DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వసతి  సదనాల్లో  బాలల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి

*రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యులు అప్పారావు*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  à°œà±‚న్  05, 2020 (డిఎన్ఎస్ ):* శిశు గృహ

మరియు బాలసదన్ లోని బాలల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యులు కె.అప్పారావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా

పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం అరసవల్లిలోని శిశుగృహ మరియు బాలసదన్ ను మరో సభ్యులు పి.వి.వి.ప్రసాద్ తో కలిపి సందర్శించారు. కరోనా సమయంలో బాలల పరిరక్షణ పట్ల

తీసుకున్న ప్రత్యేక చర్యలను పరిశీలించిన సభ్యులు తొలుత చైల్డ్ లైన్ ను సందర్శించారు. à°ˆ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ  à°¶à°¿à°¶à± గృహ, బాల సదన్ లోని బాలల పట్ల ప్రత్యేక

శ్రద్ధ తీసుకోవాలని, మన ఇంటిలోని పిల్లల కంటే మిన్నగా వారిని చూసుకోవాలని సభ్యులు పేర్కొన్నారు. బాలల ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికపుడు తెలుసుకుంటుండాలని,

వారికి సరైన పోషకాహారం అందిస్తూ పరిశుభ్రత, ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ కనబరచాలని అన్నారు. బాలల ఆరోగ్యాన్ని పరిశీలించేందుకు ప్రత్యేకంగా వైద్యులున్నారా? అని

ప్రశ్నించిన కమీషన్ సభ్యులు వైద్యులను ఏర్పాటుచేయాలని సూచించారు. అలాగే స్మశానవాటికకు దగ్గరలో శిశుగృహ, బాలల సదన్ ఉండటాన్ని గమనించిన సభ్యులు తమ అభ్యంతరాలను

వెలిబుచ్చారు. స్మశానవాటికకు వచ్చే పోయే వారి వలన బాలల మానసిక స్థితిగతులపై దీని ప్రభావం ఉంటుందని, కావున దీన్ని వేరే ప్రదేశానికి మార్చేలా చర్యలు తీసుకోవాలని

సూచించారు. అదేవిధంగా శిశు గృహలో వంట గది, హాలు, పడక గది అన్ని ఒకేచోట ఉండటం మంచిది కాదని, పిల్లలకు ప్రమాదం జరిగే అవకాశముందని తెలిపారు. కావున ప్రతి గదిని

వేరుచేస్తూ పార్టీషియన్ చేయాలని సూచించారు. శిశుగృహలోని బాలలు విదేశాల్లో ఎవరైనా ఉన్నారా ? అని ప్రశ్నించిన సభ్యులు ముగ్గురు విదేశాల్లో ఉంటున్నారని శిశు గృహ

పర్యవేక్షకులు సమాధానం ఇవ్వగా వారి బాగోగులను అడిగి తెలుసుకుంటున్నారని ప్రశ్నించారు. శిశు గృహ నుండి బాలలను దత్తతకు తీసుకువెళ్లే తల్లితండ్రులను

ఎప్పటికపుడు బాలల యోగక్షేమాలను తెలుసుకుంటుండాలని సూచించారు. అనంతరం బాలసదన్ లో విద్యను అభ్యసిస్తున్న బాలలను వారి యోగక్షేమాలు, విద్యాభ్యాసం, వసతి సదుపాయాల

గురించి అడిగి తెలుసుకొని సంతృప్తిని వ్యక్తం చేసారు.

          జిల్లాలో చైల్డ్ లైన్ పై సమీక్షించిన సభ్యులు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో

సిబ్బంది ఉన్నారని అన్నారు.  à°…ందరూ సమిష్టిగా కృషిచేసి బాలల స్నేహపూర్వక జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ అపార అవకాశాలున్నాయని ఉన్నాయని కమీషన్ సభ్యులు

అభిప్రాయపడ్డారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా సమయంలో బాలల సమస్యల పరిష్కారం పట్ల అన్ని శాఖల సమన్వయం అవసరమని, ఎవరైనా అధికారులు స్పందించకపోతే

వాటిని తమ దృష్టికి తీసుకురావాలని, అటువంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైల్డ్ లైన్ సిబ్బంది చట్టరీత్యా చేయవలసిన కార్యక్రమాలను తూ.చ

తప్పకుండా ఆచరించిన పిదపే రిపోర్టింగ్ చేయాలని సూచించారు. చివరగా చైల్డ్ లైన్ జిల్లాలో బాగా పనిచేస్తుందని కితాబు ఇచ్చారు.

          à°ˆ పర్యటనలో రాష్ట్ర బాలల

పరిరక్షణ కమీషన్ సభ్యలు పి.వి.వి.ప్రసాద్, జిల్లా బాలల పరిరక్షణ  à°…ధికారి  à°•à±†.వి.రమణ, బచపన్ బచావో ఆందోలన్ రాష్ట్ర సమన్వయకర్త బమ్మిడి చంద్రశేఖరరావు, జిల్లా బాలల

పరిరక్షణ కమిటీ ఛైర్మన్ జి.నరసింహమూర్తి, సభ్యులు సురేష్, జ్యోతి, à°¡à°¿.పి.à°“  à°“.వి.యల్ సత్యనారాయణ, ఏ.హెచ్.à°Ÿà°¿.యు ఏ.యస్.ఐ పి.వి.రమణ, మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ ఏ.పి.à°¡à°¿.à°“

నాగమణి, శిశుగృహ మేనేజర్ కె.నరేష్, ఏ.యన్.ఎం శార్వాణీ , ఐ.సి.పి.యస్ పి.డి బి.లక్ష్మునాయుడు, మల్లేశ్వరరావు, శిశు గృహ సామాజిక కార్యకర్త రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam