DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా కట్టడికి అన్ని శక్తులు ఒడ్డుదాం, కలెక్టర్ నివాస్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూన్ 10, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లాలో కరోనా కట్టడికి అన్ని శక్తులు ఒడ్డుదామని జిల్లా

కలెక్టర్ జె నివాస్ పిలుపునిచ్చారు. బుధ వారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కరోనా ప్రత్యేక అధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్

నివాస్ మాట్లాడుతూ రానున్న రెండు నెలలు కీలకమైనవన్నారు. మే 3వ తేదీ తరువాత పరిస్ధితుల్లో చాలా మార్పు వచ్చిందని, రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు సంభవించే

అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. à°—à°¤ 80 రోజులుగా  à°ªà±à°°à°¤à°¿ ఒక్కరూ రేయింబవళ్లు శ్రమించి చేసారని అభినందిస్తూ, అదే ఉత్సాహం, శక్తితో మరికొద్ది రోజులు పనిచేయాలని

కోరారు. ప్రస్తుత పరిస్ధితులను చూస్తూ రిలాక్స్ అయితే ఇంతకు పదింతలు పనిచేయాల్సి ఉంటుందని ఆయన సూచించారు. జూన్, జూలై నెలల్లో రిలాక్స్ అయితే కరోనా కేసుల సంఖ్య

భారీగా పెరుగుతుందని అన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారు భారీగా ఉంటారనే అంచనాలకు తగిన విధంగా 20 వేల మందికి పైగా జిల్లాకు వచ్చారని చెప్పారు. ఐదవ విడత ఇంటింటి

సర్వే పక్కాగా జరిగేటట్లు కృషి చేయాలని అన్నారు. పట్టణ ప్రాంతాల్లోనే అన్ని చోట్లా దాదాపు 75 శాతం కేసులు వస్తున్నాయని గమనించాలని పేర్కొన్నారు. వయోవృద్ధులు,

చిన్నారులు బయటకు రాకుండా చూడాలని ఆయన చెప్పారు. ఎ.ఎన్.ఎం యాప్ లో వృద్ధుల వివరాలు నమోదు చేయాలని, వారిని కనీసం 3 రోజులకు ఒకసారి పరిశీలించాలని ఆదేశించారు. కొత్త

వ్యక్తులు ఎవరు వచ్చినా పట్టణ ప్రాంతాల్లో వారి వివరాలు వార్డు – శానిటరీ కార్యదర్శి తెలియజేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో వి.ఆర్.à°“ తెలియజేయాలని ఆదేశించారు. హోమ్

క్వారంటీన్ కు పంపిన వ్యక్తులు విధిగా హోమ్ క్వారంటీన్ ను పాటించాలని అన్నారు. ఇటీవల హోమ్ క్వారంటీన్ లో ఉండే వ్యక్తి బయట తిరిగి 7 వందల మందిని కలిసారని చెప్పారు.

ఇటువంటి సంఘటనలు పునరావృతం కారాదని అటువంటి వారిపై చర్యలు చేపడతామని స్పష్టం చేసారు. పాఠశాలలకు నాడు నేడులో జరుగుతున్న పనులను పరిశీలించి త్వరగా పూర్తి అయ్యే

విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 
    à°ˆ సమావేశంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి జి.శ్రీనివాసరావు, సిపిఓ à°Žà°‚.మోహన రావు, నగర పాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య,

 à°œà°¿à°²à±à°²à°¾ బిసి సంక్షేమ అధికారి కె. కృత్తిక, మత్స్య శాఖ జెడి à°¡à°¾.వి.వి కృష్ణ మూర్తి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె వి ఆదిత్య లక్ష్మి, జిల్లా ఖజానా అధికారి

జి.నిర్మలమ్మ, ఆర్డబ్ల్యుఎస్ టి.శ్రీనివాసరావు, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఎడి జీవన్ బాబు, చేనేత జౌళి శాఖ ఏడి పద్మ, ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ

అధికారి à°Žà°‚.చెంచయ్య,  à°œà°¿à°²à±à°²à°¾ విద్యాశాఖ అధికారి కె. చంద్ర à°•à°³, గృహ నిర్మాణ సంస్థ పిడి à°Ÿà°¿.వేణుగోపాల్, ఆరోగ్య శ్రీ జిల్లా సమన్వయ అధికారి సాయిరాం, జిల్లా అగ్నిమాపక

అధికారి సిహెచ్. కృపావరం, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, బి.సి కార్పొరేషన్ ఇడి జి.రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam