వ్యవసాయ భూములు యాదాద్రి భువనగిరి లోను, 18,232 ఎకరాల వ్యవసాయ భూములు మేడ్చల్ - మల్కాజ్గిరి లోను ఉన్నాయి. ఈ

ప్రాజెక్ట్ ను మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ నిర్మిస్తోంది.

రక్షణ నిబంధనలు పాటిస్తూ. . . ఫేస్ మాస్క్ తో హాజరు : . . .

సాధువులు, సంత్ లకు సమాజ

పరిరక్షణలో అందరి కంటే ఎక్కువ భాద్యత ఉంటుంది అనే విషయాన్నీ రుజువు చేస్తూ, చిన్న జీయర్ స్వామి ముఖానికి పూర్తి ఫేస్ మాస్క్ ధరించి ఈ ప్రారంభోత్సవానికి

హాజరయ్యారు. తమ ఆశ్రమం నుంచి ప్రాజెక్ట్ వేదికకు చేరుకునే వరకూ. . తలనుంచి పూర్తి పేస్ గార్డ్ (మాస్క్) ధరించి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం

ప్రకటించిన అన్ని నియమాలనూ సంపూర్ణంగా పాటిస్తూ, ఆశ్రమం లోని అన్ని కార్యక్రమాలను కేవలం ఏకాంతంలోనే జరుపుతున్నారు. దీనితో పాటు సమాజం నుంచి కరోనా మహమ్మారి

రావణుని పీడ వదలాలని గత హనుమత్ జయంతి నుంచి వీర హనుమత్ విరాట్ దీక్షను నిర్వహిస్తున్నారు. అంతకు ముందు, వేలాది మందితో గత మార్చి 24 న ఆన్లైన్ ద్వారా శ్రీవిష్ణు సహస్ర

నామ స్త్రోత్ర పారాయణ,  à°¸à±à°‚దర కాండ పారాయణ సైతం నిర్వహించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam