DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై కూడా జాగ్రత్త వహించాలి: పగో జిల్లా ఎస్పీ   

*దెందులూరు పీఎస్ లో ఎస్పీ నారాయణ నాయక్ ఆకస్మిక తనిఖీ* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  16, 2020 (డిఎన్ఎస్):* *పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై కూడా జాగ్రత్త వహించాలని, ఆరోగ్యంగా ఉంటేనే విధులు సక్రమంగా చేయగలరని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ తెలియచేసారు.  మంగళవారం

ఆకస్మికముగా దెందులూరు పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీలు నిర్వహించారు. సదరు తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలని క్షుణ్ణంగా పరిశీలించి దెందులూరు ఎస్సై ని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని స్టేషన్ రూమ్స్ లో అనవసరం అయినటు వంటి వస్తువులను ఉంచరాదని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం లభిస్తుందని, ప్రతి

ఒక్కరూ తప్పని సరిగా మాస్క్ లు ధరించాలని సూచించారు. 
అలాగే నేషనల్ హైవే పై జరిగే రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను ఏ విధంగా తరలించాలి, ఏదైనా వాహనం రహదారికి అడ్డంగా ఉన్న వాటిని తొలగించే నిమిత్తం ఉపయోగించే  సాధనాలను గురించి, హైవే మొబైల్ యొక్క స్థితిగతులను గురించి వాటి యొక్క పనితీరును గురించి అడిగి

తెలుసుకున్నారు, ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తగిన సూచనలను సలహాలు ఇచ్చారు. 

ఈ సందర్భంగా దెందులూరు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కను నాటారు. అనంతరము  పోలీస్ ప్రధాన కార్యాలయం నందు గల అన్ని విభాగాలను పరిశీలించి సదర్ విభాగాల యొక్క అధికారులను వారికి

కల్పించినటువంటి మౌలిక సదుపాయాలను గురించి ఆ విభాగాల్లో పని చేసే సిబ్బంది  యొక్క పని తీరును గురించి పరిశీలించి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. 
పోలీసు ప్రధాన కార్యాలయంలో ముఖ్యముగా మినిస్టర్స్ స్టాఫ్, కమ్యూనికేషన్స్ ఆఫీసు, డి. సి. ఆర్. బి, ఐ. టి కోర్ విభాగములో ఫింగర్ ప్రింట్ మరియు క్లూస్ టీం లలో  సాంకేతికంగా అనుభవం

కలిగినటువంటి సిబ్బందిచే పోలీస్ శాఖ నిర్వహించే విధులు గురించి, పోలీస్ వారు నిర్వహించే ప్రతి ఒక్క రికార్డును సి.సి. టి.ఎన్.యస్ లో  అప్లోడ్ చేసే విభాగము నందు ప్రతి ఒక్క ఉద్యోగి నిర్వహించే విధులను గురించి వారి యొక్క పని తీరును గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రధాన కార్యాలయంలో రిసెప్షన్ సెంటర్

వద్ద స్పందన కార్యక్రమములో ఫిర్యాదులు ఇచ్చే ఫిర్యాదులను ఏ విధముగా అధికారుల సమక్షంలో పెట్టాలి, ఆ ఫిర్యాదులను పై అధికారుల యొక్క ఉత్తర్వులపై కింద అధికారులకు పంపించి సదరు ఫిర్యాదులో తీసుకున్న చర్యలను గురించి కంప్యూటర్ లో నిక్షిప్తం చేసే విధానం, తదితర విషయాలను రిసెప్షన్ సెంటర్లో ఉద్యోగ నిర్వహణ చేసే అధికారులను అడిగి

తెలుసుకున్నారు. 

పోలీస్ క్యాంటీన్ సందర్శించి, అక్కడ క్యాంటీన్ లో లభించేటటువంటి ఆహార పదార్థాల నాణ్యత, ఆహార పదార్థముల రేట్లు వాటి వివరములను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్మ్డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయం నందు తుపాకులను, మందుగుండు సామాను లు భద్రపరిచే విషయాలను, సిబ్బంది కి కల్పిస్తున్న మౌలిక

సదుపాయాలను, డాగ్ స్క్వాడ్ పనితీరును తెలుసుకున్నారు. 
పోలీస్ సిబ్బందికి వైద్య సదుపాయం కల్పించే ఆసుపత్రు నీ పరిశీలించి అక్కడ అ సిబ్బందికి కల్పించే వైద్య సదుపాయాన్ని మరియు మందుల గురించి పోలీస్ ఆస్పత్రి డాక్టర్ జి దీప ను అడిగి తెలుసుకున్నారు. 

వ్యాయామశాలను దానిలో ఉన్న వ్యాయామము సాధనాలను గురించి

అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ సబ్సిడీ కాంటీన్ నందు లభించే వస్తువులను పరిశీలించి సబ్సిడీ క్యాంటీన్ ద్వారా పోలీస్ అధికారుల కుటుంబాలకు కల్పించేలా లాభాలను గురించి  అధికారులను అడిగి తెలుసుకున్నారు.  

ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ నాయక్ మాట్లాడుతూ సిబ్బంది యొక్క సంక్షేమం కొరకు తాను ముందు ఉంటానని

సిబ్బందికి ఏది అయినా నా అవసరం వచ్చినప్పుడు   సంప్రదించిన ఎడల వెంటనే  సిబ్బందికి సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసినారు.
ఎస్పీతో పాటుగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ కరీముల్లా షరీఫ్, ఏఆర్ అదనపు ఎస్పి మహేష్ కుమార్,  యస్.బి. డి ఎస్ పి. కె శ్రీనివాసాచారి, యస్.బి సిఐ రజినీ కుమార్, అర్. ఐ  కృష్ణంరాజు, ఎం.

టి ఆర్  ఐ శ్రీనివాస రావు, అర్.యస్. ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam