DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం పోలీసుల చెరలో మహిళల మర్దర్ల నరరూప రాక్షసుడు

*వివాహేతర సంబంధ మోజు, వికటించి మూడు ప్రాణాలు తీసాడు.* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  à°œà±‚న్  06, 2020 (డిఎన్ఎస్ ):* మహిళలతో

వివాహేతర సంబంధం పెట్టుకుని, తదుపరి ప్రాణాలు తీసిన నరరూప రాక్షసుణ్ణి శ్రీకాకుళం పోలీసులు అరెస్ట్ చేసారు. శనివారం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆర్ ఎన్

అమ్మిరెడ్డి నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం . . . .

నిందితుడు ఒడిశా రాష్ట్రం జగపతి జిల్లా వలకభద్ర పంచాయతీ à°•à°¿ చెందిన సవర రమేష్‌

మహిళలపై మోజుతో వారితో వివాహేతర సంబంధాల మోజుతో, ఆపై వివాదాల కారణంగా ముగ్గురిని హతమార్చినట్టు తెలిపారు. ఇతని భార్యకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో అతని కళ్లు

అందరి ఆడవాళ్లపై పడ్డాయి.  2016లో లో  à°¦à°¾à°¸à±‡à°Ÿà°¿ దమయంతి అనే మహిళ తనను నిరాకరించిన కారణంగా అంతమొందించాడు. ఆపై తెలంగాణ పారిపోయి 2017 లో ముచ్చిక కోసమ్మ అనే ఆమెతో వివాహేతర

సంబంధం పెట్టుకున్నాడు. వారిద్దరి మధ్య వివాదం రావడంతో ఆమెను కూడా హత్య చేశాడు. తర్వాత శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం పుట్టపురం గ్రామం వచ్చి

తలదాచుకున్నాడు. అక్కడ దండు జయంతి అనే మహిళతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈమెకు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చెయ్యడంతో వివాదం పెరగడంతో చివరకు ఆమెనూ 2019

డిసెంబర్‌లో హతమార్చాడు. జయంతిని హత్యచేసి, సమీపంలో ఉన్న కాల్వలో పడేసి పరారయ్యాడనీ ఎస్పీ తెలిపారు. ఈమె మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నాలుగు నెలల తర్వాత

శ్రీకాకుళం జిల్లా పోలీసులు à°ˆ నరరూప రాక్షసుణ్ణి అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 

ఈ రాక్షసుణ్ణి పట్టుకోవడంలో నేర పరిశోధనలో ప్రతిభ కనబరిచిన పాతపట్నం సీఐ

ఆర్‌.రవిప్రసాద్, సారవకోట ఎస్సై వై.రవికుమార్, హెచ్‌సీ జె.సింహాచలం, పీసీలు శ్రీను, రవికుమార్‌లకు ఎస్పీ నగదు రివార్డులు అందజేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam