DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆపద్బాంధు సోనూ సూద్ కు పెరుగుతున్నఆర్తుల వినతుల ఉప్పెన

*నేటికీ కొనసాగుతున్న సోనూసూద్ నిస్వార్ధ సేవ, ఇంటి బాటలో ఆర్తులు* 

*ప్రభుత్వం పలుకుతుందో లేదో తెలియదు, సోనూ మాత్రం పలుకుతాడు*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS.

బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  à°œà±‚న్  10, 2020 (డిఎన్ఎస్):* à°—à°¤ కొన్ని వారాలుగా అత్యంత నిస్వార్థంగా ఆర్తుల సేవలో తలమునకలైన సినీ ధృవ తార సోనూ సూద్ కు వినతుల

వెల్లువ ఉప్పెనలా వచ్చి పడుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో అర్ధాంతరంగా వీధుల్లో నిలిచి పోయిన వలస కార్మికులకు ఆహారం అందించాలనే సంకల్పంతో మొదలైన సోనూ సూద్ సేవ

ప్రస్థానం, నేడు కార్మికులను ఇళ్లకు సురక్షితంగా చేర్చే వరకూ చేరింది. ముందుగా ముంబై వరకే పరిమితమైన ఈ చర్య విస్తరించి మహారాష్ట్రలోని చాల చోట్లకు చేరింది.

ఎటువంటి మీడియా ప్రచారం చేసుకోకుండా కేవలం సోషల్ మీడియా ద్వారానే తన కార్యాచరణ నేటికీ నిర్వహిస్తున్నాడు. ఒక్కొక్కరి నుంచి వస్తున్నా వినతులు చూసి కన్నీటి

పర్యంతం అవుతున్నసందర్భాలు, అనంతరం శుభ పరిణామాలను లబ్ధిదారుల ద్వారానే మీడియా కు తెలుస్తున్నాయి. ఇలా సోనూ సూద్ ద్వారా సురక్షితంగా ఇంటికి చేరిన ఒక

ప్రగ్నెంట్ మహిళా తనకు పుట్టిన బిడ్డకు సోనూసూద్ శ్రీవాస్తవ అని పేరుపెట్టుకుంది అంటే ఆమె ఎంతగా అభిమానించిందో తెలుస్తోంది. 

ఇలా సూద్ కు చేరుతున్న

వెల్లువలో రెండు రోజుల క్రితం వచ్చిన వినతి ద్వారా సోనూ సూద్ చెలించిపోయాడు. వారణాసి లో ఉన్న ఒక మహిళా మరణించడంతో ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు ముంబై పరిసర

ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. అంత్య క్రియల్లో పాల్గొన వలసిన వీరు తమ గ్రామానికి ( వారణాసి) కి చేరుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడం తో వీరి ప్రక్క

ఇంటి వ్యక్తి వీరి ఆవేదనను సోను సూద్ కు ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ వారికీ ఎలాగైనా సాయం చెయ్యమని కోరాడు. దీంతో వెంటనే స్పందించిన సోను సూద్, ఇలాంటి బాధ

ఎవరికీ రాకూడదని, తక్షణం వారిని వారణాసి పంపే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మాట ఇచ్చినదే తడవుగా వారికీ ప్రయాణ ఏర్పాట్లు జరిగిపోయాయి. 

సోను సూద్

చేస్తున్న నిస్వార్ధ సేవకు ఆకర్షితులైన ఇండియన్ ఇస్టిట్యూట్ అఫ్ మేనేజ్మెంట్ (ముంబై ) విద్యార్థులు కూడా తోడయ్యారు. ఒక పకడ్బందీ ప్రణాళికతో వారు ముందడుగు

వేస్తున్నాయి. 

అయితే ఎటువంటి రాజకీయ సంబంధం లేకుండా తన సొంత ఖర్చుతోనే సోనూ సూద్ చేస్తున్న నిస్వార్ధ సేవ కు సహకరించవలసిన కొందరు ప్రజా ప్రతినిధులు

విమర్శలు చెయ్యడం కూడా గమనార్హం. అయితే వీటిని ఏమాత్రం పట్టించుకునే తీరిక కూడా లేకుండా వెండి తెర ధృవతార తన పని తానూ చేసుకు పోతున్నాడు. 
 
ఇతను వెండితెరపై

వేసే పాత్రలన్నీ విలన్ పాత్రలే.   అయితే నిజ జీవితంలో ఇతనొక మహా శక్తిగా, ప్రజల పాలిట ఆపద్బాందువుగా వెలిగిపోతున్నాడు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam