DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మృత్యు లోకానికి దారితీసే కార్పొరేట్ విద్యను రద్దు చేయాలి :ఏబీవీపీ 

విశాఖపట్నం, జులై 7 , 2018 (DNS Online ): అత్యంత ఒత్తిళ్ల మధ్య విద్యార్థులను మృత్యులోకానికి తీసుకువెళ్తున్న కార్పొరేట్ విద్యను తక్షణం రద్దు చేయాలని అఖిలభారత విద్యార్థి

పరిషత్ ( ఏబీవీపీ ) డిమాండ్ చేసింది. శనివారం విశాఖ నగరం లోని చైతన్య ఐఐటి క్యాంపస్ వద్ద నిర్వహించిన ధర్నా లో విశాఖ ఏబీవీపీ నగర కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ

ర్యాంకుల పేరిట విద్యార్థులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారని, దీని కి తట్టుకోలేక, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు

రోజుల క్రితం కర్నూలు లోని శీ చైతన్య కాంపస్ లో ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడడం అత్యంత దారుణమన్నారు. దీనికి నిరసనగా శనివారం విశాఖ లోని చైతన్య కాంపస్ వద్ద

ధర్నా చేస్తున్నామన్నారు. అంతకు ముందు క్యాంపస్ నిర్వాహకులతో మాట్లాడి, విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్న కార్పొరేట్ విద్య అత్యంత దారుణంగా మారిందని, విద్య

విధానం మార్చాలని డిమాండ్ చేశారు. అనంతరం కాలేజీ నుంచి విద్యార్థుల తరగతుల బహిష్కరణ చేయాల్సిందిగా పులుపు ఇచ్చారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam