DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వ పారిశుధ్య రూల్స్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలయ్యేనా?

*ప్రైవేట్ స్కూల్స్ à°ˆ ఖర్చు ను అదనంగా మోపే ఛాన్స్ !* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  à°œà±‚న్  06, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్ ):* కరోనా కట్టడి నుంచి

విద్యార్థులను రక్షించేందుకు ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విభాగం విధించిన నిబంధనలను కచ్చితంగా అన్ని పాఠశాలలో పాటించాల్సి యుంది.  à°…యితే ఆర్ధిక భారం కారణంగా

ప్రభుత్వ పాఠశాలల్లో వీటి ని ఏ మేరకు అమలు చేస్తారు అన్నది అధికారులకే తెలియాలి. ప్రస్తుతం ఉండవలసిన మౌలిక వసతులే అరకొరగా ఉన్నాయి. బాలికలకు వేరుగా శౌచాలయ

స్థానాలే లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. కనీస మంచినీటి సదుపాయం కూడా కరువే. పైగా 
కూర్చునే బెంచీలు కూడా తగినన్ని లేవు, ఉన్నవి కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్టు

తెలుస్తోంది. కొన్ని స్కూళ్లల్లో ఈ వనరులు ఉన్నప్పటికీ, గ్రామీణ స్థాయిలో మాత్రం వీటి కొరత కొట్ట వచ్చినట్టు కనపడుతోంది. కనీసం మంచి నీటి సదుపాయమే లేని

పాఠశాలల్లో శానిటైజర్స్ ఎలా అమర్చగలరు. అందునా మొత్తం పిల్లలు, ఉపాధ్యాయులు, సిబ్బందికి కూడా అవసరం ఉంటుంది. 
ఇప్పడికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మనిషికి మూడు

మాస్క్ లు ఇస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రే ప్రకటించినా, చాల మందికి మాస్క్ లు చేరని స్థితి ఉంది. గదుల్లో కూర్చుని ఇచ్చే ఆదేశాలకు, క్షేత్ర స్థాయిలో ఉన్న

అవకాశాలకూ నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది. వీటిని ప్రతి పాఠశాలలోనూ సమకూర్చుకోవాల్సిన భాద్యత స్కూల్ నిర్వాహకులదే అనే నిబంధన వస్తే మాత్రం,

ఉపాధ్యాయులు పూర్తిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. 

వీటి సంగతి ఇలా ఉంటె. . .ప్రయివేట్ పాఠశాలలు ఈ సౌకర్యాల పేరుతొ భారీగా ఖర్చును తల్లిదండ్రుల పై రోడ్డెందుకు

సిద్దమైపోయాయి. ఇప్పడికే కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు తమ స్కూల్ పేరిట మాస్క్ లను సిద్ధం చేసేశాయి. వీటిని కచ్చితంగా తమ స్కూల్లోనే కొనాలి అనే నిబంధనలు కూడా

సిద్దమైపోయాయి. ఇప్పడికే పుస్తకాలూ, యూనిఫార్మ్, బ్యాగ్, షూ వంటివి ఇక్కడే కొనాలి అనే నిబంధనలు అదనంగా ఈ శానిటైజర్, బ్లీచింగ్, పారిశుధ్యం, పేరిటా మరి కొంత

బాదేందుకు à°°à°‚à°—à°‚ సిద్ధమైపోయింది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam