DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోర్టు ట్రస్టు కాలుష్య నివారణను తొలి ప్రాధాన్యతగా చర్యలు. .. 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం )

విశాఖపట్నం,  à°œà±‚న్  04, 2020 (డిఎన్ఎస్ ): విశాఖపట్నం పోర్టు ట్రస్టు కాలుష్య నివారణను తొలి ప్రాధాన్యతగా తీసుకుని

కార్యాచరణను కొనసాగిస్తోంది. నగరానికి ఆనుకున్న ఉన్న పోర్టు కావడంతో కాలుష్య నివారణ , పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన చర్యలను  à°¨à°¿à°°à°‚తర ప్రక్రియగా

చేపడుతోంది. 

కాలుష్య నివారణ కోసం పోర్టు తీసుకుంటున్న చర్యలు..

బోగ్గు ఇనుము వంటి కార్గో హ్యాండ్లింగ్ ను పూర్తిగా యాంత్రీకరణ చేయడం కోసం పిపిపి

మోడ్ లో 2 వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకూ  à°–ర్చు చేసింది.
నిల్వ కేంద్రాల చుట్టూ గ్రీన్ బెల్ట్ అభివృద్ది. మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా

కొనసాగిస్తోంది.à°—à°¤ మూడేళ్లలో పచ్చ దనాన్ని పెంపొందించేందుకు  10.50 కోట్ల రూపాయలతో ఇప్పటి వరకూ 4 లక్షల 50 వేల మొక్కలను పెంచారు. à°ˆ ఏడాది 2020_21 à°•à°¿ 1.02 లక్షల మొక్కలను

పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారు. హుదుద్ సమయంలో పచ్చదనం పూర్తిగా నాశనం అయినది. తిరిగి పచ్చదనాన్ని పెంపొందించేందుకు గ్రీన్ విశాఖలో భాగంగా పోర్ట్ కు 5.65

లక్షల మొక్కలను జిల్లా యంత్రాంగం కేటాయించింది. ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖతో కలిసి 2.30 కోట్ల రూపాయలతో 2 లక్షల మొక్కల సంరక్షణ కార్యక్రమాన్ని పోర్ట్

కనసాగిస్తున్నారు.

ఇక బొగ్గు నిల్వలపై టార్ఫలిన్ కవర్లను కప్పి ఉంచుతున్నారు. వీటి నిర్వహణను పోర్ట్ యాజమాన్యం నిరంతరం పర్యవేక్షిస్తుంది. 
యాంటికరణ

ద్వారా ధూళిని గాలిలోకి ఎగరకుండా చేసేందుకు బొగ్గు నిల్వలపై నిరంతరం నీటిని చిమ్మే విధానాన్ని కొనసాగిస్తున్నారు. 

10 ఎంఎల్ à°¡à°¿  à°¨à±€à°Ÿà°¿ శుద్ది ప్లాంట్ ద్వారా

పోర్టు కు అవసరమైన నీటి అవసరాలను తీర్చుతున్నారు. పోర్టు పరిసర ప్రాంతాల్లో దుమ్ము ధూళీ ఎగరకుండా నిత్యం ఈ ప్లాంట్ ద్వారా శుద్ది చేసిన నీటిని రోడ్లపై చిలకరించి

కాలుష్య నివారణ చర్యలను కొనసాగిస్తున్నారు.  à°µà±‡à°¸à°µà°¿à°²à±‹ ధూళి నగరంపైకి విస్తరించకుండా రోజుకు 250 టాంకర్లతో  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•à°‚à°—à°¾ దుమ్మును నివారించేందుకు

వినియోగిస్తున్నారు.
నిల్వ కేంద్రాల నుంచి దుమ్ము ధూళి నగరంపైకి ఎగర కుండా నిల్వ కేంద్రాల చుట్టూ 24 కోట్ల రూపాయలతో కాన్వేంట్ జంక్షన్ నుంచి హెచ్ 8 జంక్షన్ వరకూ 4.2

కిలోమీటర్ల వరకూ  11.5 మీటర్ల ఎత్తైన గోడను నిర్మించారు.

85 లక్షల వ్యయంతో ట్రక్ టైర్ వాషింగ్ సౌకర్యాన్ని కల్పించారు.బెర్త్ ల వద్ద లోడింగ్ అన్ లోడింగ్

జరుగుతున్న సమయంలో ధూళి ఎగర కుండా 85 లక్షల విలువైన రెండు ఫాగ్ కెనాన్స్ వినియోగిస్తున్నారు.రోడ్డుపై నున్న దుమ్మును ఊడవడానికి యాంత్రీకరణ స్వీపింగ్ యంత్రాన్ని

వినియోగంలోకి తీసుకువచ్చారు.

2016లో సుమారుప 60 కోట్ల రూపాయలతో 10 ఎం డబ్యూ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణం.
190 కేవీ రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్ ల ఏర్పాటు . దీని

ద్వారా ఉత్పత్తి అయ్యే 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ లో 7.40 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను పోర్టు తన సొంత అవసరాలకు వినియోగించుకోవడమే కాకుండా మిగిలిన విద్యుత్ ను

గ్రిడ్ కు అనుసంధానం చేసి తద్వారా ఆదాయాన్ని సైతం పొందుతోంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తితో పోర్టు తనకు కావలసిన 100 శాతం విద్యుత్ ను

వినియోగించుకుంటోంది.

పోర్ట్ పరిసరాల్లో కాలుష్యాన్ని సాధ్యమైనంత మేర తగ్గించేందుకు కవర్డ్ స్టాక్ యార్డ్ లా నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం

దీనికి సంబంధించి అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించారు. త్వరలోనే ఇది కార్య రూపం దాల్చనుంది. 

2020 ఏప్రిల్ మాసంలో విశాఖపట్నం పోర్ట్ చేసిన కార్గో, గత ఏడాది(2019)

ఏప్రిల్ మాసంలో చేసిన కార్గో రవాణా ఇంచుమించు సమానంగా ఉంది. 

విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ నగరంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గాలి నాణ్యత సూచీలు

అందించిన వివరాలు 2020 ఏప్రిల్ మాసం 2019 ఏప్రిల్ సూచీలు దిగువన ఇవ్వబడినవి.

 à°¸à±‚చీలను పరిశీలిస్తే లాక్ డౌన్ సమయమైనా, ఏప్రిల్ 2020 లో గాలి నాణ్యత ప్రమాణాలు మెరుగ్గా

నమోదయ్యాయి. 2019లో ఇదే సమయంలో లో గాలి నాణ్యత ప్రమాణాలను పరిశీలిస్తే ప్రస్తుతం నమోదైన వాటికంటే స్వల్పంగా ఎక్కువగా నమోదయ్యాయి.

దీనిని బట్టి పరిశీలిస్తే,

సాధారణ సమయంలో పోర్టు కార్యకలాపాలతో పాటు రోడ్డు ట్రాఫిక్ ఇతర పరిశ్రమలకు సంబంధించి కూడా కాలుష్య కారకాలు వెలువడుతున్నాయి అని స్పష్టమవుతోంది. విశాఖ నగరంలో

 à°—ాలి కాలుష్యం కేవలం విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్ ద్వారానే వెలువడుతుంది అనే వాదన సరికాదనేది ప్రస్తుత గణాంకాలను బట్టి అర్థం అవుతోంది.

శ్రీ కె.

రామమోహనరావు,ఐఏఎస్, చైర్మన్ , విశాఖపట్నం పోర్టు ట్రస్టు...


విశాఖపట్నం పోర్టు ట్రస్టు పరిధిలో కాలుష్య నివారణకు సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళుతున్నట్లు

పోర్టు  à°šà±ˆà°°à±à°®à°¨à± శ్రీ కె. రామమోహనరావు వెల్లడించారు. కాలుష్యాన్ని నివారించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడ టమే పోర్టు తొలి ప్రాధాన్యత అని చైర్మన్

స్పష్టం చేశారు. పోర్టు పరిధిలో దుమ్ము ధూళిని నివారించేందుకు కవర్డ్ నిల్వ కేంద్రాల నిర్మాణం కోసం గ్లోబల్ టెండర్లను పిలిచినట్లు చైర్మన్ తెలిపారు. ఇందుకోసం

కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కొంత ఖర్చును భరించేందుకు అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు. కాలుష్య నివారణకు ఇతర అందుబాటులో ఉన్న అత్యాధునిక పద్దతులను

వినియోగంలోకి తీసుకువచ్చే ఆలచోన చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. 
 à°µà°¿à°¶à°¾à°–పట్నం పోర్టు ట్రస్టు కాలుష్య సూచీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని

ఇందుకోసం పోర్టు పరిసర ప్రాంతాల్లో యాంబినెంట్ ఎయిర్ క్వాలిటీ స్టేషన్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలుష్య సూచీలైన పిఎం 10 పిఎం 2.5 సూచీలు ఎప్పుడూ నిర్ధిష్ట

ప్రమాణాలలోనే ఉన్నాయని ఆయన తెలిపారు.  à°•à°¾à°²à±à°·à±à°¯à°¾à°¨à±à°¨à°¿ నియంత్రించడానికి అవసరమైన అందుబాటులో ఉన్న అన్ని చర్యలను విశాఖపట్నం పోర్టు ట్రస్టు అమలు చేస్తుందని

 à°šà±ˆà°°à±à°®à°¨à± శ్రీ కె. రామమోహనరావు వెల్లడించారు..

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam