DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్యా ఫీజు వివరాలు స్కూల్ నోటీసు బోర్డులో ఉంచాలి

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  à°œà±‚న్  05, 2020 (డిఎన్ఎస్ ):*  à°µà°¿à°¦à±à°¯à°¾ సంస్ధలు తరగతుల వారీగా ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో

ప్రదర్శించాలని రాష్ట్ర బాలల హక్కుల కమీషన్ సభ్యులు కేసలి అప్పారావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు శుక్రవారం విచ్చేసిన అప్పారావు శ్రీకాకుళం జిల్లాకు

చెందిన బాలల హక్కుల కమీషన్ సభ్యులు పి.వి.వి.ప్రసాద్ తో కలసి ఆర్ అండ్ బి అతిథి గృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ప్రైవేటు రంగంలో నడుస్తున్న ఉన్నత పాఠశాలలు,

జూనియర్ కళాశాలలు  à°¤à°°à°—తుల వారీగా ఫీజుల వివరాలు నోటీసు బోర్డులో పెట్టాలన్నారు. అంతస్తుల భవనాల్లో ఉన్న విద్యా సంస్ధలు దివ్యాంగుల కోసం ర్యాంపులు లేదా లిఫ్ట్

లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే వరకు తరగతులు నిర్వహించరాదని, ఫీజులు వసూలు చేయరాదని ఆయన స్పష్టం

చేసారు. ఈ మేరకు ప్రభుత్వం మే 7వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఉత్తర్వులను ఉల్లంఘించే విద్యా సంస్ధలపై కమీషన్ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు.

బాలల హక్కుల కమీషన్ హై పవర్ కమీషన్ అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయగలదని ఆయన వెల్లడించారు. కోవిడ్ 19 కారణంగా కుటుంబాల ఆర్ధిక స్ధితి చిన్నాభిన్నమైందని,

అయినప్పటికి పిల్లల విద్యాభ్యాసానికి ముగింపు పలకరాదని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడితోపాటు పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తద్వారా

విద్యాభ్యాసానికి ఎటువంటి ఆటంకం ఉండదని గ్రహించాలని అన్నారు. కొన్ని విద్యా సంస్ధలు ఫీజును 10 నుండి 15 శాతం వరకు పెంపుదల చేసినట్లు తెలిసిందని అన్నారు. విద్యా

సంస్ధలు ఫీజులు పెంపుదల చేయరాదని ఆయన చెప్పారు. అటువంటి సంస్ధల పట్ల సమాచారం అందించాలని, వాటిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఆన్ లైన్ తరగతుల నిర్వహణపైనా

తల్లిదండ్రులు పిర్యాధులు చేస్తున్నారని చెప్పారు. కోవిడ్ 19 లాక్ డౌన్ సమయంలో చిన్నారులు కూడా పలు ఇబ్బందులకు గురి అయ్యారని తెలిపారు. తమ తల్లిదండ్రులతో కలసి

సొంత గ్రామాలకు పయణమయ్యారని ఈ సమయంలో సుదూర ప్రాంతాలకు నడక మార్గంలో వెళ్ళారని అన్నారు. అదేవిధంగా క్వారంటీన్ కేంద్రాల్లోనూ గడిపారని చెప్పారు. క్వారంటీన్

కేంద్రాల్లో పిల్లల మనోవికాసానికి అవసరమగు ఏర్పాట్లు ఉండాలని పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయంలో తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు.

అంతర్జాలం అందుబాటులో ఉందని తద్వారా అనవసర అంశాలను కూడా పిల్లలు వీక్షించే అవకాశం ఉన్నందున వారిని ఒక కంట కనిపెట్టాలని అన్నారు. 12 నుండి 18 సంవత్సరాల వయస్సుగల

పిల్లల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మోబైల్ ఫోన్ లలో అనవసర గేమ్ లు అడటం జరుగుతుందని అది విపరీతాలకు దారితీస్తుందని అన్నారు. అంతర్జాలం, మద్యం వంటి

వ్యసనాలకు లోనైన పిల్లల వలన కరోనా లాక్ డౌన్ సమయంలో 40 కేసులు నమోదు అయ్యాయని అప్పారావు చెప్పారు. ధిశ చట్టం వలన బాలికలు, మహిళలు ధైర్యంగా పోలీసు స్టేషన్లలో

పిర్యాధులు చేస్తున్నారని తెలిపారు. దిశ వలన తక్షణ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతులతోనే బాలల సంరక్షణ కేంద్రాలు నడవాలని ఆయన స్పష్టం చేసారు.

జిల్లాలో 26 కేంద్రాలు ఉండగా వాటిలో ఆరు వందల మంది చిన్నారులు ఉన్నారని, ప్రస్తుతం 41 మంది ఉన్నారని చెప్పారు. 41 మందిని కూడా దత్తతకు ఇవ్వడానికి ప్రతిపాదనలు పెట్టాలని

అన్నారు. 18 సంవత్సరాల లోపు వయస్సు వారిని చట్టపరమైన నిబంధనలు మేరకు మాత్రమే దత్తత తీసుకోవాలని వివరించారు. బాలలకు జీవించే హక్కు ఉందని దానిని కాలరాయరాదని

చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో బాలల సంరక్షణకు అన్ని సంస్ధలు బాగా పనిచేస్తున్నాయని అప్పారావు ప్రశంసించారు. వాలంటీరు వ్యవస్ధ ద్వారా బాల్య వివాహాలు లేకుండా,

మద్యలో బడి మానివేసిన వారు లేకుండా చూసే అవకాశం ఉందని అప్పారావు అన్నారు. వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించే ఆలోచన ఉందని అన్నారు.

          బాలల

హక్కుల కమీషన్ సభ్యులు పి.వి.వి.ప్రసాద్ మాట్లాడుతూ బాలల హక్కులపై పిర్యాధు వెంటనే స్వీకరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. బాల్య వివాహాల విషయంలో వయస్సు

ధృవీకరణ పత్రం అడిగిన వెంటనే ప్రైవేటు కళాశాలలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నాయని వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam