DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గా అమిత్ బర్దర్ బాధ్యతలు స్వీకరణ

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూన్ 15, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గా అమిత్ బర్దర్ సోమవారం  బాధ్యతలు స్వీకరించారు.  జిల్లా శాంతిభద్రతల  పైన,  covid 19 కరునా  వైరస్ కేసుల ప్రస్తుత పరిస్థితి పైన డీఎస్పీలు సీఐలు లతో కొంత సమయం మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని అవగాహన

చేసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పోలీస్ ప్రజా సంబంధాలు మెరుగు పరిచే దిశలో ప్రత్యేక దృష్టి సారిస్తామని, ప్రజా సమస్యలపై చట్టపరంగా వందశాతం న్యాయం చేస్తామని తెలిపారు. 

జిల్లాలో ప్రస్తుతం నడుస్తున్న సమస్యలు నా దృష్టికి వచ్చాయని, ప్రస్తుతమున్న  క్లిష్ట సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని,

 కరోనా వైరస్ నివారణ లో రెవెన్యూ,  మెడికల్, పోలీస్ సమన్వయంతో పని చేస్తామన్నారు. క్వారంటైన్ లో ఉన్న వలస కూలీల తో మర్యాదగా మాట్లాడాలని, మంచి సేవలు అందిస్తామన్నారు. 

ఇసుక అక్రమ రవాణాపై సమాచారం ఇస్తే తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి గుట్కా వంటి మత్తుపదార్థాల రవాణాపై ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వం నిబంధనలు విధించిందని, తెలిపారు. అనారోగ్య కారకము లైన మత్తు పదార్థాల వలన ప్రజలు,  యువత పురోగతి కోల్పోతారని కచ్చితంగా వీటిపై దృష్టి సారిస్తున్నారు. 
జిల్లాలో కొంత మేర పర్యటన అనంతరం పూర్తి అవగాహన వస్తుందని, తదుపరి  అవసరం మేర చట్టాలను అమలుపర్చి,  కచ్చితంగా శాంతిభద్రతలను విఘాతం కలగకుండా అధికారులు

కు,సిబ్బందికి దిశా నిర్దేశం చేస్తామన్నారు.

అంతకు ముందు అదనపు ఎస్పీ (అడ్మిన్ ) పి. సోమశేఖర్ ఆయనకు ఆహ్వానం పలికారు. అదనపు ఎస్పీ (SEB) కే శ్రీనివాసరావు,  డిఎస్పీలు, సిఐలు, పోలీస్ అధికారులు, కార్యాలయ సిబ్బంది, వివిధ విభాగాల అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు 

అనంతరం ఎస్పీ అమిత్ బర్డర్ జిల్లా కలెక్టర్

డాక్టర్ జె. నివాస్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam