DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరసవల్లి ఆదిత్యుని దర్శనానికి నిబంధనలు ఇవే: .  . .

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  à°œà±‚న్  06, 2020 (డిఎన్ఎస్ ):* శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం

స్వామివారి దర్శనం కు భక్తులు పాటించవలసిన నియమాలు.... తదితర విషయాలను గౌరవ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి హారి సూర్య ప్రకాష్ పలు సూచనలతో కూడిన పత్రికా

ప్రకటన విడుదల చేసారు. నిబంధనలు ఇవే. . . వీటిని ప్రతి ఒక్క భక్తుడు, ఆలయ సిబ్బంది పాటించాలన్నారు. 

1. భక్తులు ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు, సెల్ ఫోన్

నెంబరు తప్పనిసరిగా తీసుకు రావలెను.

2. దేవాలయానికి వచ్చే ప్రతి భక్తుడు నోరు ముక్కు కవర్ చేస్తూ మాస్కు ధరించిన వారిని మాత్రమే దర్శనమునకు అనుమతించ బడును.

 à°¬à°¯à°Ÿà°•à± వెళ్లే వరకు మాస్కు తప్పని సరిగా ఉంచుకోవలెను.

3. దేవస్థానం బయట ఏర్పాటుచేసిన కుళాయి వద్ద కాళ్లు చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవలెను.

4. ఆలయ ప్రవేశ

ద్వారము వద్ద ధర్మల్ గన్ తో జ్వరం చూసి లేని వారిని మాత్రమే లోపలికి అనుమతించబడును.

5. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటుచేసిన శానిటైజర్ తో చేతులు శుభ్రం

చేసుకోవలెను.

6. ప్రతి భక్తుడు సర్కిల్ ద్వారా ఆరు అడుగు ల దూరం పాటించి ఒకరి వెనుక ఒకరు మాత్రమే దర్శనం చేసుకోవలెను.

7. భక్తులకు అంతరాలయం, గర్భాలయ దర్శనం

తాత్కాలికంగా నిలుపుదల చేయడమైనది, భక్తులకు లఘు దర్శనం మాత్రమే అనుమతించ బడును.

8. భక్తులు ఉచిత దర్శనం మరియు శీఘ్ర దర్శనం ద్వారా మాత్రమే దర్శనములు

చేసుకోవలెను.

9. శ్రీ స్వామివారి తీర్థ ప్రసాద వితరణ మరియు అన్నప్రసాదం తాత్కాలికంగా నిలుపుదల చేయడమైనది.

10. ఆలయ దర్శనమునకు 65 సంవత్సరాలు పైబడిన వారిని, పది

సంవత్సరముల లోపు పిల్లలు, గర్భిణీ, షుగరు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడు వారికి ఆలయ దర్శనములు వాయిదా వేసుకోవాలని సూచన చేస్తున్నాము.

11. స్వామి వారి దర్శన

సమయములు ఉదయం 6:30 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు మాత్రమే ఉంటుంది. పవళింపు సేవ సమయంలో స్వామివారి దర్శనం నిలుపుదల వేయబడును.

12. దేవాలయంలో ప్రదక్షిణములు, ఇంద్ర

పుష్కరిణిలో స్నానం లు తాత్కాలికంగా నిషేధించడమైనది.

13. 8, 9 తేదీల్లో అరసవల్లి, కాజీపేట గ్రామస్తులను ట్రై ల్ రన్ లో భాగంగా స్వామివారి దర్శనం కు

అనుమతించబడును.

14. 10 వ తేదీ నుండి అందరి భక్తులకు స్వామివారి దర్శనం కు అనుమతించబడును.

రక్షణ చర్యలను పాటిద్దాం... మన కుటుంబాన్ని మన సమాజాన్ని కరోనా

మహమ్మారి నుండి కాపాడుకుందాం అన్నారు. భక్తులు దేవాలయ అర్చకులకు, సిబ్బందికి సహృదయంతో సహకరించ వలసినదిగా ప్రార్థిస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam