DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రామాయణ పారాయణ, వేదఘోషతో పులకించిన కల్పవృక్షం

విశాఖ లో ప్రతి వారం శ్రీరామ పట్టాభిషేకం, గోధూళి, పండిత సమ్మానం 

పండితుల స్థితి à°•à°¿ కన్నీటి పర్యంతం అయిన నిర్వాహకులు 

జ్యేష్ఠా పౌర్ణమి వేడుకలతో

శత పండిత సత్కారం పరిపూర్ణం.

పండిత ఆత్మాభిమానం. . . ఎంతో గొప్పది. : రాంబాబు. . . 

గాయక శ్రేష్ఠ ఎస్పీ బాలు, కళాభారతి రాంబాబుల  à°¬à±ƒà°‚దం

సారధ్యంలో 

కల్పవృక్షం లో వేదఘోష వైభవం పై DNS ప్రత్యేక కథనం

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం). . .

*విశాఖపట్నం,  à°œà±‚న్  06, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ):* à°—à°¤ రెండున్నర

నెలలుగా రామాయణ పారాయణ, పట్టాభిషేకం, వేదఘోష, గోధూళి, పండిత సమ్మానం తో విశాఖ మహా నగరం లోని కల్పవృక్షం ప్రాంగణం పులకించి పోయింది. కళాభారతి కళా ప్రాంగణ

కార్యదర్శి, జి ఆర్ కె ప్రసాద్ ( రాంబాబు), డా. ఇందిర దంపతుల సంకల్పంతో వారి నివాస ప్రాంగణం కల్పవృక్షంలో అత్యంత వైభవంగా ప్రతి వారం శ్రీరామాయణ పారాయణ, సీతారామ

పట్టాభిషేకం, నిర్వహించి, వేదపండితులకు సమ్మానం చేసి అమితానందాన్ని అనుభవించారు. కరోనా కష్టకాలంలో పండిత, పురోహితులకు తమ వంతు సహకారాన్ని అందించాలి అనే

సంకల్పంతో నిత్యావసర వస్తువులతో కూడిన గ్రాసం అందించేందుకు సంకల్పించారు. 

వీరి సంకల్పానికి పెద్దల సహకారం, ప్రోత్సాహం అందిస్తూ ప్రముఖ నేపధ్య గాయకులూ

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ( చెన్నై) తన సంపూర్ణ సహకారం అందిస్తున్నట్టు తెలియచేసారు. అదే తడవుగా à°ˆ మహత్తర కార్యక్రమాన్ని ఆరంభించారు. 

గత రెండున్నర నెలలుగా

రామాయణ పారాయణ, పట్టాభిషేకం, వేదఘోష, గోధూళి, పండిత సమ్మానం తో విశాఖ మహా నగరం లోని కల్పవృక్షం ప్రాంగణం పులకించి పోయింది. ప్రతి వారం పట్టాభిషేకం జరిపిన తదుపరి

పండిత సత్కారం జరిపించడం ఆనవాయితీ గా చేపట్టారు. ప్రధానంగా విశాఖ నగరం, జిల్లా పరిసర ప్రాంతాల్లోని వారికి స్వయంగా ఆహ్వానించి, తమ సత్కారం పొందవల్సిందిగా

ప్రార్ధించారు. సుమారు 103 à°•à°¿ పైగా పండిత, పురోహితులను ఆత్మీయ సత్కారం చేయగలగడం తమ అదృష్టంగా అభివర్ణించారు. 

ప్రతి వారం వేద పండితులు వేదపఠనం చేస్తుండగా. . .

ప్రతి పురోహితునికీ, కనీస దూరంలో ఆసనాలు వేసి, గౌరవప్రదంగా ఆహ్వానించి, కూర్చోబెట్టి 10 కేజీల బియ్యం, కంది పప్పు, పంచదార, మిరపకాయలు, చింతపండు, నూనె, గోధుమ పిండి,

పసుపు తదితర నిత్యావసర వస్తువులతో పాటు తాంబూల సమర్పణ చేసి ఆశీస్సులు అందుకున్నారు. పండిత గౌరవ కార్యక్రమాన్ని వేదపండితులే వేదమంత్రాలు వల్లిస్తూఉండగా

శాస్త్రీయంగా అందించడం జరగడం ఎంతో సంప్రదాయపరంగా ఉంది.

ఆఖరి వారంగా శుక్రవారం జరిగిన కార్యక్రమం అత్యంత ప్రాశస్త్యమైన జ్యేష్ఠా పౌర్ణమి పర్వదినం కావడం

మరొక శుభ పరిణామం. à°ˆ కార్యక్రమం లో  30 మంది వేద పండితులు ఘనపాఠీలు పాల్గొనడం మరో శుభ సూచికం. అందరూ ఒకే గళం, స్వరంతో చేసిన వేదపఠనం తో కల్పవృక్షం పులకరించి

పోయింది. 

à°ˆ యజ్ఞం లో సహకారాన్ని అందించిన వారిలో ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం దంపతులు, మంతెన సత్యనారాయణ రాజు దంపతులు, సి ఎస్ ఎన్ రాజు,  à°œà°¿ వి ఎస్

శాస్త్రి,  , వల్లూరి కోదండ రామారావు, వెంకట పార్వతి తులసి దంపతులు (బొంబాయి వాస్తవ్యులు), సివిఎస్ సూరి దంపతులు ( హైదరాబాద్), ఎందరో మహానుభావులు సంపూర్ణ

ప్రోత్సాహాన్ని అందించారు. 

పండిత ఆత్మాభిమానం. . . ఎంతో గొప్పది. : రాంబాబు. . . 

ఇల్లు దాటి వెళ్లే పరిస్థితి లేక, పౌరాహిత్య కార్యక్రమాలు లేక, ఎదుటివారి

ముందు చేయి చాపలేక, గత రెండున్నర నెలల అత్యంత క్లిష్టమైన కాలం లో అవస్థ పడుతున్న స్థితిలో కొనసాగుతున్న వేదపండితులు, పురోహితులకు మా వంతు సహకారాన్ని అందించడం మా

అదృష్టంగా భావిస్తున్నట్టు రాంబాబు తెలిపారు. పండిత ఆత్మాభిమానం ఎంతో గొప్పదని, సాక్షాత్తు వేదమాత తమ ప్రాంగణంలోకి నడిచి వచ్చిందన్నారు. వారు వేద ఆశీర్వచనం

చేస్తూ ఉంటే ఇంతటి జ్ఞాన వంతులు కరోనా మహమ్మారి వల్ల సాపాటు కు ఇబ్బంది పడుతున్నారా  à°…ని కన్నీటి పర్యంతం అయ్యారు. 

అందరినీ ఒకేసారి అనుకున్నా. . . కనీస దూరం.

103 మంది పండితులనూ ఒకేసారి సత్కరించాలి అనుకున్నప్పటికీ. . . ప్రభుత్వ నిబంధనలకు లోబడి కనీస దూరం పాటించవలసినందున, అంతమంది 6 అడుగుల దూరం లో ఏర్పాటు చెయ్యడం

సాధ్యం కాక పోవడంతో ప్రతి వారం కొంతమందిని ఆహ్వానించడం జరిగిందన్నారు. మొత్తం 103 మంది పండితులూ ఒకే స్వరం తో వేదఘోష జరిగి ఉంటె ఆ వైభవం అత్యంత సుందరంగా

ఉండేదన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam