DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రానున్న రెండు నెలలు అతి కీలకం కానున్నాయి : కలెక్టర్ నివాస్

*సామాజిక ఆసుపత్రుల వైద్యులతో శ్రీకాకుళం కలెక్టర్ సమీక్ష*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూన్ 17, 2020 (డిఎన్ఎస్):* రానున్న రెండు నెలలు అతి కీలకం అని, వైరస్ వ్యాప్తి తగ్గించగలగాలని సూచించారు. 


సామాజిక ఆసుపత్రుల వైద్య అధికారులతో జిల్లా పరిషత్ సమావేశ

మందిరంలో జిల్లా కలెక్టర్ జె నివాస్ సమీక్షనిర్వహించారు. బుధవారం జరిగిన ఈ సమావేశంలో జిల్లాకు వచ్చిన ప్రతి వలస కూలీకి పరీక్షలు జరపాలని సూచించారు. ఆసుపత్రిలో జ్వరం తదితర రుగ్మతలతో ఐసోలేషన్ లో చేరిన వారి వివరాలు తెలియజేయాలన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ప్రతి సిహెచ్సికి 250 పిపిఇ కిట్స్ వరకు

సరఫరా చేస్తామన్నారు.  ప్రతి కేసులో కోవిడ్ ప్రోటోకాల్ విధిగా పాటించాలని, సివియర్ రెస్పీరేటరీ అక్యూట్ ఇన్ఫెక్షన్(సారి) కేసులు వస్తే తక్షణం స్పందించాలని, జిల్లాలో 84 సారి కేసులు వచ్చాయన్నారు. అత్యవసర కేసులను గుర్తించి వెంటనే పరీక్షలు చేయాలన్నారు. సిహెచ్సి, ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ చికిత్సపై పూర్తి దృష్టి

సారించాలని తెలిపారు. మీ రక్షణ చూసుకుంటూనే పరీక్షలు చేయాలి. పిపిఇ విధిగా ధరించాలని ఆదేశించారు. వివరాలన్నీ రియల్ టైంలో రావాలని తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులలో సమావేశం నిర్వహించి సారి కేసులు వస్తే తక్షణం సమాచారం అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.  

40 వేల మందిని క్వారంటీన్ లో పెట్టి పరీక్షలు చేసిన ఏకైక

జిల్లా శ్రీకాకులమేనన్నారు. వైరస్ వ్యాప్తి కాకూడదని అన్ని చర్యలు తీసుకున్నాం అని, కేసులు ఏ విధంగా వస్తాయో తెలియని స్థితి. పూర్తి సంసిద్ధంగా ఉండాలని, కేసులు, వాటి కాంటాక్టుల వివరాలు తీసుకోవాలని తెలిపారు. 80 శాతం కేసులలో కరోనా లక్షణాలు కనిపించడం లేదని, కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తుల ద్వారా త్వరగా వ్యాప్తి జరిగే అవకాశం

ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందన్నారు. చైనా వంటి కొన్ని దేశాల నుండి వచ్చే వారిలో లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. నమూనాలు సేకరించడంలో ఆలస్యం జరిగితే ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల సేకరణలో సమస్యలు వస్తాయన్నారు. 

ఈ సమీక్షలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.చెంచయ్య, డిసిహెచ్ఎస్ డా.బి.సూర్యారావు, డిప్యూటీ

డిఎంహెచ్ఓ డా నరేష్ కుమార్, వైద్యులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam