DNS Media | Latest News, Breaking News And Update In Telugu

త్వరలోనే నర్సాపురం వైకాపా ఎంపీ బీజేపీ గూటికి చేరేనా?

*సీఎం కు దక్కని అపాయింట్మెంట్ రఘుకు ఎలా వచ్చింది?*

*ఎంపీ ని పేరుపెట్టి మోడీ పలకరించేంత పలుకుబడి ఉందా? 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  16, 2020 (డిఎన్ఎస్):* అధికార పార్టీలో రచ్చకెక్కిన రాజకీయాలకు రాజధానిలో తెరపడే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో  వ్యక్తిగత గౌరవం తో నడుచుకునే నర్సాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) ఎంపీ రఘురామకృష్ణంరాజు త్వరలోనే భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. తనతో భేటీ కావాలని నేరుగా అమిత్ షా  నుంచే సమాచారం వచ్చినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులే తెలియచేస్తున్నారు. అయితే ఈయన

పార్టీ లో చేరతారా లేక, వైకాపాలోని రెబల్ గా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల పత్రికాముఖంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రికే చిర్రుకొచ్చేలా ఉండడంతో ఈయనపై వేటు తప్పదని తెలుస్తోంది. తన గెలుపుకు తానె కారణం తప్ప, వైఎస్ జగన్ కాదని, పైగా ఎన్నికల ముందు పార్టీ నేతలు తనను బ్రతిమాలుకుంటే పార్టీ లోకి వచ్చానే తప్ప ఎవరి

మెహర్బానీ యో పొందేందుకు కాదనే రీతిలో వ్యాఖ్యలు ఉండడమే ప్రధాన కారణంగా తెలుస్తున్నాయి. 

అయితే ఢిల్లీ లో బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు ముఖ్యమంత్రి కి సైతం అప్పోయింట్ మెంట్ లు దొరకని తరుణంగా ఒక ఎంపీ కి నేరుగా వారే అప్పోయింట్ మెంట్ ఇచ్చి సమావేశానికి ఆహ్వానించడం వెనుక చాల కధనం

నడిచినట్టు తెలుస్తోంది. 

మోడీ వద్ద పలుకు బడి జాస్తి. . .

ఒకానొక సమయంలో పార్లమెంట్ లోకి ప్రధాని ప్రవేశిస్తున్న తరుణంలో అక్కడే ఉన్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ్ణరాజు ను మోడీ పేరు పెట్టి మరీ పలకరించడం మరో ఎంపీ విజయసాయి రెడ్డి కంట పడడం తో అంతర్గత విభేదాలు రచ్చకెక్కినట్టు తెలుస్తోంది. అక్కడే ఉన్న

విజయ సాయి రెడ్డి వంక మోడీ కనీసం చూడక పోవడం దీనికి మరింత ఆద్యం పోసినట్టయింది. 
ఇటీవల జరిగిన జగన్ ఏడాది పాలనలో స్యాండ్, ల్యాండ్, వైన్ మాఫియా తో సహా కుల రాజకీయాలను ఎండగట్టిన ఆయన ఈ సారి పార్టీకి భారీ షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ఢిల్లీ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన రఘురామ కృష్ణమరాజు

అపాయింట్మెంట్ 

దక్షిణ లో గోరు మోపేందుకే. . .

వైఎస్ఆర్ కాంగ్రెస్ లో జరుగుతున్న అంతర్గత అసంతృప్తులను తమకు అనుగుణంగా మార్చుకోవాలనే ధోరణిలో బీజేపీ అగ్రనాయకత్వం రఘును కదిపిందనే వాదన వినిపిస్తోంది. దానిలో భాగమే ఎంపీ రఘురామ కృష్ణమరాజు కి ఆగమేఘాల పై అపాయింట్మెంట్ దొరికింది అని హస్తిన సమాచారం.
/>  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam