DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏకాంతంలో వైభవంగా అరసవల్లి ఆదిత్యుని కళ్యాణం

*లాక్ డౌన్ తర్వాత అన్ని సేవలూ ఏకాంతంలోనే . . .*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

శ్రీకాకుళం,  à°œà±‚న్  02, 2020 (డిఎన్ఎస్ ):

      శ్రీకాకుళం

జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణం నిర్వహించారు. జేష్ట శుద్ధ ఏకాదశి పురస్కరించుకొని స్వామి వారికి కళ్యాణం

నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ గారు తెలిపారు. మంగళవారం ఉదయం 8గంటలకి కల్యాణం ప్రాంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి

వారి కల్యాణం వైభవంగా జరిగింది. కార్యక్రమం లో ఆలయ కార్యనిర్వహణాధికారి, అర్చకులు, ఇతర అధికారిక సిబ్బంది పాల్గొన్నారు. 

కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం

చతుద్వారా సూర్య నమస్కారములు దేవాలయం లో జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం సూర్యనమస్కారాల ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా

ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుండి దేశం సుభిక్షంగా ఉండాలని, ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడు సూర్యభగవానుడిని భక్తులంతా

స్వామివారిని సేవించాలని ఆయన కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam