DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, భారీ వర్ష సూచన

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  à°œà±‚న్  11, 2020 (డిఎన్ఎస్):* తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం. ఏర్పడిందని, రానున్న 48గంటల్లో అది పశ్చిమ వాయవ్యంగా

పయనించి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖా తెలియచేస్తోంది. à°ˆ ప్రభావంతో ఇప్పటికే కోస్తాలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి.  à°°à°¾à°¨à±à°¨à±à°¨ 24గంటల్లో

కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ

వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇటు నైరుతి  à°‹à°¤à± పవనాలు రాష్ట్రంలో విస్తరిస్తుండటంతో వర్షాలు

మొదలయ్యాయి. కోస్తా, రాయలసీమల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడ్డాయి. విశాఖపట్నం, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో

ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచాయి. గుంటూరు, పశ్చిమ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా వర్షాలు కురిశాయి. వర్షాలు కురుస్తుండటంతో

రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam