DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మానవాళి సౌభాగ్యం కోసం స్వామిని ప్రార్ధించాం: సంచయిత

*భక్తులకు శ్రీ వరాహ లక్ష్మి నృసింహుని స్వామి దర్శనం*  

*హిందూ సంప్రదాయపరంగా తొలిసారి ఆలయానికి చైర్ పర్సన్ రాక* 

*తెరుచుకున్న సింహగిరి క్షేత్ర ఆలయ

ద్వారాలు* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*: . . .

*విశాఖపట్నం,  à°œà±‚న్  11, 2020 (డిఎన్ఎస్):* దాదాపు 80 రోజుల విరామం తర్వాత సాధారణ భక్తులకోసం హిందూ దేవాలయాల

ద్వారాలు తెరుచుకున్నాయి. ఈ క్రమం లోనే విశాఖపట్నం సమీపంలోని శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం సింహాచల ఆలయం లో గురువారం నుంచి భక్తులకు ప్రవేశం

కల్పిస్తున్నారు. à°ˆ సందర్బంగా దేవస్థానం అనువంశిక ధర్మకర్త ( ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్) సంచయితా గజపతి తొలి దర్శనం చేసుకున్నారు.  à°ˆ నెల 8 నుంచి ఆలయాల్లో భక్తులకు

ప్రవేశాన్ని అనుమతించిన, మొదటి రెండు రోజుల పాటు ఆలయ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రవేశం కల్పించి, భద్రతా ఏర్పాట్లను పరిశీలించుకున్నారు. అనంతరం

గురువారం ( 11 à°µ తేదీ ) నుంచి సామాన్య భక్తులకు కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్ల మధ్య ఆలయ ప్రవేశం కల్పిస్తున్నారు.  

ఈమె  à°ªà±‚ర్తిగా హిందూ సంప్రదాయపరంగా తొలిసారి

ఆలయానికి రావడం గమనార్హం. గతంలో జుట్టు ముడి లేకుండా ఈమె ఎన్నో సార్లు ఆలయానికి రావడంతో అర్చకులు, వైదికులు, భక్తులు అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే.. 

à°ˆ

సందర్భంగా సర్వ మానవాళికి సంపూర్ణం ఆరోగ్యం లభించి, కరోనా వంటి విశూచి మహమ్మారి నుంచి పూర్తిగా రక్షణ కల్పించాలని వరాహ లక్ష్మి నృసింహుని ప్రార్ధించినట్టు

తెలిపారు. స్వామీ దివ్య ఆశీస్సులు మన అందరిమీదా ప్రసరించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అనంతరం భక్తుల కోసం ఆలయ అధికారులు చేపట్టిన ఏర్పాట్లను

పరిశీలించారు. 

ఏప్రిల్ 26 న స్వామి నిజరూప దర్శనం కూడా కరోనా కట్టడి లో కలిసిపోవడంతో భారీ సంఖ్యలో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాన్ని రానుండడంతో

పూర్తి భద్రతా, రక్షణా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. స్వామి దర్శనానికి వచ్చే ప్రతి భక్తునికి శానిటైజర్ ద్వారా చేతులు శుభ్రపరుచుకునేందుకు, ధర్మల్ స్కానర్

ద్వారా ఉష్ణోగ్రత పరిశీలనా, కనీసం ఆరు అడుగుల దూరం పాటించేలా తగు ఏర్పాట్లు చేసినట్టు తెలియచేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam