DNS Media | Latest News, Breaking News And Update In Telugu

8 నుంచి గుళ్ళు, ప్రార్ధన మందిరాల్లో ఇవి కచ్చితంగా పాటించాల్సిందే

*కంటైనెమెంట్ జోన్ లో ఉంటె అవి మూసి వెయ్యాల్సిందే. . .*

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  à°œà±‚న్  06, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ):*  à°•à°°à±‹à°¨à°¾ వైరస్ కారణంగా

దేశవ్యాప్తంగా రెండు నెలల నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ 5.0 జూన్ 30 వరకు కొనసాగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సడలింపులు

ఇచ్చింది. 

ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తిరిగి తెరుచుకోనున్నాయి. 

ఈ నేపథ్యంలో ఆలయాలు, ప్రార్థనా మందిరాలు,

షాపింగ్ మాల్స్, హోటల్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. 

ఒకవేళ ఆలయాలు,

ప్రార్థనా సంస్థలు కంటెయిన్‌మెంట్‌ జోన్లలో ఉంటే మూసే ఉంచాలని స్పష్టం చేసింది. 

* 65 ఏళ్లకు పైబడిన వయసువారు, ఇతరత్రా రుగ్మతలు ఉన్నవారు, గర్భిణీలు, 10 ఏళ్లలోపు

పిల్లలు ప్రార్థనాలయాలకు ఆలయాలకు వెళ్లకపోవడం మంచిది. 

ఇందుకు అనుగుణంగా ఆలయాలను పర్యవేక్షించే సంస్థలు భక్తులకు సూచనలు ఇవ్వాలి.

* భక్తులు దర్శనం

కోసం క్యూలైన్ లో ఉన్నపుడు కనీసం ఆరడుగుల భౌతికదూరం తప్పకుండా పాటించాలి. ఇందుకు సంబంధించి ప్రార్థనాస్థలాల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి.

* ఫేస్ కవర్స్

లేదా మాస్కులు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతించాలి.  

* వీలైనంత వరకూ సబ్బుతోగానీ (40 నుంచి 60 సెకన్లపాటు), శానిటైజర్ (కనీసం 20 సెకన్లు) తోగానీ చేతులను అవకాశం

ఉన్నపుడల్లా శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

* దగ్గు, తమ్ములు వచ్చినపుడు తప్పనిసరిగా మోచేతలను అడ్డుపెట్టుకోవడం లేదా కర్చీఫ్, టిష్యూ పేపర్ ను ఉపయోగించాలి.

టిష్యూ పేపర్ ను పారవేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

* భక్తులు ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అనారోగ్యకరమైన లక్షణాలు

కనిపించినా వెంటనే జిల్లా హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయాలి.

* ఆలయ పరిసరప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని ఖచ్చితంగా నిషేధించాలి.

*

భక్తులందరికీ ఆరోగ్యసేతు యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించాలి.

అన్ని మతపరమైన ప్రాంతాల్లో ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి:

* ప్రవేశ ద్వారాల వద్ద

శానిటైజర్లు, థర్మల్‌ స్కానర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. 

* దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు లేనివారినే దర్శనానికి అనుమతించాలి. 

* మాస్కులు ధరించి

ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి

* కోవిడ్-19 గురించి, నివారణ చర్యలకు సంబంధించిన పోస్టర్లు/ స్టాండీలు ఏర్పాటు చేయాలి. వైరస్ పై ప్రజలకు మరింత అవగాహన

కల్పించేలా ఆడియో, వీడియో క్లిప్ లు ప్రదర్శించే ఏర్పాట్లు చేయాలి.

* భక్తులు వీలైనంత వరకు తమ పాదరక్షలను వాహనాల్లోనే వదిలి వెళ్లాలి. మరీ అవసరమైతే .

 

ప్రతి వ్యక్తి / కుటుంబ సభ్యుల వరకు ప్రత్యేక స్టాళ్లలో ఉంచాలి.

* పార్కింగ్‌ ప్రదేశం లోపల, బయట ఎక్కువ మంది గుమికూడి ఉండకూడదు. అక్కడ తప్పనిసరిగా భౌతిక

దూరం పాటించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.

* షాపులు, స్టాల్స్, కేఫ్ లుతమ పరిసరాల్లో భక్తులు భౌతిక దూరం పాటించేందుకు చర్యలు తీసుకోవాలి.

ఇందుకోసం

క్యూలైన్ ద్వారా à°† పరిసరాల్లో భౌతికదూరం పాటించేలా మార్కింగ్స్ వేయాలి. 

* లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి ప్రత్యేక గేట్ లు ఉండేలా చూసుకోవాలి.

*

లోపలికి వచ్చేటప్పుడు కనీసం 6 అడుగుల దూరం ఉంటూ క్యూలైన్ లో వెళ్లాలి.

* లోపలికి వెళ్లేసమయంలోనే సబ్బు లేదా శానిటైజర్ తో చేతులు, కాళ్లు కడుక్కోవాలి.

*

ఆలయంలో దేవతామూర్తులను, ఇతర ప్రార్థనా స్థలాల్లో పవిత్ర గ్రంథాలను తాకకూడదు.

* ప్రార్థనాలయాల దగ్గర ప్రసాదాలు/ పవిత్ర జలాలను చల్లడం, సామూహిక వంటశాలలు,

అన్నదానాల వద్ద భౌతిక దూరం పాటించాలి. 

* ప్రార్థనాలయాల పరిసరాల్లో పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, నీటి కుళాయిలు, కాళ్లు కడుక్కునే ప్రాంతాలవద్ద ప్రత్యేక

దృష్టిసారించాలి. 

* ఆలయాల్లోని వివిధ అంతస్తులను (ఫ్లోర్స్), పరిసర ప్రాంతాలను తరచూ శుభ్ర చేయడం, క్రిమిహారకం చేయడం తప్పనిసరి.

* భక్తులు, సందర్శకులు వదిలి

వెళ్లిన ఫేస్ కవర్లు, మాస్కులు, చేతి కవర్లను సరైన పద్దతిలో పారవేయడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి.

ఒకవేళ ఆలయ, మతపరమైన, ప్రార్థనా ప్రదేశాల్లో

అనుమానితుడు లేదా ధృవీకరించబడిన కేసు విషయంలో:

* అనుమానిత లక్షణాలు  à°µà±à°‚డే వ్యక్తి ఉన్న గదిలో ఉండే వ్యక్తుల నుంచి వేరు చేసి వెంటనే  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• ప్రదేశంలో

ఉంచాలి. 

అతను/ ఆమెను డాక్టర్ పరీక్షించే వరకు మాస్కు/ ఫేస్ కవర్ ఇవ్వండి

* వెంటనే స్థానికంగా ఉండే వైద్య సిబ్బందికి లేదా జిల్లా, రాష్ట్రస్థాయి హెల్ప్

లైన్ కు కాల్ చేయాలి

* వెంటనే వైద్యశాఖ నియమించిన సిబ్బంది అప్రమత్తమై తదుపరి చర్యలకు సిద్ధమవుతారు. అతని / ఆమెతో దగ్గరగా ఉన్నవారి పరిచయాలను గుర్తించడంలో

నిమగ్నమవుతారు.

* ఒకవేళ అతడు/ఆమె కోవిడ్-19 పాజిటివ్ కేసుగా నిర్ధారించబడితే వెంటనే ఆప్రాంతాన్ని క్రిమిసంహారకం చేయాలి.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam